నవీన్ యాదవ్ ఆస్తులు ఎన్నో తెలుసా.? అప్పులు కూడా ఉన్నాయి..
Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దాదాపు ఖరారైంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నవీన్ యాదవ్‌కు ఎన్ని ఆస్తులు ఉన్నాయి.? అప్పుల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నికల అఫిడవిట్‌లో కీలక వివరాలు
జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైఎన్నికలో కాంగ్రెస్ తరపున పోట చేసిన వి. నవీన్ యాదవ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో మొత్తం 30 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే, తనపై 7 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్‌కు తెలియజేశారు. తన భార్య వి. వర్షా యాదవ్ కూడాను సుమారు 8 కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించారు.
నవీన్ యాదవ్ ఆస్తుల విలువ ఎంత?
యాదవ్ అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఆస్తులు: సుమారు రూ. 30 కోట్లు
పెట్టుబడులు:
* కస్తూరి నవీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్.
* నవీన్ ప్రవీణ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్.
* వైజేఆర్ ఇన్‌ఫ్రా అండ్ రియల్టర్స్ ఎల్ఎల్‌పీ.
అదనంగా, సంగారెడ్డి, మెడ్చల్–మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లో వ్యవసాయ, అవ్యవసాయ భూములు ఉన్నట్లు వివరించారు.
భార్య వర్షా యాదవ్ ఆస్తులు
వర్షా యాదవ్ ప్రకటించిన ఆస్తులు:
* మొత్తం ఆస్తులు: సుమారు ₹8 కోట్లు
* బంగారం: ₹2.2 కోట్లు విలువ
* వెండి: ₹22.75 లక్షలు విలువ
అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు గత కొన్ని సంవత్సరాల్లో పెరుగుతున్నాయనే విషయం కూడా తెలుస్తోంది.
అప్పులు కూడా ఉన్నాయి..
యాదవ్ దంపతుల మొత్తం అప్పులు రూ. 75 లక్షలు ఉన్నాయి.
వారి వార్షిక ఆదాయం ఇలా ఉంది:
* నవీన్ యాదవ్ (FY 2024–25): రూ. 19.51 లక్షలు
* వర్షా యాదవ్ (FY 2023–24): ₹7.82 లక్షలు
ఇద్దరి ఆదాయంలో గత కొన్నేళ్లుగా స్థిరంగా వృద్ధి కనిపిస్తోంది.