MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • IMD Rain Alert : హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

IMD Rain Alert : హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Rain Alert : తెలంగాణలో ఇవాళ ఒక్కరోజు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపటి నుండి సాధారణ వేసవి వాతావరణమే నమోదవుతుందని తెలిపింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 25 2026, 07:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నగరవాసులకు అలర్ట్..
Image Credit : ANI

నగరవాసులకు అలర్ట్..

Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇవాళ (ఫిబ్రవరి 25, బుధవారం) కూడా కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని... సాయంత్రం వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు గత రాత్రే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాబాద్ లో వర్షాలు
Image Credit : Getty

హైదరాబాద్ లో వర్షాలు

మంగళవారం (ఫిబ్రవరి 24న) తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురిశాయి... హైదరాబాద్ లో కూడా వానలు దంచికొట్టాయి. పటాన్ చెరు, ఆర్సిపురం, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, బాచుపల్లి, నిజాంపేట, గచ్చిబౌలి, కొండాపూర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ వానల కారణంగా చాలాచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది... జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.

35
హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం ఇక్కడే..
Image Credit : X/Warangal Weatherman

హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం ఇక్కడే..

హైదరాబాద్ లో గత ఆదివారం (ఫిబ్రవరి 22) నుండి వర్షాలు కురుస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు అత్యధికంగా రాజేంద్రనగర్ పరిధిలోని బహదూర్ పురాలో 42.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది… రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 40 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యింది. తెలంగాణలో అత్యధిక వర్షపాతం నల్గొండ జిల్లా చందంపేటలో 70 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.

45
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
Image Credit : X/APSDMA

ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

ఇవాళ (ఫిబ్రవరి 25న) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

55
రేపట్నుంచి ఎండలు షురూ..
Image Credit : Getty

రేపట్నుంచి ఎండలు షురూ..

నేటితో అకాల వర్షాలు ముగుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రేపు (ఫిబ్రవరి 26, గురువారం) నుండి తిరిగి ఎండలు ప్రారంభం అవుతాయని... మార్చి 2 నుండి 7 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ముఖ్యంగా ఈస్ట్, నార్త్ తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. హైదరాబాద్ లో అత్యధికంగా 37 డిగ్రీలు నమోదై ఉక్కపోత పెరుగుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Recommended image2
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved