MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కవిత మ్యాజిక్ .. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని వార్డులు గెలిచారో తెలుసా?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కవిత మ్యాజిక్ .. ఎక్కడెక్కడ, ఎన్నెన్ని వార్డులు గెలిచారో తెలుసా?

Telangana Municipal Elections Result 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అసలు కవిత పోటీలో ఉన్నారో లేదో కూడా చాలామంది తెలియదు. కానీ పలితాల తర్వాత ఆమె పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎన్నిచోట్ల ఆమె సపోర్టర్స్ విజయం సాధించారో తెలుసా? 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 13 2026, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ రాజకీయాల్లో కవిత హవా...
Image Credit : Getty

తెలంగాణ రాజకీయాల్లో కవిత హవా...

Telangana Municipal Election Results 2026 : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు తప్పేలా లేవు. మున్సిపల్ ఎన్నికల పలితాలను చూస్తే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ కనిపిస్తోంది. కానీ ఈ రిజల్ట్స్ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వడంలేదు... అంటే తెలంగాణ ప్రజలది వన్ సైడ్ తీర్పు కాదు. మరోవైపు కొన్నిచోట్ల బిజెపి, ఎంఐఎం వైపు కూడా ప్రజలు నిలిచారు... చివరకు కల్వకుంట్ల కవిత కూడా మంచి ఓటుబ్యాంకును, పరిగణలోకి తీసుకునే స్థాయిలో వార్డుల్లో విజయం సాధించారు. ఈ పలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్తపార్టీలకు కూడా అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి... ఇది కవిత భవిష్యత్ పాలిటిక్స్ కు మంచి బూస్ట్ ఇవ్వనుంది.

25
మున్సిపాలిటీ ఎన్నికల్లో కవిత సాధించే సీట్లెన్ని..?
Image Credit : Kalvakuntla Kavitha Twitter

మున్సిపాలిటీ ఎన్నికల్లో కవిత సాధించే సీట్లెన్ని..?

సొంత తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ, సొంత సోదరుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీ, తనకు రాజకీయ ఓనమాలు దిద్దించిన పార్టీ బిఆర్ఎస్ తో విబేధించి బయటకు వచ్చారు కవిత. ప్రస్తుతం సొంతంగా రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మొదటిసారి ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఓ పార్టీ లేదు, సిద్ధాంతం లేదు… ఈమె ఏం చేస్తుందిలే అని చాలామంది లైట్ తీసుకున్నారు... కానీ ఇప్పుడు పలితాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఇందులో కవిత కేవలం 212 వార్డుల్లో పోటీచేశారు... అదికూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) సింబల్ పై. కానీ పోటీచేసింది తక్కువే అయినా ఏకంగా 40 వార్డులవరకు కవిత గెలుచుకునే అవకాశాలున్నట్లు ప్రస్తుత పలితాలను బట్టి అర్థమవుతోంది. కవిత ఈ స్థాయిలో పోటీ ఇస్తుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు.

Related Articles

Related image1
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పలితాలు .. ఈ నాలుగు చోట్ల హంగ్
Related image2
Telangana Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల పలితాల్లో కాంగ్రెస్ హవా.. కొడంగల్ లో విజయం
35
వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత విజయకేతనం...
Image Credit : Kalvakuntla Kavitha Twitter

వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత విజయకేతనం...

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో కవిత  సపోర్టర్సే అత్యధికమంది విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 10 వార్డులకు గాను 8 ఏఐఎఫ్బి కైవసం చేసుకుంది... అధికార కాంగ్రెస్ 1, ప్రతిపక్ష బిఆర్ఎస్ 1 వార్డులో గెలిచాయి. ఇలా అసలు పోటీలోనే ఉండదనుకున్న కవిత ఓ మున్సిపాలిటీనే గెలుచుకుని సత్తా ఏంటో చూపించింది. సింహం గుర్తులో పోటీచేసిన ఈ లేడీ సింగం తెలంగాణ రాజకీయాలు ఉలిక్కిపడేలా గర్జించింది.

45
కవిత ఎక్కడెక్కడ గెలిచారు..?
Image Credit : Kalvakuntla Kavitha Twitter

కవిత ఎక్కడెక్కడ గెలిచారు..?

కేవలం వడ్డేపల్లి మున్సిపాలిటీలోనే కాదు రాష్ట్రంలోని మరికొన్ని వార్డుల్లోనూ కవిత పోటీచేయించినవాళ్ళు విజయం సాధించారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామగుండం మున్సిపల్ కార్పోరేషన్... ఇక్కడ AIFB 10 నుండి 12 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల గెలవగా మరికొన్ని చోట్ల ఆధిక్యంలో ఉంది.

ఆదిలాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో కూడా కవిత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ కవిత అండతో AIFB తరపున పోటీచేసిన 8 మంది విజయానికి చేరువగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాలలో కూడా కవిత సపోర్టర్స్ నలుగురు లీడ్ లో ఉన్నారు. మిగతా మున్సిపల్ కార్పోరేషన్స్ ను కూడా కవిత ప్రభావితం చేసింది.

మంథని, సుల్తానాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట వంటి మున్సిపాలిటీల్లో కూడా కవిత సపోర్టర్స్ పోటీచేశారు... కొందరు విజయం కూడా సాధించారు. మున్సిపల్ ఎన్నికల తుది పలితాలు వెలువడేసరికి AIFB అభ్యర్థులు మరికొన్ని చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత అద్భుతం చేశారనే చెప్పాలి.

55
కవిత విజయంపై బిఆర్ఎస్ రియాక్షన్ ఏంటి..?
Image Credit : X/Kalvakuntla Kavitha

కవిత విజయంపై బిఆర్ఎస్ రియాక్షన్ ఏంటి..?

వడ్డేపల్లిలో కవిత సపోర్టర్స్ అత్యధిక వార్డుల్లో గెలవడంపై బిఆర్ఎస్ నాయకులు కొందరు స్పందిస్తున్నారు. ఈ విజయం కవితది కాదు... స్థానికంగా బాగా బలమున్న నాయకుడొకరు గెలిపించుకున్నాడని అంటున్నారు. గతంలో ఈ నాయకుడు బిఆర్ఎస్ లో ఉన్నాడు... కాబట్టి ఇది పరోక్షంగా తమ విజయమేనని కారు పార్టీ నాయకులు అంటున్నారు. ఏదేమైనా ఈ మున్సిపల్ ఎన్నికలు కవిత భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగపడతాయనేది స్పష్టమవుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
కల్వకుంట్ల కవిత
రాజకీయాలు
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పలితాలు .. ఈ నాలుగు చోట్ల హంగ్
Recommended image2
కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల‌కు షాకిచ్చిన క‌విత‌.. ఆ మున్సిపాలిటీ జాగృతి కైవసం
Recommended image3
Vegetable Price : హైదరాబాద్ వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలివే..
Related Stories
Recommended image1
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పలితాలు .. ఈ నాలుగు చోట్ల హంగ్
Recommended image2
Telangana Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల పలితాల్లో కాంగ్రెస్ హవా.. కొడంగల్ లో విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved