MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • ఈరోజు నేను, రేపు కేసీఆర్‌.. ఆ 6 అడుగుల బుల్లెట్‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి. కవిత కీల‌క వ్యాఖ్య‌లు

ఈరోజు నేను, రేపు కేసీఆర్‌.. ఆ 6 అడుగుల బుల్లెట్‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి. కవిత కీల‌క వ్యాఖ్య‌లు

కేసీఆర్ కూతురు కవిత వ్యవహారశైలి రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టిన కవిత మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 03 2025, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎట్ట‌కేల‌కు రాజీనామా
Image Credit : Asianet News

ఎట్ట‌కేల‌కు రాజీనామా

గ‌త కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంద‌రు నాయ‌కుల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్న క‌విత సోమ‌వారం ఏకంగా పేర్ల‌తో స‌హా టార్గెట్ చేసిన విష‌యం తెలిసిందే. కాళేశ్వ‌రంపై కాంగ్రెస్ పార్టీ సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన నేప‌థ్యంలో పార్టీ ఉంటే పోతే అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలోనే హ‌రీష్ రావు, సంతోష్ రావుల వ‌ల్ల పార్టీ నాశ‌నం అయ్యిందంటూ వ్యాక్యానించారు. దీంతో ఈ విష‌యాన్ని కేసీఆర్ సీరియ‌స్‌గా తీసుకున్నారు. పార్టీ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించిన అనంత‌రం క‌విత‌ను బీఆర్ఎస్ నుంచి స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే క‌విత మంగ‌ళ‌వారం పార్టీకి, ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పంపుతున్నట్లు తెలిపారు. ఇక బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు... ఈ లేఖను బిఆర్ఎస్ పార్టీకి పంపిస్తున్నట్లు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆరడ‌గుల బుల్లెట్ ఎవ‌రికి గాయం చేస్తుంది.?
Image Credit : X/@BRSparty

ఆరడ‌గుల బుల్లెట్ ఎవ‌రికి గాయం చేస్తుంది.?

హ‌రీష్ రావును ఉద్దేశిస్తూ క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌విత మాట్లాడుతూ.. "అసెంబ్లీలో కాళేశ్వ‌రం చ‌ర్చ‌పై రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను నిందిస్తుంటే దానిని ఆర‌డ‌గుల బుల్లెట్‌లా అడ్డుకున్నాడంటూ పార్టీ నేత‌లు గొప్ప‌లు చెప్పారు. మ‌రి చివ‌రికి ఆ బుల్లెట్ ఎవ‌రికి గాయం చేస్తుంది? ఈరోజు న‌న్ను గాయప‌రిచింది, రేపు రామ‌న్న‌ను గాయం చేస్తుందో, కేసీఆర్ గారిని గాయం చేస్తుందో తెలియ‌దు. రామ‌న్న జాగ్ర‌త్త‌గా ఉండండి. హ‌రీష్ రావు గారి కార‌ణంగా జ‌గ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ర‌ఘునంద‌న్ రావు లాంటి వారంద‌రూ పార్టీ నుంచి వెళ్లిపోయారు. దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఓట‌మికి హ‌రీష్ రావు కార‌ణం" అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌లో ఎక్క‌డ భూమి కొనాలి.? ఈ ప్రాంతాల్లో ఈరోజు కొంటే రేపు కోట్లు కురుస్తాయి.
Related image2
ఏడేళ్ల క్రితం తప్పిపోయిన భర్త ఇన్‌స్టాలో ప్ర‌త్య‌క్షం.. రీల్ చూసిన భార్య‌కు ఫ్యూజులు అవుట్
34
న‌క్క జిత్తుల‌ను గ‌మ‌నించండి.
Image Credit : ANI

న‌క్క జిత్తుల‌ను గ‌మ‌నించండి.

హ‌రీష్ రావు చేసే న‌క్క జిత్తుల వ్య‌వ‌హార‌ల‌ను గ‌మ‌నించాల‌ని కేసీఆర్‌కు క‌విత సూచ‌న చేశారు. హ‌రీష్ రావు ట్ర‌బుల్ షూట‌ర్ కాద‌ని, బ‌బుల్ మేక‌ర్ అన్నారు. త‌న‌కు ప‌ద‌వుల‌పై ఆశ లేద‌ని, ఉద్యమం నుంచి వ‌చ్చాను, ఉద్యమంలోకి వెళ్తాను అంటూ క‌విత చెప్పుకొచ్చారు. పార్టీని వెన్నుపోటు పొడుద్దాం అని గ‌తంలో ప్లాన్ చేశారని ఆరోప‌ణ‌లు చేశారు. హ‌రీష్‌రావును న‌మ్ముకుని ఈట‌ల‌, మైనంప‌ల్లి స‌హా అంతా పార్టీని వీడారు. ఒకే విమానంలో రేవంత్‌తో క‌లిసి హరీష్ ప్ర‌యాణించార‌ని క‌విత ఆరోపించారు.

LIVE: Addressing media https://t.co/zb9ibixsiX

— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 3, 2025

44
మా కుటుంబంపై కుట్ర జ‌రుగుతోంది
Image Credit : X/Kalvakuntla Kavitha

మా కుటుంబంపై కుట్ర జ‌రుగుతోంది

అధికారంలోకి వ‌స్తామ‌నుకొని ఉద్య‌మంలోకి రాలేద‌న్న క‌విత‌.. త‌న తండ్రి కోస‌మే వ‌చ్చామ‌ని చెప్పుకొచ్చారు. అందుకే త‌మ కుటుంబంపై కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. కూర‌లో ఉప్పు ఎలా ఉంటుందో సంతోష్ రావు అలా ఉంటార‌న్న క‌విత‌.. ప్ర‌తీ ప‌నిని చెడ‌గొట్టేందుకు ఆయ‌న ముందుంటార‌ని అన్నారు. సంతోష్ రావుకు ధ‌న దాహం ఎక్కువ అంటూ క‌విత ఆరోపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సినిమా తార‌ల‌ను మోసం చేశారని క‌విత చెప్పుకొచ్చారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
కల్వకుంట్ల కవిత
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Recommended image2
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image3
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో ఎక్క‌డ భూమి కొనాలి.? ఈ ప్రాంతాల్లో ఈరోజు కొంటే రేపు కోట్లు కురుస్తాయి.
Recommended image2
ఏడేళ్ల క్రితం తప్పిపోయిన భర్త ఇన్‌స్టాలో ప్ర‌త్య‌క్షం.. రీల్ చూసిన భార్య‌కు ఫ్యూజులు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved