MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?

Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?

హైదరాబాద్ ప్రజలు కూరగాయలు కొనాలంటేనే భయమేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇటీవల సిటీలో కూరగాయలు, ఆకుకూరల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 08 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సామాన్యులకు షాకిస్తున్న కూరగాయల ధరలు
Image Credit : Gemini AI

సామాన్యులకు షాకిస్తున్న కూరగాయల ధరలు

Vegetables Price in Hyderabad : హైదరాబాద్ జనాలకు ఇప్పుడు కూరగాయలు కొనడం పెద్ద సవాల్‌గా మారింది. ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరల రేట్లు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి... దీంతో సామాన్యులు కొనలేని పరిస్థితి. రేట్లు ఎక్కువగా ఉన్నాయని పస్తులు ఉండలేరుగా... అందుకే జేబులు ఖాళీ చేసుకుని మరీ కొనాల్సి వస్తోంది... దీంతో వారి నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. ముఖ్యంగా టమాటా, బీన్స్ లాంటి కూరగాయల ధరలు నేలవైపు చూడటంలేవు... ఆకాశం వైపు దూసుకెళుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టమాటా ధర రూ.25 నుంచి రూ.55కు జంప్
Image Credit : Pixabay

టమాటా ధర రూ.25 నుంచి రూ.55కు జంప్

గతంలో కేవలం రూ.15-20 కే కిలో టమాటాలు వచ్చాయి… కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టమాటా ధరలకు రెక్కలొచ్చాయి… హైదరాబాద్ లోని కొన్ని మార్కెట్లలో కిలో రూ.54కు అమ్ముడవుతోంది. ఇక సూపర్ మార్కెట్లలో అయితే టమాటా ధర మరింత ఎక్కువగా ఉంది. మంచి నాణ్యత గల టమాటా ధర రూ.70-80 కూడా పలుకుతోంది.

టమాటా సంగతి ఇలా ఉంటే దీన్ని మించిపోయేలా బీన్స్ ధరలు ఉన్నాయి. గతవారం కిలో రూ.70 ఉన్న బీన్స్ ధర ఇప్పుడు ఏకంగా సెంచరీ (రూ.95-100) చేరింది. కేవలం వారం రోజుల్లోనే వీటి ధరలు దాదాపు డబులు అయ్యాయి... దీంతో కొనేవారి జేబులు ఖాళీ అవుతున్నాయి. టమాటా, బీన్స్ మాత్రమే కాదు... వంకాయ, క్యాప్సికం, గోరుచిక్కుడు, కీరదోస, ముల్లంగి, బీట్‌రూట్ ధరలు కూడా భారీగా పెరిగాయి.

35
ఆకుకూరల రేట్లు డబుల్
Image Credit : Gemini AI

ఆకుకూరల రేట్లు డబుల్

కూరగాయలతో పాటు ఆకుకూరల ధరలు కూడా కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. పాలకూర, కొత్తిమీర, పుదీనా, సోయాకూర, గోంగూర లాంటి ఆకుకూరల రేట్లు మండిపోతున్నాయి. సాధారణంగా రూ.8 నుంచి రూ.10కి దొరికే ఆకుకూరల కట్ట ఇప్పుడు రూ.20 నుంచి రూ.30కి చేరింది. ఒక పాలకూర కట్ట ధర కూడా రూ.10 నుంచి రూ.20కు పెరిగింది. చివరకు కరివేపాకు, కొత్తిమీర ధరలు కూడా పెరిగాయి... రూ.10 కు దొరికే కొత్తిమీర కట్ట ఇప్పుడు రూ.20 కి అమ్ముతున్నారు.

45
ఉల్లి ధర పైపైకి..
Image Credit : Chatgpt

ఉల్లి ధర పైపైకి..

ప్రతి వంటింట్లో తప్పకుండా ఉల్లిపాయలు ఉంటాయి. మరీముఖ్యంగా తెలుగువారి వంటల్లో ఉల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు... బిర్యాని నుండి కూరలు, పప్పు వరకు తాలింపులో ఉల్లిపాయ ముక్కలు పడాల్సిందే. అయితే ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు రూ.20-30 కి కిలో ఉల్లిపాయలు వస్తే ఇప్పుడు రూ.50 పెట్టినా వచ్చే పరిస్థితి లేదు. హైదరాబాద్ మార్కెట్స్ లో రూ.120-130 కి రెండు కిలోల ఉల్లిపాయలు అమ్ముతున్నారు... అంటే కిలో రూ.60-65 అన్నమాట.

55
ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదా?
Image Credit : Getty

ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదా?

ఇటీవల కురిసిన వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల పంటలు దెబ్బతినడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో పొలాల్లోనే పంట కుళ్లిపోవడంతో మార్కెట్‌కు కూరగాయల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై లేకపోవడంతోనే రేట్లు ఈ స్థాయిలో పెరిగాయి.

హైదరాబాద్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది. అయితే రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ వర్షాలు పడితే పంట నష్టం మరింత పెరిగి, మార్కెట్‌కు వచ్చే కూరగాయల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో కూరగాయల ధరలు పెరుగుతాయి.. చివరికి ఆ భారం కస్టమర్ల మీదే పడుతుంది.

కిచెన్ బడ్జెట్‌పై భారం

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న జనాలకు.. ఈ కూరగాయల రేట్లు మరింత భారాన్ని తెచ్చిపెట్టాయి. వారం రోజుల్లోనే టమాటా రూ.25 నుంచి రూ55కు, బీన్స్ రూ.70 నుంచి రూ.100 కు పెరగడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాతావరణం సాధారణ స్థితికి చేరుకుని మార్కెట్‌కు కూరగాయల సరఫరా పెరిగితేనే ధరలు తగ్గే అవకాశం ఉంది. లేదంటే మరింత పైకి ఎగబాకుతాయి... సామాన్యులు కుటుంబం బడ్జెట్ ను తారుమారు చేస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
తెలంగాణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Musi Riverfront Project: మూసీ నది ఒడ్డున రూ.1,108 కోట్లుతో ఓంకారేశ్వరాలయం
Recommended image2
RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Recommended image3
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Price Fall: దసరా వేళ బంగారం భారీ పతనం...పసిడి ప్రియులకు పండగే పండగ
Recommended image2
Petrol Price : ఇండియాలో కేవలం రూ.88 కే లీటర్ పెట్రోల్ దొరికే ప్రాంతమేది? ఎందుకింత తక్కువ ధర?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved