MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Heavy Rain Alert : చిరుజల్లులు కాదు ఇక భారీ, అతిభారీ వర్షాలే... ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!

Heavy Rain Alert : చిరుజల్లులు కాదు ఇక భారీ, అతిభారీ వర్షాలే... ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!

IMD Rain Alert :  తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు సాధారణ చిరుజల్లులే కురిశాయి. అయితే ఈ నెలాఖరులో భారీ వర్షాలు కురుస్తాయని వాాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 24 2026, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు...
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు...

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదిలిపెట్టేలా లేవు... వర్షాకాలంలో ఎలాగూ వానలు పడతాయి. చలి, ఎండాకాలంలోనూ వానలు కురుస్తున్నాయి... అంటే సంవత్సరం పొడవునా వర్షాలు కురుస్తున్నాయన్నమాట. ఈ వేసవి మొదలైనప్పటి నుండి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి... నడి వేసవిలోనూ భారీ వర్షాలు తప్పేలా లేవు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తుండగా నెలాఖరుకు జోరందుకుంటాయని... భారీ వర్షాలు తప్పవని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
తెలంగాణలో భారీ వర్షాలు
Image Credit : Gemini AI

తెలంగాణలో భారీ వర్షాలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు కొనసాగుతున్నాయి... ఏకంగా 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరున ఎండల నుండి కాస్త ఉపశమనం లభించనుంది... ఏప్రిల్ 28, 29న తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఆసిఫాబాద్ నుండి సూర్యాపేట వరకు గల తుర్పు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.

Related Articles

Related image1
IMD Weather Update : సూరీడితో వరుణుడి పోటీ.. మధ్యలో తెలుగు ప్రజలకు ఈ అవస్థలేంటి..?
Related image2
Now Playing
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
35
ఏపీలోనూ భారీ వర్షాలు
Image Credit : Gemini AI

ఏపీలోనూ భారీ వర్షాలు

కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. శ్రీకాకుళం నుండి గుంటూరు వరకు నార్త్, సెంట్రల్ ప్రాంతాల్లో వర్షాలుంటాయట. ఏప్రిల్ ఎండింగ్ లో ప్రారంభమయ్యే వానలు మే 1 వరకు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈసారి చెదురుమదురు జల్లులు కాదు వర్షబీభత్సమే ఉండేలా కనిపిస్తుంది.

45
ఈ జిల్లాల్లో వర్షాలు..
Image Credit : X/APSDMA

ఈ జిల్లాల్లో వర్షాలు..

ఇదిలావుంటే ఇవాళ (ఏప్రిల్ 24) కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గంటకు 35-40 కి.మీ వేగంతో) కూడిన వర్షాలుంటాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం హెచ్చరించింది... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

55
ముందుగానే నైరుతి రుతువనాల ఎంట్రీ..
Image Credit : X/Warangal Weatherman

ముందుగానే నైరుతి రుతువనాల ఎంట్రీ..

ఇక గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ఎంటరయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం అవుతుందన్నమాట. మే 18 నుండి 25 తేదీల మధ్య అండమాన్ నికోబార్ కు... జూన్ 1 లోపు కేరళ, తమిళనాడును రుతుపవనాలు తాకుతాయని అంచనా వేస్తున్నారు. గతేడాది కూడా మేలోనే రుతుపవనాలు ఇండియాకు చేరుకున్నారు... కానీ తర్వాత ముఖం చాటేశాయి.  అయితే తర్వాత పుంజుకుని అత్యంత భారీ వర్షాలు కురిశాయి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
POCSO : బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్... రంగంలోకి మగాళ్ల హక్కుల సంస్థ, అసలేం జరుగుతోంది..?
Recommended image2
Weather Update : తెలుగు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. ఈ జిల్లాల్లో యూపీ తరహా ఈదురుగాలులు, అల్లకల్లోలమే
Recommended image3
Weather Update: రెడ్ అలర్ట్.. ఇటు రెయిన్ అలర్ట్.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో వానలే వానలు !
Related Stories
Recommended image1
IMD Weather Update : సూరీడితో వరుణుడి పోటీ.. మధ్యలో తెలుగు ప్రజలకు ఈ అవస్థలేంటి..?
Recommended image2
Now Playing
Sudden Rains in Hyderabad:హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు | Weather Update| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved