MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Most Expensive Areas in Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాలు ఇవే.. కోట్లు పెట్టినా ఇల్లు కొనడం కష్టమే!

Most Expensive Areas in Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాలు ఇవే.. కోట్లు పెట్టినా ఇల్లు కొనడం కష్టమే!

Most Expensive Areas in Hyderabad: హైదరాబాద్‌లో కోకాపేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ హబ్స్‌గా నిలిచాయి. ఇక్కడి మౌలిక సదుపాయాలు, ఐటీ ఉద్యోగాల డిమాండ్ ఇక్కడ ధరలను ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 29 2026, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ జోరు
Image Credit : Chatgpt

భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ జోరు

హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీ, చారిత్రక కట్టడాలే కాదు.. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ హబ్. ముఖ్యంగా సిటీలో కొన్ని ప్రాంతాల పేరు చెబితేనే గుండెల్లో గుబులు పుట్టేలా ధరలు ఉంటాయి. సామాన్యుల మాట దేవుడెరుగు, సంపన్నులు సైతం ఇక్కడ ఇల్లు కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.

మరి భాగ్యనగరంలో అసలుసిసలైన అత్యంత ఖరీదైన ప్రాంతాలు ఏంటి? ఏ ఏరియాలో రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ స్టార్స్ నుంచి బిజినెస్ టైకూన్ల వరకు: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ టాప్
Image Credit : Gemini AI

టాలీవుడ్ స్టార్స్ నుంచి బిజినెస్ టైకూన్ల వరకు: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ టాప్

హైదరాబాద్‌లో లగ్జరీ లైఫ్‌స్టైల్ అనగానే టక్కున గుర్తుకొచ్చే పేర్లు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్. జూబ్లీహిల్స్‌లో అయితే సినీ ప్రముఖులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు నివసించే అల్ట్రా లగ్జరీ విల్లాలు, ఇండిపెండెంట్ హౌసులు చాలానే ఉన్నాయి. ఇక్కడ అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు ధర సుమారు రూ.13,200 నుంచి రూ.23,900 వరకు పలుకుతుండగా, ప్రీమియం ప్లాట్లు లేదా స్థలాలు చదరపు గజానికి రూ.2.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు పలుకుతున్నాయి.

ఇక బంజారాహిల్స్ విషయానికి వస్తే.. ఇక్కడ ఖరీదైన హోటళ్లు, లగ్జరీ షాపింగ్ మాల్స్, టాప్ రెస్టారెంట్లు ఎక్కువ. పాత కాలం నాటి ధనిక వర్గాలకు ఇది మోస్ట్ ఫేవరెట్ స్పాట్. ఇక్కడ అపార్ట్‌మెంట్ ధరలు చదరపు అడుగుకు రూ.9,200 నుంచి రూ.15,900 వరకు ఉండగా, స్థలం ధర చదరపు గజానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షల దాకా ఉంది. సిటీ సెంటర్‌కు దగ్గరగా ఉండటం, భూమి తక్కువగా లభించడం వల్ల ఇక్కడ ధరలు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటాయి.

35
కొత్త తరం లగ్జరీ కేంద్రాంబో కోకాపేట్, నియోపోలిస్
Image Credit : Gemini AI

కొత్త తరం లగ్జరీ కేంద్రాంబో కోకాపేట్, నియోపోలిస్

ఇటీవల కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్న పేరు కోకాపేట్, నియోపోలిస్. పాత ప్రాంతాలతో పోలిస్తే ఇది కొత్తగా డెవలప్ అవుతున్నప్పటికీ, హైరైజ్ లగ్జరీ అపార్ట్‌మెంట్లు, హెచ్‌ఎండీఏ భూమి వేలాలు ఈ ఏరియాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

ఇక్కడ భూమి ధర సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల చదరపు గజం వరకు పలుకుతుండగా, ఎకరా రిజర్వ్ ధర అప్పట్లో రూ.120 కోట్ల వరకు పలికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండటం, అత్యాధునిక హంగులతో కూడిన ప్రాజెక్టులు వస్తుండటంతో హై-క్లాస్ జనం ఇక్కడ నివసించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

45
ఐటీ హ్యాపీనిస్ జోన్స్: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ
Image Credit : Gemini AI

ఐటీ హ్యాపీనిస్ జోన్స్: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ

ఉద్యోగ అవకాశాలు, గ్లోబల్ కంపెనీల రాకతో హైదరాబాద్‌లోని పశ్చిమ భాగం పూర్తిగా మారిపోయింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మదాపూర్, రైదుర్గ్ ప్రాంతాలు ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్డు సదుపాయం ఉండటంతో ప్రీమియం నివాసాలకు విపరీతమైన డిమాండ్ ఉంది.

అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గ్లోబల్ కంపెనీల ఆఫీసులు, బ్యాంకింగ్, ఫిన్‌టెక్, కార్పొరేట్ ఉద్యోగాలు పుట్టకొనడంతో అద్దె ఇళ్లు, ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక హైదరాబాద్ ఐటీ రాజధానిగా పిలిచే హైటెక్ సిటీ, మదాపూర్, రాయదుర్గ్ ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్‌లతో పాటు రెంటల్ డిమాండ్ ఎల్లప్పుడూ పీక్స్‌లోనే ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రాంతాల చుట్టూనే ఇళ్లను వెతుకుతుంటారు.

55
ఏ ప్రాంతం దేనికి ప్రత్యేకం?
Image Credit : Gemini AI

ఏ ప్రాంతం దేనికి ప్రత్యేకం?

మొత్తంగా చూస్తే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మూడు ప్రధాన విభాగాల ఆధారంగా దూసుకుపోతోంది. ఒకవైపు పాత కాలపు ప్రతిష్ఠకు, రాయల్ లైఫ్‌స్టైల్‌కు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కేరాఫ్ నిలుస్తుండగా.. మరోవైపు భారీ ఐటీ డిమాండ్, ఉద్యోగ అవకాశాల కోసం గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

ఇక సరికొత్త తరం లగ్జరీ బూమ్‌ను కోకాపేట్, నియోపోలిస్ ప్రాంతాలు అద్భుతంగా లీడ్ చేస్తున్నాయి. కారణం ఏదైనా, భాగ్యనగరంలో ఇల్లు లేదా స్థలం కొనడం అంటే భవిష్యత్తుకు చేసే తిరుగులేని బంగారు పెట్టుబడి అనే చెప్పాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
స్థిరాస్తి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష ఫీజుల షెడ్యూల్ విడుద‌ల‌.. ఎప్ప‌టి నుంచి ప్రారంభం? చివ‌రి తేదీ ఎప్పుడు.?
Recommended image2
ఎల్ నినో ఎఫెక్ట్ ఎంతున్నా.. హైదరాబాద్ లో నో వాటర్ ప్రాబ్లమ్ : సీఎం రేవంత్ రెడ్డి
Recommended image3
School Holidays : అర్నబ్ తుపాను తీరందాటినా ఆగని వర్షబీభత్సం.. ఈ జిల్లాల్లో స్కూళ్ళకి సెలవులు పొడిగిస్తారా?
Related Stories
Recommended image1
Driverless Metro Rail: ఇండియాలో డ్రైవర్ లేకుండానే దూసుకెళ్లే మెట్రో రైలు.. ఎక్కడో తెలుసా? పూర్తి వివరాలు ఇవే
Recommended image2
Moon: అమావాస్య నుంచి పున్నమి వరకు.. అసలు రాత్రిపూట చంద్రుడు ఎందుకు మారుతాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved