MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Heavy Rain Alert: వచ్చే 3 రోజులు ఆ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు.. భారీ వర్షాలు !

Heavy Rain Alert: వచ్చే 3 రోజులు ఆ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు.. భారీ వర్షాలు !

IMD Heavy Rain Alert : రుతుపవనాలు కేరళను చేరాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అలర్ట్ జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 05 2026, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేరళను తాకిన రుతుపవనాలు.. కూల్ గా మారిన వాతావరణం
Image Credit : chatgpt

కేరళను తాకిన రుతుపవనాలు.. కూల్ గా మారిన వాతావరణం

ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనాలు ఇక రిలాక్స్ అవ్వొచ్చు. ఎందుకంటే, అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు మన దేశంలోకి అడుగుపెట్టేశాయి. జూన్ 4వ తేదీన ఈ చల్లని మేఘాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇవి జూన్ 1వ తేదీనే రావాల్సి ఉన్నా, కొన్ని ప్రతికూల పరిస్థితులు, ఎల్‌నినో ఎఫెక్ట్ వల్ల ఒక మూడు రోజులు లేట్‌గా వచ్చాయి.

ప్రస్తుతం అరేబియా సముద్రం, లక్షద్వీప్ దీవులతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఈ మేఘాలు కమ్మేసి జోరుగా వర్షాలు కురిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అప్‌డేట్ ప్రకారం, సముద్ర మట్టం నుండి సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 20 నుంచి 25 నాట్ల వేగంతో బలమైన పశ్చిమ గాలులు వీస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో గాలివాన బీభత్సం
Image Credit : Gemini

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో గాలివాన బీభత్సం

రుతుపవనాల ఎఫెక్ట్‌తో పాటు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి అంతర్గత కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనివల్ల తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోయింది. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

ఈ జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇవే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ సహా మొత్తం 33 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లోనే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో హయ్యస్ట్‌గా 5.08 సెం.మీ వర్షం కురిసింది.

35
హైదరాబాద్ ఐటీ కారిడార్ జనాలకు అలర్ట్
Image Credit : Getty

హైదరాబాద్ ఐటీ కారిడార్ జనాలకు అలర్ట్

హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉండే ఐటీ కారిడార్ పరిధిలో ఈరోజు స్కై మొత్తం మబ్బులతో క్లౌడీగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం లేదా ఈవెనింగ్ టైంలో సిటీలోని చాలా ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన దంచికొట్టేలా ఉంది. దీనివల్ల రోడ్లపై చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడే ప్రమాదం ఉంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైంలో ట్రాఫిక్ జామ్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బైక్‌లపై వెళ్లేవాళ్లు వర్షం వచ్చేటప్పుడు చెట్ల కిందో, పాత బిల్డింగ్‌ల కిందో కాకుండా సేఫ్ ప్లేస్‌లలో ఆగడం బెస్ట్.

45
రాయలసీమలోకి రుతుపవనాల ఎంట్రీ
Image Credit : Gemini AI

రాయలసీమలోకి రుతుపవనాల ఎంట్రీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా వాతావరణ శాఖ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. కేరళను తాకిన రుతుపవనాలు శుక్రవారం లేదా శనివారం రాయలసీమ బోర్డర్స్ ద్వారా ఏపీలోకి అడుగుపెడుతున్నాయి. దీనివల్ల చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి.

ఇటు కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా వాతావరణం ఫుల్ కూల్ అయిపోతుంది. తీరం వెంబడి గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ వార్నింగ్ ఇచ్చింది.

55
పొలాల్లో ఉండేవాళ్లు జాగ్రత్త.. పిడుగులు పడే ఛాన్స్
Image Credit : X/APSDMA

పొలాల్లో ఉండేవాళ్లు జాగ్రత్త.. పిడుగులు పడే ఛాన్స్

ఈ వర్షాల టైంలో ఉరుములు, మెరుపుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు అస్సలు రిస్క్ తీసుకోవద్దు. వాన పడేటప్పుడు పొరపాటున కూడా పెద్ద పెద్ద చెట్ల కింద గానీ, కరెంట్ స్తంభాల పక్కన గానీ నిలబడొద్దని విపత్తుల నిర్వహణ శాఖ స్పష్టంగా చెప్పింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
WhatsApp e Challan: వాహనదారులకు అలర్ట్.. వాట్సాప్‌లోనే ట్రాఫిక్ చలాన్లు.. 30 రోజుల్లో ఆ పని చేయకపోతే లైసెన్స్ కట్ !
Recommended image2
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved