ibomma Ravi: ఐబొమ్మ రవి ఇలా మారడానికి ఆ అవమానమే కారణమా.? భార్య, అత్త చేసిన పనికి..
ibomma Ravi: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి పేరు మారుమోగుతోంది. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాలు విసిరి నెల రోజుల్లోనే కటకటల్లోకి వెళ్లాడు. అయితే కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పోలీసులకు సవాల్ చేసిన నెలకే నెలకే కటకటాలు
పోలీసులు తనను పట్టుకోలేరని ఛాలెంజ్ విసిరిన నెల రోజుల్లోపే ఐబొమ్మ రవి కటకటాల్లోకి వెళ్లాడు. ప్రస్తుతం విచారణ చేపడుతోన్న పోలీసులు రవి.. ప్రవర్తన, ఆలోచనా ధోరణిపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. రవి ఇలా నేరస్థుడిగా మారడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
కుటుంబ జీవితంలో గొడవలు
కాలేజీలో టైమ్‌లో ప్రేమలో పడిన రవి 2016లో వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తొలి నుంచే కుటుంబంలో గొడవలు జరిగాయి. రవి ఆదాయం సరిపోక విభేదాలు పెరిగాయి. డబ్బు సంపాదించటం నీ వల్ల కాదంటూ భార్యతోపాటు అత్త కూడా హేళన చేశేవారు. ఈ అవహేళనలే అతనిలో కసిని పెంచాయి. ఇదే సమయంలో వెబ్ డిజైనింగ్‌లో ఉన్న అనుభవంతో ఐబొమ్మ, బప్పం టీవీ వంటి సైట్లను తయారు చేశాడు.
అకస్మాత్తుగా భారీ డబ్బు
కొద్ది రోజులకే బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి ప్రకటనలు రావటం అతని జీవితాన్ని మార్చేసింది. ఊహించని స్థాయిలో డబ్బు చేరింది. అయినా కూడా భార్య అతనితో ఉండటానికి సిద్ధం కాలేదు. దీంతో 2021లో విడిపోయారు. తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి సైట్ల నిర్వహణ కొనసాగించాడు. ఆ సైట్ల ద్వారా సేకరించిన కోట్ల మంది డేటాను సైబర్ ముఠాలకు అమ్మి సుమారు రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు విచారణలో వెల్లడైంది.
విదేశాల్లో స్థిరపడే ప్లాన్
కూకట్‌పల్లిలో ఉన్న ఫ్లాట్‌ను అమ్మి వచ్చిన డబ్బుతో విదేశాల్లో శాశ్వతంగా ఉండాలనే ఆలోచన చేశాడు రవి. ఆ ప్లాన్ అమలు చేసేముందే పోలీసులు అతని కదలికలను గుర్తించారు. దేశం బయట ఉన్నా అక్రమ కార్యకలాపాలను నియంత్రించగలమని ప్రత్యేక బృందాలు నిరూపించాయి.
‘పైరసీకి దూరంగా ఉండండి’ సీపీ సజ్జనార్ హెచ్చరిక
“సవాల్ విసిరే నేరస్థులకు జైలు తప్పదు” అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. పైరసీ సైట్లు అందించే “ఉచిత వినోదం” వెనుక ప్రమాదకర ఉద్దేశ్యం దాగి ఉంటుందని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలను తక్కువ చేసి చూడడం తప్పని, నేరం చేసి తప్పించుకునే అవకాశం ఎవరికి ఉండదని ఆయన హెచ్చరించారు.