MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌లో 120 ఏళ్ల చ‌రిత్ర ఉన్న బ్రేక్‌ఫాస్ట్ స్పాట్‌.. పాయా సూప్ ఒక్క‌సారి తాగితే జీవితంలో మ‌ర్చిపోరు

హైద‌రాబాద్‌లో 120 ఏళ్ల చ‌రిత్ర ఉన్న బ్రేక్‌ఫాస్ట్ స్పాట్‌.. పాయా సూప్ ఒక్క‌సారి తాగితే జీవితంలో మ‌ర్చిపోరు

Hyderabad: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు.. ఉదయం టిఫిన్‌లో నిహారీకి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. పాతబస్తీలోని హుస్సేనీ ఆలం ప్రాంతంలో ఉన్న మూసా భాయ్ నిహారీ పాయా హోటల్ ఆ రుచికి చిరునామాగా నిలిచింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 10 2026, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెల్లవారుజామునే మొదలయ్యే సందడి
Image Credit : Hot eat/Youtube

తెల్లవారుజామునే మొదలయ్యే సందడి

ఈ హోటల్‌కు 120 ఏళ్ల చరిత్ర ఉందని యజమానులు చెబుతున్నారు. మూసా భాయ్ నిహారీ పాయా హోటల్ ఉదయం 5 గంటలకే తెరుచుకుంటుంది. అప్పటికే స్థానికులు, ఫుడ్ లవర్స్, దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు క్యూలో నిలబడుతుంటారు. హోటల్ బయట పెద్ద బోర్డులు, ఆకర్షణీయమైన అలంకరణలు ఉండవు. చిన్న కౌంటర్, కొన్ని బెంచీలు మాత్రమే కనిపిస్తాయి. కానీ అక్కడి నుంచి వచ్చే నిహారీ సువాసనే ఈ హోటల్‌ను గుర్తించేలా చేస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ నిహారీ ప్రత్యేకత ఏంటి?
Image Credit : Hot eat/Youtube

ఈ నిహారీ ప్రత్యేకత ఏంటి?

ఈ హోటల్‌లో నిహారీని సంప్రదాయ పద్ధతిలో కట్టెల పొయ్యిపై గంటల తరబడి మెల్లగా ఉడికిస్తారు. దీంతో మాంసం చాలా మెత్తగా, రుచిగా మారుతుంది. ఇక్కడ ఎక్కువ మసాలాలు, ఎక్కువ నూనె ఉపయోగించరు. అల్లం, వెల్లుల్లి, పొట్లీ మసాలా, కొత్తిమీర, పుదీనా వంటి కొద్దిపాటి పదార్థాలతోనే ప్రత్యేక రుచిని తీసుకొస్తారు. ఇక్కడ నల్లీ నిహారీ, పాయా, జబాన్ వంటి వంటకాలు ఎక్కువగా లభిస్తాయి. సంప్రదాయ హైదరాబాద్ రుచిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి ప్రదేశంగా చెప్పొచ్చు.

Related Articles

Related image1
Viral Video: రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం, పాపం... వంటింట్లో ఎలా కష్టపడుతున్నాడో చూడండి
Related image2
Railway: రైలు ఎక్కే ప్ర‌తీ ఒక్కరికీ రూ. 10 ల‌క్ష‌లు.. ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?
35
ఇక్కడ నాన్ ఇవ్వరు.. ఎందుకో తెలుసా?
Image Credit : Hot eat/Youtube

ఇక్కడ నాన్ ఇవ్వరు.. ఎందుకో తెలుసా?

మూసా భాయ్ నిహారీ పాయా హోటల్‌లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ నిహారీ మాత్రమే విక్రయిస్తారు. నాన్ లేదా ఇతర రొట్టెలు అందుబాటులో ఉండవు. అందుకే ఇక్కడికి వచ్చే చాలా మంది తమకు కావాల్సిన బ్రెడ్ లేదా నాన్‌ను బయట నుంచి తీసుకువచ్చి నిహారీతో కలిసి తింటారు. ఈ సంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది.

45
ఐదో త‌రం కుటుంబం
Image Credit : Hot eat/Youtube

ఐదో త‌రం కుటుంబం

ఈ హోటల్‌ను ప్రస్తుతం ఐదో తరం కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్లు యజమానులు చెబుతున్నారు. తమ కుటుంబం 120 ఏళ్లుగా ఇదే నిహారీ తయారీ సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని వారు పేర్కొంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక రికార్డులు లేదా చారిత్రక ఆధారాలు లేవు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ హోటల్‌ను "120 ఏళ్ల నిహారీ స్పాట్"గా చాలా మంది చెబుతున్నారు.

55
రుచే ఈ హోటల్‌కు అసలైన గుర్తింపు
Image Credit : Hot eat/Youtube

రుచే ఈ హోటల్‌కు అసలైన గుర్తింపు

మూసా భాయ్ నిహారీ పాయా హోటల్‌కు పేరు తీసుకొచ్చింది ఖరీదైన ఇంటీరియర్స్ కాదు.. ప్రచారం కూడా కాదు. తరతరాలుగా మారని సంప్రదాయ రుచి, నాణ్యతే ఈ హోటల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఓల్డ్ సిటీ వంటకాల అసలైన రుచిని ఆస్వాదించాలని కోరుకునే వారికి ఈ హోటల్ తప్పక వెళ్లాల్సిన ప్రదేశంగా మారింది. ఒకసారి ఇక్కడి నిహారీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించేలా ఉంటుందని ఫుడ్ లవర్స్ చెబుతుంటారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
కొండా ఫ్యామిలీ వర్సెస్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ పాలిటిక్స్‌లో అస‌లేం జరుగుతోంది.?
Recommended image2
ఆగ‌స్టు 21న స్కూళ్ల‌కు సెల‌వు.. ప్రిన్సిప‌ల్ హ‌త్య‌ను ఖండిస్తూ. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
Now Playing
Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
Related Stories
Recommended image1
Viral Video: రేవంత్ రెడ్డిలో ఎప్పుడూ చూడని కోణం, పాపం... వంటింట్లో ఎలా కష్టపడుతున్నాడో చూడండి
Recommended image2
Railway: రైలు ఎక్కే ప్ర‌తీ ఒక్కరికీ రూ. 10 ల‌క్ష‌లు.. ఎంబెడెడ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved