MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • TRS Party :''ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''... కవితకు కేసీఆర్ మాస్ మసాలా కౌంటర్

TRS Party :''ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''... కవితకు కేసీఆర్ మాస్ మసాలా కౌంటర్

TRS Party… ఈ పేరు కోసం కల్వకుంట్ల కుటుంబం రాజకీయ రచ్చకెక్కింది. ఈ పేరుతో కవిత కొత్తపార్టీ పెట్టగా… కేసీఆర్ ఊహించని రియాక్షన్ ఇచ్చారు. ఇంతకు టీఆర్ఎస్ కూతురిదా… కొడుకుదా..? కేసీఆర్ సపోర్ట్ ఎవరికి..?

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 25 2026, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కవిత టిఆర్ఎస్ కు కేసీఆర్ కౌంటర్
Image Credit : X/RaoKavitha

కవిత టిఆర్ఎస్ కు కేసీఆర్ కౌంటర్

TRS Party : తెలంగాణ రాజకీయాలు కల్వకుంట్ల కుటుంబంలో అగ్గి రాజేశాయి… ఇంకా చెప్పాలంటే పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టాయి. తండ్రి కూతురుని, అన్నా చెల్లిని వేరు చేశాయనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం ఆయన బిడ్డలు కేటీఆర్, కవిత పోటీ పడుతున్నారు... ఈ క్రమంలో ఒకే కడుపున పుట్టిన ఈ అన్నాచెల్లి రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ఆసక్తికర విషయం ఏంటంటే కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇటీవల బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) గా మారింది... ఈ BRS కేటీఆర్ కు దక్కింది. దీంతో తండ్రి మొదట స్థాపించిన TRS పేరు కలిసివచ్చేలా కవిత కొత్త పార్టీ పెట్టుకుంది... అదే తెలంగాణ రా ష్ట్ర సేన.

ఇవాళ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించింది... అయితే పార్టీపేరు 'TRS' అని కలిసివచ్చేలా పెట్టడంపై బిఆర్ఎస్ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. బిఆర్ఎస్ అధికారిక ఎక్స్ ఖాతాలో కవిత పార్టీపై ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అధికారక ఖాతాలో పోస్ట్ కాబట్టి ఇది ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రియాక్షన్ గానే పరిగణించాలి. ఇంతకూ ఈ ఎక్స్ పోస్ట్ లో ఏముందో తెలుసా...?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
''ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!''
Image Credit : X/BRSparty

''ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!''

కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' పార్టీ నకిలీది... 'తెలంగాణ రాష్ట్ర సమితి'' యే అసలైన టీఆర్ఎస్ అనేలా బిఆర్ఎస్ పోస్ట్ ఉంది. ఇందుకు ఉదాహరణగా ఒరిజినల్ కోల్ గేట్ టూత్ పేస్ట్, బిస్లెరి వాటర్ బాటిల్ ఫోటోలకు పక్కనే వాటిని అచ్చుగుద్దినట్లు ఉండే నకిలీ వాటి పోటీలను పెట్టారు. దీనికి ''ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!'' అనే క్యాప్షన్ పెట్టారు. అంటే ఒరిజినల్ TRS తమదే... కవితది నకిలీ టీఆర్ఎస్ అంటోంది బిఆర్ఎస్.

ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే! pic.twitter.com/YBlx20tlRf

— BRS Party (@BRSparty) April 25, 2026

34
''కేసీఆర్ మన మనిషి కాదు... మర మనిషి''
Image Credit : Asianet News

''కేసీఆర్ మన మనిషి కాదు... మర మనిషి''

తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పార్టీ ఆవిర్భావ సభలో కల్వకుంట్ల కవిత సొంత తండ్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగాయి. ఆయనపై గౌరవం ఉందంటూనే చేయాల్సిన విమర్శలు చేశారు. కేసీఆర్ రాజకీయ పరిణతి కోల్పోయారని... రాష్ట్రంలో పీకి కట్టలు కట్టామన్నట్లు టీఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారని విమర్శించారు. ఇలా డైరెక్ట్ గా కేసీఆర్ నే టార్గెట్ చేసి కవిత ప్రసంగం సాగింది.

''ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు

హైడ్రాలో ఇళ్లు కూలిపోతుంటే అన్నా ఎక్కడున్నావ్ రా... అంటే వచ్చిండ్రా..

వర్షబీభత్సంతో రైతుల పొలాలు మునిగిపోతే... వచ్చిండ్రా

ఆ సారు... ఇక రారు

గుంటనక్కలు, తోడేళ్ల చేతిలో ఖైదీ అయిన మనిషి మన మనిషి కాదు...

ఆయన మన కేసీఆర్ కాదు... మారిన కేసీఆర్.. మరబొమ్మ లాంటి కేసీఆర్'' అంటూ కవితాత్మకంగా తండ్రిపై కవిత విమర్శలు గుప్పించారు.

ఆనాటి కేసీఆర్ వేరు ఇప్పటి కేసీఆర్ వేరు.. ఇప్పుడున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉంటే రారు ఆయన మన మనిషి కాదు మర మనిషి.#TRSparty #TRS pic.twitter.com/E56JHVYAbz

— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 25, 2026

44
''ఇక రాబోయేది అమ్మ పాలనే..''
Image Credit : X/RaoKavitha

''ఇక రాబోయేది అమ్మ పాలనే..''

కొత్త పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రజలకు ఎమోషనల్ టచ్ ఇచ్చేలా మాట్లాడారు. ఈ రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మందికి అమ్మలా పరిణితి చెందాలనుకుంటున్నానని అన్నారు. అమ్మతనంతో పరిపాలన జరగాలి... అమ్మలా పాలిస్తా, బిడ్డలను బాగా చూసుకుంటానని అన్నారు. మన ప్రభుత్వం... మీ అమ్మ ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్నారు. ''అమ్మ జేబు చూడదు.. కడుపు చూస్తది'' అంటూ ప్రజలు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా మాట్లాడారు.

ఇక TRS పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. ''రూపాయి ఖర్చు లేకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఉచిత విద్య పొందుతారు. కేవలం ప్రభుత్వ విద్య కాదు ప్రైవేట్ విద్య కూడా భారం కాకుండా చూస్తా.. డాక్టర్లు, ఇంజనీర్లు కాదు రాకెట్ సైన్సులు చదివే తెలంగాణ బిడ్డలకు రూపాయి ఖర్చు లేకుండా చూస్తా... పేద, మధ్యతరగతి వారిపై ఇక చదువుల భారం ఉండదు. మీరు ఎంత చదువుకున్నా సరే తెలంగాణ రాష్ట్ర సేన చూసుకుంటుంది... మీ అమ్మ ప్రభుత్వమే మిమ్మల్ని చదివిస్తుంది..'' అని కవిత హామీ ఇచ్చారు.

తెలంగాణ బిడ్డలు ఎంతవరకు చదువంటే అంతవరకు ఉచిత విద్యను అందించే బాధ్యత నాది.. అది ఈ అమ్మ ప్రభుత్వంలో జరగబోతుంది.#TRSparty #TRS pic.twitter.com/nTRAqinhAX

— Telangana Rashtra Sena (@TRS__Party) April 25, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
రాజకీయాలు
హైదరాబాద్
కల్వకుంట్ల కవిత
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Now Playing
Kavitha Emotional Speech:అందుకే నిలబడి యుద్ధంచేస్తున్న KCRపై విరుచుకుపడిన కవిత | Asianet News Telugu
Recommended image2
Now Playing
కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి కవిత సంచలన కామెంట్స్ | Kavitha Launches Telangana Rashtra Sena Party
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved