- Home
- Telangana
- Telangana Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు .. పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ హవా
Telangana Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు .. పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ హవా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్స్ లో అధికార కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది. చివరివరకు ఇదే ట్రెండ్ కొనసాగుతుందాా… మారుతుందా అన్నది చూడాలి.

తెలంగాణలో ఉత్కంఠ..
Telangana Municipal Election Results 2026 : తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్లలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే... ఇటీవలే పోలింగ్ జరగ్గా ఇవాళ (ఫిబ్రవరి 13న, శుక్రవారం) పలితాలు వెలువడుతున్నాయి. ఉదయమే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యింది... మధ్యాహ్నానికి పలితాలపై క్లారిటీ రానుంది.
పోస్టల్ బ్యాలెట్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం
ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కింపు చేపట్టారు అధికారులు... ఇందులో అధికార కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. సంగారెడ్డి, మధిర, నాగర్ కర్నూల్ వంటి మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ ముందుంది... కొన్నిచోట్ల బిఆర్ఎస్ కూడా మంచి ఓట్లే వచ్చాయి. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనే హోరాహోరీ సాగింది... దీన్నిబట్టి అసలు ఓట్ల లెక్కింపు మరింత రసవత్తరంగా ఉండనుంది.
కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు బిజెపి పోటీ
కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు బిజెపి పోటీ ఇస్తోంది.. పోస్టల్ బ్యాలెట్స్ లో కొన్నిచోట్ల ఈ పార్టీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలు, గద్వాల వంటి ప్రాంతాల్లో బిజెపి ఆధిక్యం కనిపిస్తోంది. అక్కడక్కడా ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిపోటీ ఇస్తున్నారు.
పలితాలపై మధ్యాహ్నానికి క్లారిటీ..
బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తిచేసిన అధికారులు ఇక అసలు ప్రక్రియ ప్రారంభించారు. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. మున్సిపాలిటీల పలితం మధ్యాహ్నానికి, కార్పోరేషన్ల పలితం సాయంత్రానికి వచ్చే అవకాశాలున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు పోలీసులు.
మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఎప్పుడంటే..
అత్యధిక స్థానాలు సాధించిన పార్టీకి మేయర్, మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవులు దక్కనున్నాయి. ఈ ఎన్నిక ఫిబ్రవరి 16న ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. పరోక్ష పద్దతిలో ఈ పదవుల ఎంపిక ఉంటుంది... కాబట్టి కాస్త అటుఇటుగా ఉన్న స్థానాల్లో గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించనున్నాయి ప్రధాన పార్టీలు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

