MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మంచి నీరు, ప్రసాదంలో విషం క‌లిపి వేలాది మందిని చంపే ప్లాన్‌.. హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

మంచి నీరు, ప్రసాదంలో విషం క‌లిపి వేలాది మందిని చంపే ప్లాన్‌.. హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

Hyderabad: ఢిల్లీలో జ‌రిగిన కారు పేలుడు నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో మ‌రో భారీ ఉగ్ర కుట్ర భగ్న‌మైంది. ఆయుధాల‌తో కాకుండా విషంతో వేలాది మందిని స‌మూహిక హ‌త్య చేసేందుకు చేసిన ఓ భారీ ప్లాన్ వెలుగులోకి వ‌చ్చింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 11 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గుజ‌రాత్‌లో హైదరాబాద్‌ వైద్యుడి అరెస్ట్
Image Credit : ANI

గుజ‌రాత్‌లో హైదరాబాద్‌ వైద్యుడి అరెస్ట్

హైదరాబాద్‌ కేంద్రంగా మరోసారి ఉగ్ర లింకులు బయటపడటంతో భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. గుజరాత్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్) మూడు మంది ఐసిస్‌ అనుచరులను అదుపులోకి తీసుకుంది. వారిలో రాజేంద్రనగర్‌కు చెందిన వైద్యుడు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతడి వద్ద నుంచి తుపాకులు, రసాయనాలు, రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చెప్పినట్లుగా, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయిన ఈ ముగ్గురు దేశంలో పెద్ద స్థాయి విధ్వంసానికి పన్నాగం పన్నారు.

25
సైనైడ్‌ కంటే ప్రమాదకరమైన రసాయనం – రైసిన్ తయారీ
Image Credit : Getty

సైనైడ్‌ కంటే ప్రమాదకరమైన రసాయనం – రైసిన్ తయారీ

అహ్మదాబాద్‌ సమీపంలోని అడాలజ్‌ టోల్‌ ప్లాజా వద్ద ఏటీఎస్‌ అధికారులు సయ్యద్ మొహియుద్దీన్‌ను పట్టుకున్నారు. అతడి బ్యాగ్‌లోని ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌లో ఉన్న ద్రవ పదార్థాన్ని పరీక్షించగా, అది ‘రైసిన్’ అనే అత్యంత విష రసాయనమని తేలింది. ఇది సైనైడ్‌ కన్నా శాతం ఎక్కువగా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఈ పదార్థం స్వల్ప పరిమాణంలోనే ప్రాణాంతకం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆముదం గింజల నుంచి మిగిలిపోయిన వ్యర్థాలతో ఈ రసాయనాన్ని తయారు చేస్తున్నాడు. ఈ పని కోసం అతడు తన నివాసంలోని గదినే ప్రయోగశాలగా మార్చుకున్నాడు. ఈ విష‌యంతో పెద్ద ఎత్తున సామూహిక విష ప్రయోగానికి ప్రణాళిక రచించాడని పోలీసు విచారణలో తేలింది. దేవాల‌యాల్లో ప్ర‌సాదం, మంచి నీటిలో విషాన్ని క‌లిపి వేలాది మందిని చంపాల‌ని కుట్ర ప‌న్నిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
మొబైల్ యూజర్లకు జలక్.. రూ. 189 ప్లాన్‌ను తొల‌గించిన ప్ర‌ముఖ‌ టెలికం సంస్థ‌
Related image2
పాలు లేకుండానే లక్ష‌ల కిలోల నెయ్యి.. ఐదేళ్ల‌లో రూ. 250 కోట్లు స్వాహా. తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వహారంలో విస్తుపోయే నిజాలు
35
ఒంటరి జీవితం, రహస్య ప్రయోగాలు
Image Credit : Asianet News

ఒంటరి జీవితం, రహస్య ప్రయోగాలు

మొహియుద్దీన్‌ రాజేంద్రనగర్‌ ఫోర్ట్ వ్యూ కాలనీలో తల్లిదండ్రులతో నివసించేవాడు. చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత, కొంతకాలం ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేశాడు. పెళ్లి ఆలస్యం కావడంతో ఒత్తిడికి గురై, ఆన్‌లైన్‌లో రసాయనాలపై ప్రయోగాలు మొదలుపెట్టాడని స్థానికులు చెబుతున్నారు. తన గదిలోనే రసాయనాలు మిక్స్‌ చేస్తూ కొత్త పదార్థాలు తయారు చేసేవాడు. కుటుంబసభ్యులు అతనిపై అనుమానం వ్యక్తం చేయగా, తాను మార్కెట్‌లో అమ్మదగిన విలువైన రసాయనం తయారు చేస్తున్నానని చెప్పేవాడట.

45
ఐసిస్‌ సానుభూతిపరులతో సంబంధాలు
Image Credit : X

ఐసిస్‌ సానుభూతిపరులతో సంబంధాలు

మొహియుద్దీన్‌ ఉగ్రవాదం పట్ల ఆసక్తి పెంచుకున్నాక, టెలిగ్రామ్‌ గ్రూపులు, సోషల్‌ మీడియా ఛానళ్ల ద్వారా ఐసిస్‌ సానుభూతిపరులతో పరిచయాలు పెంచుకున్నాడు. వారిచ్చిన ఆదేశాలతో కోల్‌కతా, ముంబయి, అహ్మదాబాద్‌ నగరాలకు తరచుగా ప్రయాణించేవాడు. గుజరాత్‌ డీఐజీ సునీల్ ప్రకారం – “సయ్యద్ వద్ద ఆయుధాలు, రసాయనాలు లభించాయి. ఫోన్‌ డేటా పరిశీలనలో అతడు విదేశీ వ్యక్తులతో క్రమం తప్పకుండా సమాచారం పంచుకున్నట్లు తేలింది. రైసిన్‌ అనే ప్రమాదకర పదార్థాన్ని స్వయంగా తయారు చేస్తున్నాడు” అని వివరించారు.

55
హైదరాబాద్‌లో తనిఖీలు
Image Credit : google

హైదరాబాద్‌లో తనిఖీలు

గుజరాత్‌ ఏటీఎస్‌ అధికారులు సమాచారం అందించిన వెంటనే, హైదరాబాద్‌ పోలీసులు రాజేంద్రనగర్‌లోని అతడి నివాసంపై నిఘా ఏర్పాటు చేశారు. ఇంట్లో ప్రయోగ పరికరాలు, రసాయనాలు ఉన్నాయనే అనుమానంతో, ఏటీఎస్‌ బృందం త్వరలో తనిఖీలు జరపనుంది. స్థానిక పోలీసులు కూడా అతడితో సంబంధం ఉన్న వ్యక్తులపై విచారణ ప్రారంభించారు. గతంలో కూడా రైల్వే స్టేషన్లపై ఉగ్ర కుట్రలలో హైదరాబాద్‌ లింకులు బయటపడిన నేపథ్యంలో, ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
Recommended image2
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు
Recommended image3
IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Related Stories
Recommended image1
మొబైల్ యూజర్లకు జలక్.. రూ. 189 ప్లాన్‌ను తొల‌గించిన ప్ర‌ముఖ‌ టెలికం సంస్థ‌
Recommended image2
పాలు లేకుండానే లక్ష‌ల కిలోల నెయ్యి.. ఐదేళ్ల‌లో రూ. 250 కోట్లు స్వాహా. తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వహారంలో విస్తుపోయే నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved