- Home
- Telangana
- Jubilee Hills Bypoll: ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే.?
Jubilee Hills Bypoll: ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే.?
Jubilee Hills Bypoll: తెలంగాణ రాజకీయాల్లో వేడిని పెంచుతోంది జూబ్లీహిల్స్ ఉపఎన్నిక. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు.. ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి సర్వేలు ఏం చెబుతున్నాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..

ఎన్నికల వేడి షురూ.. ఇక ప్రచారమే..
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ వేడిని పెంచుతోంది. ఇప్పటికే మూడు ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించగా.. అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్దమయ్యాయి. బీఆర్ఎస్ తన అభ్యర్ధిని మొదటిగా ప్రకటించింది. దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు ఛాన్స్ ఇచ్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. అటు కాంగ్రెస్ తన అభ్యర్ధిగా నవీన్ యాదవ్‌ను ప్రకటించగా.. బీజేపీ దీపక్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది.
బీఆర్ఎస్‌కు ఇది కీలకం..
2023లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలవడం బీఆర్ఎస్‌కు చాలా ముఖ్యం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్.. కాంగ్రెస్ చేతిలో ఓటమిపాలైంది. ఈ పరాజయాలు మాత్రమే కాదు.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎత్తి చూపిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలతోనూ బీఆర్ఎస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది.
బీఆర్ఎస్ బ్రాండ్ ఇమేజ్..
ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, ఫార్ములా ఈ-రేస్ లాంటి అంశాలు కూడా బీఆర్ఎస్ ఇమేజ్‌ను దెబ్బతీశాయి. కల్వకుంట్ల కవితను.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేయడం కూడా పార్టీని డ్యామేజ్ చేశాయి. ఇవన్నింటి నడుమ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం బరిలోకి దిగింది బీఆర్ఎస్.
సర్వేలు ఏం చెబుతున్నాయి..
ఇటీవల బీఆర్ఎస్ చేసిన ఓ అంతర్గత సర్వేలో ఆ పార్టీ కాంగ్రెస్ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. దివంగత నేత మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు అవకాశం ఇవ్వడం.. అలాగే బీఆర్ఎస్‌కు ఉన్న స్థానిక బలం.. ఆ పార్టీని స్వల్ప ఆధిక్యంలో ఉంచినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆంధ్ర సెటిలర్ల మద్దతు..
మాగంటి సునీతతో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్‌కు సరైన వనరులు లేకపోవడం.. అలాగే జూబ్లీహిల్స్‌లో స్థిరపడిన సునీతకు పెద్ద సంఖ్యలో ఆంధ్ర సెటిలర్ల మద్దతు ఉండటం దీనికి ప్రధాన కారణం కావచ్చునని విశ్లేషకులు అంటున్నారు. కమ్మ కమ్యూనిటీ కూడా ఆమె విజయానికి సాయం చేస్తోందని' అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. అటు బీజేపీ రెడ్డి అభ్యర్ధిని నిలబెట్టగా.. బీఆర్ఎస్ కమ్మ వర్గానికి చెందిన అభ్యర్ధిని నిలబెట్టింది. దీని బట్టి బీసీ అయిన నవీన్ యాదవ్‌కు ఛాన్స్ ఇచ్చింది కాంగ్రెస్. తద్వారా గెలిచే అవకాశాలను తనవైపు తిప్పుకోవచ్చునని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.