- Home
- Telangana
- హైదరాబాద్ స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. వీరికి మాత్రమే ఓ ఎక్స్ట్రా హాలిడే, ఎందుకో తెలుసా?
హైదరాబాద్ స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. వీరికి మాత్రమే ఓ ఎక్స్ట్రా హాలిడే, ఎందుకో తెలుసా?
School Holidays : రాష్ట్రంలో మరెక్కడా లేదు… కేవలం హైదరాబాద్ లో మాత్రమే విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఓ రోజు ఎక్స్ట్రా హాలిడే వస్తోంది. దీనిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసింది.

హైదరాబాద్ లో మాత్రమే సెలవు..
School Holidays : తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు గతనెల సెప్టెంబర్ నుండి వరుస సెలవులు వస్తున్నాయి... దసరాతో ప్రారంభమైన సెలవులు దీపావళితో కొనసాగి క్రిస్మస్, సంక్రాంతితో ముగుస్తాయి. ఇలా నాలుగైదు నెలలు విద్యార్థులకు వరుస సెలవులు వస్తూనే ఉంటాయి. ఆసక్తికర విషయం ఏంటంటే ఈసారి కేవలం హైదరాబాద్ విద్యార్థులకే ఓరోజు ఎక్స్ట్రా సెలవు వస్తోంది... ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా హాలిడే కూడా ప్రకటించింది. మరి ఏరోజు, ఎందుకు అదనపు సెలవు వస్తుందో తెలుసుకుందాం.
నవంబర్ లో సడన్ హాలిడే..
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది... నామినేషన్ల ప్రక్రియతో పాటు ప్రచార జోరు కొనసాగుతోంది. వచ్చే నెల నవంబర్ 11న (మంగళవారం) పోలింగ్ జరగనుంది. దీంతో ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది.
ఇక ఓటు వేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు ప్రకటించింది. అంటే నవంబర్ 11న పోలింగ్ జరిగే కార్యాలయాలు తప్ప మిగతా ప్రభుత్వ ఆఫీసులన్ని మూతపడనున్నాయి. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ప్రైవేట్ సంస్థలు కూడా జూబ్లీహిల్స్ పోలింగ్ రోజు తమ ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం సూచిస్తోంది.
నవంబర్ 11 సెలవుపై అధికారిక ప్రకటన
నవంబర్ 11న జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల సెలవుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు, మరికొందరు ఉద్యోగులు మాత్రమే ఎన్నికల విధుల్లో ఉంటారు... మిగతావారికి సెలవు ఉంటుంది. ఇలా ఈ నియోజకవర్గ పరిధిలోని పనిచేసే ఉద్యోగులు, చదువుకునే స్టూడెంట్స్ అందరికీ సెలవే.
ఒక్కరోజు మేనేజ్ చేస్తే... నాల్రోజులు సెలవులే
నవంబర్ 8 రెండో శనివారం... కాబట్టి తెలంగాణలోని విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఆరోజు సెలవు వస్తోంది. తర్వాతి రోజు నవంబర్ 9న ఎలాగూ ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు లేదా విద్యార్థులు నవంబర్ 10 సోమవారం ఒక్కరోజు మేనేజ్ చేసుకుంటే చాలు నవంబర్ 11న ఉపఎన్నిక సందర్భంగా సెలవు ఉంది. ఇలా కావాలనుకుంటే జూబ్లీహిల్స్ పరిధిలోనివారికి నవంబర్ లో వరుసగా నాలుగురోజులు సెలవు తీసుకునే అవకాశం ఉంది.
అయితే పోలింగ్ లో పాల్గొనేందుకే నవంబర్ 11న సెలవు ఇచ్చింది ప్రభుత్వం... కాబట్టి నియోజకవర్గ పరిధిలోని ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలి. వరుస సెలవులు వచ్చాయికదా అని విహారయాత్రలు ప్లాన్ చేసుకోవద్దని... వీకెండ్ ఇలాంటి ప్లాన్స్ ఏమైనా చేసుకున్నా పోలింగ్ రోజున నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సహజంగా నగరంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంటుంది... కానీ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసమే ఓటర్లను చైతన్యపర్చే కార్యక్రమాలు చేపడుతోంది.
దీపావళికి మూడ్రోజులు సెలవులు
తెలంగాణ విద్యార్థులు, కొందరు ఉద్యోగులకు ఈ దీపావళికి వరుసగా మూడ్రోజులు సెలవులు వచ్చాయి. ఇవాళ (అక్టోబర్ 18, శనివారం) బిసి రిజర్వేషన్ల కోసం తెలంగాణ బంద్ చేపట్టిన నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ఉంది. రేపు (అక్టోబర్ 19) ఆదివారం... ఎలాగూ సాధారణ సెలవు ఉంటుంది. ఇక అక్టోబర్ 20 (సోమవారం) దీపావళి పండగ నేపథ్యంలో ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇలా ఈ దీపావళికి మూడ్రోజుల సెలవులు కలిసివచ్చాయి.