MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కేసీఆర్ టీఆర్ఎస్, కేటీఆర్ బిఆర్ఎస్ vs కవిత టీఆర్ఎస్ .. రసవత్తరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ పంచాయితీ

కేసీఆర్ టీఆర్ఎస్, కేటీఆర్ బిఆర్ఎస్ vs కవిత టీఆర్ఎస్ .. రసవత్తరంగా కల్వకుంట్ల ఫ్యామిలీ పార్టీ పంచాయితీ

కల్వకుంట్ల ఫ్యామిలీ రాజకీయాలు మరోసారి వార్తల్లో నిలిచాాయి. కేసీఆర్ టీఆర్ఎస్ ఎవరిది? కొడుకు కేటీఆర్ దా, కూతురు కవితదా? బిఆర్ఎస్ ఉండగా ఈ టీఆర్ఎస్ వివాదం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ చదవండి.  

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 04 2026, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కేసీఆర్ వారసుల పార్టీ పంచాయితీ
Image Credit : X/RaoKavitha

కేసీఆర్ వారసుల పార్టీ పంచాయితీ

TRS Party : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు సాగుతోందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే కేసీఆర్ పార్టీ పగ్గాలను తన కొడుకు కేటీఆర్ కు అప్పగించారు... భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. భవిష్యత్ లో మరోసారి బిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చి కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే పనిలో ఉన్నారు కేసీఆర్. ఇలాంటి సమయంలో కేసీఆర్ కూతురు కవిత తండ్రి రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నిస్తుండటం తెలంగాణ రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. ఇప్పటికే అన్న కేటీఆర్ సారథ్యంలోని బిఆర్ఎస్ పార్టీనుండి కవిత బయటకు వచ్చారు... సొంతంగా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టుకుని రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్
Image Credit : X/BRSParty

బిఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్

కవిత కొత్త పార్టీ ఏర్పాటు బాగానే ఉంది... కానీ ఆ పార్టీ పేరే వివాదాస్పదం అవుతోంది. గతంతో తెలంగాణ రాష్ట్ర సమితిని టిఆర్ఎస్ అనేవాళ్లు... అది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) గా మారింది. ఈ క్రమంలో తన పార్టీ పేరు సంక్షిప్తరూపం TRS వచ్చేలా ప్లాన్ చేశారు కవిత... అందుకే తెలంగాణ రక్షణ సేన అని పెట్టారు. దీన్ని బిఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది... ఆ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు చేశారు. దీంతో స్పందించిన ఈసి కవితకు షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యింది. 

35
టిఆర్ఎస్ పేరు మారుతుందా?
Image Credit : X

టిఆర్ఎస్ పేరు మారుతుందా?

తెలంగాణ రక్షణ సేన (TRS) పేరును మార్చాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కవితను ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఆమెను అధికారికంగా ఓ లెటర్ రాసింది. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఉండేదని.. ఇప్పుడు మళ్లీ అదే పేరుతో పార్టీ ఉంటే ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలున్నాయని ఈసి భావిస్తున్నట్లుంది. అందుకే పార్టీ పేరును మార్చుకోవాలని... ప్రత్యామ్నాయ పేర్లను 15 రోజుల్లోగా సమర్పించాలని కవితను ఈసి కోరింది. లేదంటే పార్టీ దరఖాస్తును మూసివేస్తాయని ఈసి హెచ్చరించింది.

45
తగ్గేదేలే అంటున్న కవిత
Image Credit : Kalvakuntla Kavitha Twitter

తగ్గేదేలే అంటున్న కవిత

అయితే తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని... ఎట్టి పరిస్థితుల్లో పేరు మార్చబోమని కవిత స్పష్టం చేశారు. ఇప్పటికే ఈసి అభ్యంతరాలకు అధికారికంగా సమాధానం ఇచ్చామని... దీనిపై వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. పార్టీ పేరు మార్చాలని ఈసి పట్టుబడితో న్యాయపోరాటానికి సిద్దమని... కోర్టుల ద్వారా తేల్చుకుంటామని కవిత స్పష్టం చేశారు. అంటే టిఆర్ఎస్ పేరు విషయంలో వెనక్కి తగ్గేదేలేదని అంటున్నారు. మరి ఈసి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

55
కేటీఆర్ బిఆర్ఎస్ vs కవిత టిఆర్ఎస్
Image Credit : X/Kalvakuntla Kavitha

కేటీఆర్ బిఆర్ఎస్ vs కవిత టిఆర్ఎస్

ఎన్నికల సంఘం కవితకు రాసిన లేఖ గురించి కాస్త పక్కనబెడితే... ప్రస్తుతం కల్వకుంట్ల ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆరంభంలో కేవలం మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ పైనే కవిత ఆరోపణలు చేశారు... కానీ ఇటీవల కాలంలో తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ ను కూడా టార్గెట్ చేశారు. తన తండ్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు... అలాగే కేటీఆర్ తీరుపైనా విమర్శలు చేశారు. 'కేసీఆర్ మన మనిషి కాదు... మర మనిషిగా మారిపోయారు' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ కూడా నేరుగా సోదరి కవితపై విమర్శలు చేయకున్నా తెరవెనక గేమ్ ఆడుతున్నట్లు అర్థమవుతోంది. కవిత టిఆర్ఎస్ పార్టీతో తన బిఆర్ఎస్ నష్టపోయే ప్రమాదం ఉందని గుర్తించిన కేటీఆర్ ఇతర నాయకులతో ఈసికి ఫిర్యాదు చేయించారు. ఇది సక్సెస్ అయ్యింది... కవితను పార్టీ పేరు మార్చుకోవాలని ఈసి ఆదేశించింది. ఇలా ఇప్పుడు కేసీఆర్ టిఆర్ఎస్, కేటీఆర్ బిఆర్ఎస్ vs కవిత టిఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image2
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. భారీ తగ్గింపును ఇస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
Recommended image3
రాబోయేది క‌ష్ట‌కాలం, జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Related Stories
Recommended image1
Now Playing
Kavitha New TRS Party Impact: క‌విత పార్టీతో ఎవ‌రికి లాభం, ఎవ‌రికి న‌ష్టం.? | Asianet News Telugu
Recommended image2
TRS Party :''ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''... కవితకు కేసీఆర్ మాస్ మసాలా కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved