MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • న‌వీన్ యాద‌వ్ ఎంత మొండివాడో... ఆయన విజయానికి కారణం కూడా ఇదే

న‌వీన్ యాద‌వ్ ఎంత మొండివాడో... ఆయన విజయానికి కారణం కూడా ఇదే

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లో న‌వీన్ యాద‌వ్ విజ‌యం దిశ‌గా దూసుకెళ్తున్నాడు. మ‌రికాసేప‌ట్లో ఆయన విక్ట‌రీ అధికారం కానుంది. ఈ నేప‌థ్యంలో న‌వీన్ యాద‌వ్ విజ‌య ప్ర‌స్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Narender Vaitla
Published : Nov 14 2025, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విద్యార్హతలు, ప్రారంభ జీవితం
Image Credit : Asianet News

విద్యార్హతలు, ప్రారంభ జీవితం

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. హైద‌రాబాద్‌లో జ‌న్మించిన నవీన్ యాదవ్ 2007లో బేగంపేటలోని CSIIT నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు అనంతరం యువత, స్థానిక ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇదే ఆయన ప్రజా జీవితానికి ఆరంభం.

25
సామాజిక, క్రీడా రంగాల్లో నాయకత్వం
Image Credit : X/KTR

సామాజిక, క్రీడా రంగాల్లో నాయకత్వం

నవీన్ యాదవ్ కేవలం రాజకీయంగానే కాదు, సామాజిక సంస్థలు, క్రీడా సంస్థల్లో కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. వాటిలో ముఖ్యమైనవి:

అధ్యక్షుడు – స్టేట్ యాదవ స్టూడెంట్ వింగ్

అధ్యక్షుడు – తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్

వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు – ఎన్జీవో ‘నవ యువ నిర్మాణ్’

ఈ కార్యక్రమాల ద్వారా ఆయన జూబ్లీహిల్స్, పరిసర ప్రాంతాల్లో తన ప్రభావాన్ని పెంచుకున్నారు.

Related Articles

Related image1
న‌వీన్ యాద‌వ్ ఆస్తులు ఎన్నో తెలుసా.? అప్పులు కూడా ఉన్నాయి..
Related image2
ఢిల్లీ ఉగ్ర లింకును బ్లాస్ట్ చేసింది మ‌న క‌ర్నూలు కుర్రాడే.. ఒక పోస్ట‌ర్‌తో మొత్తం గుట్టు లాగాడు
35
2014లో మొదటి అడుగు, ఓడినా జూబ్లీహిల్స్‌ను వదలలేదు
Image Credit : X/Telangana Congress

2014లో మొదటి అడుగు, ఓడినా జూబ్లీహిల్స్‌ను వదలలేదు

నవీన్ యాదవ్ 2009లో AIMIMలో చేరి, కొద్ది కాలం లోనే పార్టీకి ముఖ్య నాయకుడయ్యాడు. అసదుద్దీన్ ఒవైసీ విశ్వాసంతో 2014 జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన AIMIM అభ్యర్థిగా పోటీ చేశారు. అప్ప‌టికీ ఆయ‌న వ‌య‌సు 30 ఏళ్లు మాత్ర‌మే. ఈ ఎన్నిక‌ల్లో 41,656 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచారు. కేవ‌లం 9 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఓడిపోయిన తర్వాత కూడా జూబ్లీహిల్స్‌ను వదలకుండా, అదే నియోజకవర్గంలో పట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిగా ప‌నిచేశారు. అదే పట్టుదల ఆయనను ప్రజలకు దగ్గర చేసింది.

45
2018లో స్వతంత్ర అభ్య‌ర్థిగా
Image Credit : X/JafferyAzmath

2018లో స్వతంత్ర అభ్య‌ర్థిగా

2018లో పార్టీలో కొన్ని అంతర్గత సమస్యల కారణంగా ఆయన AIMIM నుంచి పోటీ చేయలేకపోయినా, స్వతంత్ర అభ్యర్థిగా రాణించాడు. కేవలం 10 రోజుల ప్రచారంతో 18,856 ఓట్లు సంపాదించి హైదరాబాద్‌లో స్వతంత్ర అభ్యర్థిగా ప్రత్యేక రికార్డు నమోదు చేశారు. ఈ ఫలితాలు కూడా ఆయనకు జూబ్లీహిల్స్‌లో ఉన్న బలమైన పట్టు, ప్రజాదరణను స్ప‌ష్టం చేశాయి.

55
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత విజయం దిశగా
Image Credit : Naveen Yadav Twitter

కాంగ్రెస్‌లో చేరిన తర్వాత విజయం దిశగా

2023లో నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో చేరి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పని చేశారు. 2014 నుంచి ఓటములు ఎదురైనా, ఒక్కరోజు కూడా ఆయన జూబ్లీహిల్స్‌ను వదలలేదు. అదే నిరంతర కృషి, ప్రజలతో సంబంధాలు, సామాజిక సేవ ఇవి ఆయనను తిరిగి బలమైన నాయకుడిగా నిలబెట్టాయి. జూబ్లీహిల్స్‌పై నమ్మకం, పట్టుదల, ప్రజల కోసం చేసిన నిరంతర పని ఇవే ఆయన విజయం వెనుకున్న అసలు కారణాలు.

About the Author

NV
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు.
హైదరాబాద్
తెలంగాణ
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved