20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంతేనా.?
Nitish Kumar: దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన బిహార్ ఎన్నికల ఫలితం వెలువుడతోంది. ఎన్డీయే విజయం ఖారారైన నేపథ్యంలో నితీశ్ కుమార్‌పై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నితీశ్ కుమార్‌పై అందరి దృష్టి
దాదాపు 20 ఏళ్లుగా బిహార్ సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ మళ్లీ పదవిలో కొనసాగుతారా అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. NDAకు మెజారిటీ వస్తే నితీశ్‌నే సీఎం చేస్తారా లేక BJP తమ నేతను ముందుకు తీసుకువస్తుందా అన్న అనుమానం ఉంది. సర్వేలు ప్రకారం నితీశ్ ప్రాచుర్యం కొంత తగ్గినట్లు తెలుస్తోంది. టేజస్వీ యాదవ్‌ను ఎక్కువ మంది ఎంపీలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని చాలా ఓపినియన్ పోల్స్ చెబుతున్నాయి.
నితీశ్ కుమార్ ఆస్తుల వివరాలు
బిహార్ సీఎం నితీశ్ కుమార్ డిసెంబర్ 2024లో ప్రకటించిన ప్రకారం, అతని వద్ద మొత్తం ఆస్తుల విలువ రూ.1.64 కోట్లుగా ఉంది.
ఆస్తుల వివరాలు:
చరాస్థులు: రూ.16.97 లక్షలు
స్థిర ఆస్తులు: రూ.1.48 కోట్లు
క్యాష్: రూ.21,052
బ్యాంకుల్లో: రూ.60,811
న్యూఢిల్లీ ద్వారకాలో ఒక ఫ్లాట్ మాత్రమే ఆయన పేరుపై ఉంది. 2023లో ఆయన మొత్తం ఆస్తులు రూ.1.64 కోట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
నితీశ్ కుమార్ బలహీనతలు
* 2024–2025లో వచ్చిన పలు సర్వేలు అతని ప్రాచుర్యం తగ్గిందని తెలిపాయి. టేజస్వీ యాదవ్‌ను ఎక్కువ మంది సీఎం ఎన్నికల కోసం ఫేవరెట్‌గా చూశారు.
* గత 10 ఏళ్లలో NDA–మహాగఠబంధన్ మధ్య అయిదుసార్లు మద్ధతు మార్చడంతో ఆయనను యూటర్న్ లీడర్‌గా అంటుంటారు. దీని వల్ల ఆయనపై నమ్మకం తగ్గిందని సర్వేలు చెబుతున్నాయి.
* ఇటీవలి కాలంలో ఆరోగ్య సమస్యలతో ఆయన ఎక్కువగా బయటకు రాలేదు. దీన్ని చూసి ఓటర్లు కొంచెం దూరంగా ఉన్నారని నిపుణులు చెబుతున్నారు.
* జూలై 2025లో వచ్చిన ఓ సర్వే ప్రకారం, 54% మంది మళ్లీ ప్రస్తుత MLAలకు ఓటు వేయకపోవచ్చని చెప్పారు.
* JD(U) స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి చాలా అరుదుగా వస్తుంది. కూటములపై అధిక ఆధారపడడం ఆయన బలహీనతగా కనిపిస్తుంది.
* యువ ఓటర్లు ఉద్యోగాల సృష్టి జరగలేదని విమర్శిస్తూ నితీశ్‌ను విమర్శిస్తున్నారు.
నితీశ్ కుమార్ బలాలు
* జీవిక దీదీ, మహిళలకు 50% రిజర్వేషన్, ఇటీవల చేసిన మహిళా రొజ్గార్ యోజన వంటి పథకాలతో మహిళలు నితీశ్‌కు బలమైన మద్దతు ఇస్తున్నారు. EBC, OBC, పైవర్గాల నుండి కూడా మంచి మద్దతు ఉంది.
* కొన్ని నియోజకవర్గాలలో మహాగఠబంధన్, ప్రశాంత్ కిషోర్ పార్టీ మధ్య ఓట్లు చీలడంతో NDAకి లాభం చేకూరొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
* నితీశ్‌కుమార్ పాలనలో బిహార్‌లో రోడ్లు, లా అండ్ ఆర్డర్ మెరుగుపడ్డాయి. ఈ కారణంగా ఆయనకు ‘సుశాసన్ బాబు’ అనే పేరు వచ్చింది.
* అవసరం వచ్చినప్పుడు కూటములు మార్చి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగల శక్తి, తెలివైన రాజకీయ నిర్ణయాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెడతాయి.
మళ్లీ సీఎం అవుతారా?
నితీష్ కుమార్ మళ్లీ సీఎం అవుతారా.? లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మహిళా ఓటర్లు, అతని అనుభవం, ప్రత్యర్థుల బలహీనతలు… ఇవన్నీ నితీశ్ కుమార్ని మరోసారి సీఎం కుర్చీకి చేర్చుతాయా? అన్న ప్రశ్నలు తలెత్తేలా చేస్తున్నాయి. వీటన్నింటికీ సమాధానం రావాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.