Gram Panchayat Polls: మూడు విడతలుగా జరిగిన తెలంగాణ పంచాయితీ పోరు బుధవారం సాయంత్రం ముగిసింది. గ్రామీణ ప్రజానీకం స్పష్టమైన తీర్పును అందించగా.. కాంగ్రెస్ భారీ స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండగా..
మూడో దశల్లో జరిగిన తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో బుధవారం ముగిశాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలు వెలువరించిన తీర్పు తెలంగాణ రాజకీయ దృశ్యాన్ని మరోసారి క్లియర్ చేసింది. ఈ ఎలక్షన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే ముందంజలో ఉండగా.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు, మూడు స్థానాలకే పరిమితమయ్యాయి.
ఎవరెవరు ఎన్ని స్థానాలు అంటే..
రాష్ట్రంలోని 12,728 గ్రామ పంచాయతీలకు గానూ 1,205 సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు దశల్లో 11,497 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 8335 పంచాయతీలను గెలుపొందగా.. బీఆర్ఎస్ 3,511 పంచాయతీలను.. బీజేపీ 710 పంచాయతీలను గెలుచుకుంది. 146 చోట్ల ఇతరులు గెలిచారని వెల్లడించారు. ఇక 808 స్థానాలను పార్టీ రెబల్స్ గెలిచుకున్నారని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పలు ప్రాంతాల్లో పలువురు అభ్యర్ధులు ఓటర్లకు డబ్బులు పంచారని వార్తలు వినిపించినా.. ప్రజలు మాత్రం అధికార పార్టీ అయినా.. బీఆర్ఎస్ అయినా.. బీజేపీ అయినా.. అభివృద్ధికి తగ్గట్టుగానే తమ ఓట్లను వేశారు.
బీఆర్ఎస్ సంతృప్తి..
బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ అభ్యర్ధులు రెండింటల ఎక్కువ స్థానాల్లోనే తమ విజయభేరి మోగించారు. ఇది పూర్తిగా ప్రస్తుత రాజకీయ దృశ్యాన్ని స్పష్టం చేసింది. ఎన్నికలు జరిగి రెండేళ్లు గడిచినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఇంకా ప్రజల పట్టం కట్టినట్టు తెలుస్తోంది. అలాగే ఇదే సమయంలో ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ.. సర్పంచ్ ఎన్నికలు ఇంకా ఆ పార్టీని తెలంగాణలో రెండో బలమైన పార్టీగా ఉంచింది. కేవలం 10 శాతం గ్రామీణ బలంతో మూడో స్థానంలో నిలిచింది బీజేపీ.
ఈ మూడు విడతల పంచాయితీ ఎన్నికలు.. రాష్ట్రంలోని గ్రామీణ జనాభా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చెంత ఉన్నట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది వచ్చే ఎన్నికలకు రేవంత్ రెడ్డి పార్టీకి ప్రధాన బలంగా మారనున్నాయి. అటు తమకొచ్చిన ఫలితాలు, గెలిచిన స్థానాలు ఆధారంగా బీఆర్ఎస్ మనోధైర్యంతో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలకు సన్నద్ధం కానుంది.


