- Home
- Telangana
- Hyderbad Rains : మీకు హైడ్రా నుండి ఈ మెసేజ్ వచ్చిందా..? అయితే ఇంట్లోంచి అడుగు బైటపెట్టకండి
Hyderbad Rains : మీకు హైడ్రా నుండి ఈ మెసేజ్ వచ్చిందా..? అయితే ఇంట్లోంచి అడుగు బైటపెట్టకండి
హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో మీకు హైడ్రా నుండి వార్నింగ్ మెసేజ్ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండండి. ఇంతకూ ఆ మెసేజ్ ఏమిటో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

మీకు హైడ్రా మెసేజ్ వచ్చిందా?
Hyderabad : మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? అయితే తప్పకుండా మీకు హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) నుండి మెసేజ్ వచ్చివుంటుంది. హైడ్రా పేరు కనిపించగానే కంగారుపడిపోకండి... అది కేవలం వర్షాల వేళ జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ మెసేజ్ మాత్రమే. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు అలర్ట్ మెసేజ్ లు పంపిస్తోంది హైడ్రా.
ఏమిటీ హైడ్రా?
గ్రేటర్ హైదరాబాద్, మున్సిపల్ కార్పోరేషన్ (GHMC)తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతాలు ఈ హైడ్రా పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నీటి కాలువలు అన్యాక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత హైడ్రా చేపడుతోంది. రేవంత్ సర్కార్ దీన్ని ఏర్పాటుచేసింది... సీనియర్ ఐపిఎస్ రంగనాథ్ కు హైడ్రా బాధ్యతలు అప్పగించింది. ఇటీవల కాలంలో ఈ హైడ్రా పేరు బాగా వినిపిస్తోంది.
వర్షాల సమయంలో తస్మాత్ జాగ్రత్త...
అయితే ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో వర్షపునీరు చేరడం, నాలాలు పొంగిపొర్లడం, చెరువులు నిండిపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలు మునకకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే వర్షపు నీరు రోడ్లపై నిలిపిపోవడం ట్రాఫిక్ కు అంతరాయం కలిగి భారీ ట్రాఫిక్ జామ్ లు జరగవచ్చు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వర్షాలవేళ బయటకు వెళ్లేవారు ట్రాఫిక్ సమాచారం తెలుసుకోవాలని హైడ్రా సూచించింది. ట్రాఫిక్ జామ్ అయిన రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని తొందరగా, సేఫ్ గా గమ్యస్థానాలను చేరుకోవాలని సూచించింది.
డిసాస్టర్ మేనేజ్మెంట్ సూచనలు పాటించండి
ఇక భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది... కాబట్టి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (State Disaster Management Authority) సూచనలను పాటించాలని హైడ్రా హెచ్చరించింది. వర్షాల వేళ రోడ్డుపైకి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి... కరెంటు స్తంభాలను తాకకూడదు. ఈదురుగాలులు వీస్తుంటే చెట్లు, పెద్దపెద్ద హోర్డింగ్ లకు దూరంగా ఉండాలి. రోడ్డుపై నిలిచిన వాననీటిని జాగ్రత్తగా దాటాలి. ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సూచలను పాటించాలని హైడ్రా హైదరాబాద్ ప్రజలను కోరుతోంది.
ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ఈ జాగ్రత్తలు పాటించండి
హైదరాబాద్ లో నిన్నటి(గురువారం) నుండి వర్షాలు ఊపందుకున్నాయి. గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది... మళ్ళీ ఇవాళ(శుక్రవారం) కూడా వర్షం దంచికొడుతోంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది... దీంతో రోడ్లన్ని జలమయమై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
ఉద్యోగులు తమ పనులు ముగించుకుని కార్యాలయాల నుండి ఇళ్లకు బయలుదేరే సమయంలో ఈ వర్షం మొదలయ్యింది… దీంతో ఎక్కడిక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రాంతంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది... పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.