MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Rain Alert : అల్పపీడనం తీరందాటే సమయమిది... ఈ తెలంగాణ, ఏపీ జిల్లాల్లో కుండపోత తప్పదా..!

Rain Alert : అల్పపీడనం తీరందాటే సమయమిది... ఈ తెలంగాణ, ఏపీ జిల్లాల్లో కుండపోత తప్పదా..!

తెెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరోసారి జోరందుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ ఏఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 03 2025, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Image Credit : X- Mudassar husain

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Telangana and Andhra Pradesh Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. ఇటీవల కురిసిన అత్యంత భారీ వర్షాలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో బీభత్సం సృష్టించాయి. తెలంగాణలో అయితే పలుజిల్లాల్లో భీకరమైన వరదలు సంభవించాయి... కామారెడ్డి, మెదక్ వంటి జిల్లాల ప్రజలు ఇంకా వరద భయం నుండి బయటకురాలేదు. ఇలాంటి సమయంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి... మరికొద్దిరోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తీరం దాటనున్న అల్పపీడనం
Image Credit : stockPhoto

తీరం దాటనున్న అల్పపీడనం

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ, రేపు (బుధ, గురువారం) రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని... ఇది ఇవాళ ఒడిషా సమీపంలో తీరాన్ని దాటవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకుంటాయని... అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

35
ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
Image Credit : ANI

ఈ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్..

నేడు (బుధవారం) తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగాం, ఖమ్మం, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :02-09-2025@TelanganaCS @DCsofIndia @IASassociation @TelanganaDGP @TelanganaCMO @GHMCOnline @HYDTP @IasTelangana @tg_weather @CommissionrGHMC @Comm_HYDRAA @Indiametdept pic.twitter.com/q0nkRhBjgL

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 2, 2025

45
తెలంగాణ ప్రజలు జాగ్రత్త..
Image Credit : ANI

తెలంగాణ ప్రజలు జాగ్రత్త..

ఈ వర్షాలకు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా తోడవుతాయని హెచ్చరించింది. 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని... కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది... అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. హైదరాబాద్ లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి... రాష్ట్రవ్యాప్తంగా జల్లులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

55
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
Image Credit : X/Hyderabad Traffic Police

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ (బుధవారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఇక విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

తీరం వెంబడి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి... కాబట్టి ఆ ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
విజయవాడ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Rain Alert : నేడు తెలుగు రాష్ట్రాల్లో కామారెడ్డి స్థాయి వర్షాలు... ఏఏ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టో తెలుసా?
Recommended image2
తెలంగాణ వరదల్లో ఎంతమంది చనిపోయారో తెలుసా..? వీరికి మాత్రమే రూ.5 లక్షల సాయమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved