MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!

VC Sajjanar Launches Anti Drug Awareness Song : న్యూ ఇయర్ వేళ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు జర్నలిస్ట్ రమేష్ కుమార్ రాసిన ప్రత్యేక పాటను వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలపై పోరులో ఈ పాట కీలకపాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

3 Min read
Mahesh Rajamoni
Published : Dec 19 2025, 10:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యువతకు అలర్ట్: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల పై స్పెషల్ ఫోకస్
Image Credit : Asianet News

యువతకు అలర్ట్: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల పై స్పెషల్ ఫోకస్

మరికొద్ది రోజుల్లో రానున్న నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారంలో యువత పార్టీలతో హుషారెక్కించడం, ఆనందోత్సాహాల మధ్య గడపడం సర్వసాధారణం. అయితే, గతంలో కేవలం మత్తుపానీయాలకే మాత్రమే పరిమితమైన ఈ పార్టీలు, ఇటీవలి కాలంలో ఆందోళనకరమైన మలుపు తిరిగాయి. కేవలం మత్తుపానీయాలు మాత్రమే కాకుండా, మాదక ద్రవ్యాల వినియోగం కూడా విపరీతంగా పెరగడం ఇప్పుడు సమాజాన్ని భయపెడుతోంది.

ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగింది. పబ్ కల్చర్, సర్వీస్ అపార్ట్‌మెంట్స్ పార్టీలు, ఫామ్ హౌజ్ పార్టీల పేరుతో యువత పెడదోవ పడుతున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఈ మాదక ద్రవ్యాల సరఫరా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కేవలం చట్టపరమైన చర్యలే కాకుండా, యువతలో చైతన్యం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు బాధ్యతలు అప్పగించగా, స్వాధ్యాయ అనే సంస్థ చురుగ్గా ముందుకు వచ్చింది.

24
'మత్తు.. గమ్మత్తు'.. యువతను ఆలోచింపజేస్తున్న జర్నలిస్ట్ రమేష్ కుమార్ పాట
Image Credit : Asianet News

'మత్తు.. గమ్మత్తు'.. యువతను ఆలోచింపజేస్తున్న జర్నలిస్ట్ రమేష్ కుమార్ పాట

మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు స్వాధ్యాయ స్వచ్ఛంద సంస్థ పలు అవగాహన కార్యక్రమాలను రూపొందించింది. ఈ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, కవి, రచయిత రమేష్ కుమార్ ఉప్పుల తనవంతు బాధ్యతగా ఒక ప్రత్యేక గీతానికి రూపకల్పన చేశారు. "మత్తు.. మత్తు.. మత్తు.. మత్తు.. గమ్మత్తు.." అంటూ సాగే ఈ పాటను ఆయనే స్వయంగా రచించి, స్వరపరచడం విశేషం.

మాదక ద్రవ్యాల నివారణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ పోలీసులకు తోడుగా ఈ గీతాన్ని అందించారు. మాదక ద్రవ్యాలకు బానిసలైతే జీవితాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో కళ్లకు కట్టినట్లు చూపించేలా ఈ పాటను రూపొందించారు. ఈ ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

Related Articles

Related image1
Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Related image2
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే
34
సజ్జనార్ అభినందన.. యువతకు హెచ్చరిక
Image Credit : x/cp sajjanar

సజ్జనార్ అభినందన.. యువతకు హెచ్చరిక

పాటను ఆవిష్కరించిన అనంతరం వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం యువత మాదక ద్రవ్యాల బానిసలుగా మారడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ వేళ మార్కెట్లోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల వచ్చే అవకాశం ఉందని, ఇది సమాజానికి పెను సవాలుగా మారిందని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని కట్టడి చేయాలంటే కేవలం పోలీసుల నిఘా మాత్రమే సరిపోదని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువ బృందాన్ని సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా, తన పాట ద్వారా యువతలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించిన రచయిత ఉప్పుల రమేష్ కుమార్‌ను ఆయన ప్రశంసించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను రమేష్ కుమార్ తన పాటలో యువతకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారని కొనియాడారు. ఇలాంటి పాటల ద్వారా యువతలో మార్పు వస్తుందని, తద్వారా వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

44
సామాజిక బాధ్యతగా రచయిత ప్రస్థానం
Image Credit : Asianet News

సామాజిక బాధ్యతగా రచయిత ప్రస్థానం

ఈ పాటకు రచయిత అయిన రమేష్ కుమార్ ఉప్పుల, సమాజంలో జరుగుతున్న పరిణామాలను లోతుగా పరిశీలించే వ్యక్తిత్వం ఉన్నవారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జన్మించిన ఆయన, డిగ్రీ వరకు సొంత జిల్లాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పట్టా అందుకున్నారు.

ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రవేశించి, అంచలంచలుగా ఎదిగారు. ఢిల్లీలోని పలు జాతీయ స్థాయి మీడియా సంస్థల్లోనూ పనిచేసిన అనుభవం ఆయన సొంతం. మీడియా రంగంలో తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి, ప్రస్తుతం సమాజ సేవపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తనదైన శైలిలో పాటలు, రచనలు చేస్తూ సామాజిక రుగ్మతలపై యువతను చైతన్యపరుస్తున్నారు. త్వరలోనే దివ్యాంగులు, వృద్ధుల సమస్యలను ప్రతిబింబించేలా తాను రాసిన మరో రెండు పాటలను విడుదల చేయనున్నట్లు రమేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
పోలీసు భద్రత
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
Recommended image2
Now Playing
Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
Recommended image3
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Recommended image2
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved