- Home
- Telangana
- Heavy Rains : ఈ ప్రాంతాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన
Heavy Rains : ఈ ప్రాంతాల్లో మరో 4 రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన
Heavy Rains: ఆగస్టు 14-17 మధ్య తెలంగాణ అంతటా అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక. హైద్రాబాద్‌లో వానలు దంచికొడుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన చేపట్టారు.

తెలంగాణకు అతిభారీ వర్షాల హెచ్చరికలు
తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగస్టు 14 నుంచి 17 వరకు తెలంగాణ అంతటా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇప్పటికే ఆగస్టు 13, 14 తేదీలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలు అల్పపీడన (LPA) ప్రభావం వల్ల కురుస్తాయని వాతావరణ నిపుణుడు టీ. బాలాజీ వెల్లడించారు. హైద్రాబాద్ సహా అన్ని జిల్లాలు ఈ వర్షాల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
Once again, ALERTING from August 14 to 17, an LPA will bring FLOODING RAINS across the entire TELANGANA.
Officials are urged to be prepared and take all necessary actions in advance.
2nd Update on LPA coming Tomorrow stay tuned for the latest on the Aug 14–17 flooding rain… https://t.co/mXqeFjSOOW— Hyderabad Rains (@Hyderabadrains) August 10, 2025
KNOW
హైద్రాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం (ఆగస్టు 10న) సీఎం ఏ. రేవంత్ రెడ్డి వరద ప్రభావిత బాల్కంపేట ప్రాంతంలో ఆకస్మికంగా పర్యటించారు. ఆయనతో పాటు హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఉన్నారు. బుద్ధా నగర్, అమీర్‌పేట్, మైత్రి వనం ప్రాంతాల్లో ప్రజలను కూడా కలిసిన సీఎం.. డ్రెయినేజ్ వ్యవస్థను తక్షణం సరిచేయాలని ఆదేశించారు.
On the Ground: Hon'ble Chief Minister Revanth Reddy in Flood-Hit Hyderabad
In a surprise move, Hon’ble Chief Minister Sri A. @revanth_anumula walked through flood-hit streets of #Hyderabad today, meeting residents & assessing damage firsthand. 🌧️🏠
📍 #Balkampet – CM interacted… pic.twitter.com/1VZsLZZzrR— IPRDepartment (@IPRTelangana) August 10, 2025
డ్రైనేజీలో పడిపోయిన ఫుడ్ డెలివరీ ఏజెంట్
హైద్రాబాద్‌లోని టికేఆర్ కమాన్, శక్తినగర్ వద్ద వర్షంలో ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఓపెన్ డ్రెయినేజీలో పడి గాయపడ్డాడు. శనివారం కురిసిన భారీ వర్షాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ ఫర్హాన్ అనే జొమాటో రైడర్ తన బైక్ (విలువ రూ. 1.40 లక్షలు) నీటిలో మునిగిపోయిందని, రూ. 20,000 విలువైన మొబైల్ పోయిందని తెలిపారు. తెలంగాణ గిగ్ & ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ఈ ఘటనపై కంపెనీ బాధ్యత వహించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. సంఘటనా స్థలంలో స్థానికులు పైపు సహాయంతో రైడర్‌ను బయటకు తీశారు.
A food delivery agent fell into a drain while on duty amid heavy rains in Hyderabad on Saturday, August 9.
The incident occurred at TKR Kaman, Shaktinagar. The man lost his mobile phone after falling into the drain and his vehicle was also damaged.
In a video circulating on… pic.twitter.com/S32mZerUxg— The Siasat Daily (@TheSiasatDaily) August 10, 2025
The @TGPWU Demands @zomato Take Full Responsibility After Delivery Worker Syed Farhan Falls into Drainage During Hyderabad Rains
On 9 Aug 2025, Zomato delivery worker Syed Farhan fell into an open drainage near TKR Kaman during heavy rain, losing his bike and phone. 1/3 https://t.co/KezdQqiYCppic.twitter.com/jHl91Mw31F— Telangana Gig and Platform Workers Union (@TGPWU) August 10, 2025
దంచికొడుతున్న వానలు.. రికార్డు వర్షపాతం నమోదు
ఆగస్టు 9న బేగం బజార్‌లో 117.5 మిల్లీమీటర్లు, సర్దార్ మహల్‌లో 106.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, నాంపల్లి, ఆసిఫాబాద్, హయత్‌నగర్‌లో 90 మిల్లీమీటర్లకు పైగా వర్షం పడింది. వాన వల్ల రోడ్లపై నీరు నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడటం వంటి సమస్యలు తీవ్రంగా కనిపించాయి.
గత వారం రోజులుగా నగరంలో తరచుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రత 27.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఆదివారం కూడా నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది.
3rd 100mm rainfall event for HYD city 😱😱🫣
This is the 3rd time in this month, where a 100mm rainfall event occurred in August. I've been keeping on warning that August is going to be massive, and this year August is just going bonkers. More HEAVY DOWNPOURS ahead in next… pic.twitter.com/SffaUnj4TT— Telangana Weatherman (@balaji25_t) August 9, 2025
హుస్సైనీ ఆలంలో కూలిన భవనం
భారీ వర్షాలతో శనివారం (ఆగస్టు 9న) రాత్రి ఓల్డ్ సిటీలోని హుస్సైనీ ఆలంలో ఒక పాత భవనం భాగం కూలిపోయింది. చోటి సరా వద్ద జరిగిన ఈ ఘటనలో ఒక ద్విచక్ర వాహనం శిథిలాల కింద చిక్కుకుంది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు, ఈ భవనాన్ని కూల్చివేయమని రెండు సంవత్సరాల క్రితం GHMC నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రతి ఏడాది భారీ వర్షాల సమయంలో ఇలాంటి పాత భవనాలు కూలిపోవడం జరుగుతోందని నివాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు
హైదరాబాద్ తో పాటు మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ (పసుపు హెచ్చరిక)జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
1. రంగారెడ్డి
2. మహబూబ్‌నగర్
3. ఖమ్మం
4. మహబూబాబాద్
5. వనపర్తి
6. సూర్యాపేట
7. నల్గొండ
8. భద్రాద్రి కొత్తగూడెం
9. నాగర్‌కర్నూల్
గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు వచ్చే అవకాశమున్న జిల్లాలు
1. కమారెడ్డి
2. సిరిసిల్ల
3. సంగారెడ్డి
4. వికారాబాద్
5. జోగులాంబ గద్వాల్
6. నారాయణపేట
7. మెదక్
8. సిద్ధిపేట