MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Telangana
  • ఉద్యోగం చేశావా.? పైస‌లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్‌లో చిక్కిన భారీ అవినీతి తిమింగ‌ళం

ఉద్యోగం చేశావా.? పైస‌లు ప్రింట్ చేశావా.? హైదరాబాద్‌లో చిక్కిన భారీ అవినీతి తిమింగ‌ళం

Hyderabad: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఏసీబీ రైడ్‌లో చిక్కారు. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా సంప‌ద బ‌య‌ట‌ప‌డింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 16 2026, 08:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒకేసారి 11 ప్రాంతాల్లో సోదాలు
Image Credit : Gemini AI

ఒకేసారి 11 ప్రాంతాల్లో సోదాలు

ఏసీబీ నమోదు చేసిన డిస్ప్రోపోర్షనేట్ అసెట్స్ (DA) కేసు ఆధారంగా నరహరికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, బంధువులతో పాటు సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఛత్రినాకలోని ప్రధాన నివాసంతో పాటు నారాయణగూడలోని కార్యాలయం సహా మొత్తం 11 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. సోదాల కోసం పలువురు అధికారులను రంగంలోకి దింపినట్లు సమాచారం.

ఇంట్లోనే రూ.1.54 కోట్ల నగదు స్వాధీనం

సోదాల సందర్భంగా నరహరి నివాసంలో భారీగా నగదు గుర్తించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంట్లోని ఒక కబోర్డులో రూ.1.54 కోట్ల నగదు దొరికింది. అంతేకాకుండా సుమారు కిలో బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదనంగా రూ.1 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు లభించినట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం
Image Credit : X

ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం

ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా ప్రభుత్వ విలువ ప్రకారం ఆస్తులు రూ.5 కోట్లకు పైగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్ ధరల ప్రకారం ఈ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. నరహరి కుటుంబ సభ్యుల పేర్లపై కూడా కొన్ని ఆస్తులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు సమాచారం.

34
బ్యాంక్ లాకర్లు, పెట్టుబడులపై విచారణ
Image Credit : X

బ్యాంక్ లాకర్లు, పెట్టుబడులపై విచారణ

సోదాల సమయంలో రెండు బ్యాంక్ లాకర్ల వివరాలు కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చాయి. వాటిని తెరిచి పరిశీలించేందుకు సంబంధిత బ్యాంకులకు అధికారులు లేఖలు పంపారు. బ్యాంక్ ఖాతాలు, పెట్టుబడులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై కూడా సమగ్ర విచారణ కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించి పూర్తి ఆస్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.

44
నరహరి అరెస్ట్.. కోర్టులో హాజరు
Image Credit : social media

నరహరి అరెస్ట్.. కోర్టులో హాజరు

సోదాల్లో లభించిన ఆధారాల నేపథ్యంలో సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయిన తర్వాత మొత్తం అక్రమ ఆస్తుల విలువ, వాటి స్వభావం, తదుపరి చర్యలపై అధికారిక రిపోర్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యల్లో ఇది ఇటీవల కాలంలో అత్యంత కీలక ఆపరేషన్లలో ఒకటిగా భావిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
నేరాలు, మోసాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
Recommended image2
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్
Recommended image3
Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆ ప‌న్నీర్‌పై ఏడాది నిషేధం
Related Stories
Recommended image1
Facts: ఎస్క‌లేట‌ర్ చివ‌ర్లో ఈ బ్ర‌ష్ ఎందుకు ఉంటుంది.? దుమ్ము క్లీన్ చేయ‌డానికి మాత్రం కాదండోయ్‌
Recommended image2
రైల్వే ట్రాక్ పక్కన వేలాడే ఈ సిల్వర్ సిలిండర్ల ఉప‌యోగం ఏంటో తెలుసా.? ఇవి లేక‌పోతే ఏమ‌వుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved