- Home
- Telangana
- Hyderabad : ఇవేం స్కూల్ ఫీజుల్రా నాయనా... ABCD లకే నెలకు రూ.21,000 ఖర్చా..! ఏడాదికెంతో తెలుసా?
Hyderabad : ఇవేం స్కూల్ ఫీజుల్రా నాయనా... ABCD లకే నెలకు రూ.21,000 ఖర్చా..! ఏడాదికెంతో తెలుసా?
Nursery Education Cost : ప్రస్తుతం స్కూల్ ఫీజులు పేరెంట్స్ ని భయపెట్టే స్థాయిలో ఉన్నాయి. కేవలం నర్సరీకే హైదరాబాద్ లోని ఓ స్కూళ్లో ఎంత ఫీజు ఉందో తెలుసా?

చదువు చాలా కాస్ట్లీ గురూ...
చదువుకునే స్థాయినుండి చదువు'కొనే' స్థాయికి మన విద్యావ్యవస్థ చేరుకుంది. ఈ కాలంలో ఎడ్యుకేషన్ వ్యాపారంగా మారిపోయింది... విద్యాబుద్దులు నేర్పాల్సిన విద్యాసంస్థలు ఫీజుల గోలలో పడిపోతున్నాయి. చివరికి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు స్కూల్ ఫీజుల భయానికే ఒకే సంతానంతో సరిపెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే వారికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేమన్నది సదరు పేరెంట్స్ భావన. ఇలా ఎక్కువమంది పిల్లలను వద్దనుకునే స్థాయిలో చదువుకు ఖర్చవుతుందా? అంటే మిడిల్ క్లాస్ పేరెంట్స్ నుండి అవుననే సమాధానం వినిపిస్తుంది.
KNOW
హైదరాబాద్ లో స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయంటే...
హైదరాబాద్ వంటి మెట్రో పాలిటిన్ నగరాల్లో అయితే పిల్లల స్కూల్ ఫీజు అంటేనే పేరెంట్స్ భయపడే పరిస్థితి. కేవలం పిల్లలను ఆడిస్తూ ABCD లు నేర్పించే నర్సరీకే కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇక తరగతులు పెరుగుతున్నకొద్ది ఫీజు కూడా పెరుగుతుంది... ఇలా పిల్లలు పెరిగేకొద్ది తల్లిదండ్రులకు ఫీజుల భారం కూడా పెరుగుతుంది. మొదటిసారి తమ పిల్లలను స్కూల్లో వేద్దామని భావించే పేరెంట్ప్ ఈ ఫీజులను చూసి బెంబేలెత్తిపోవడం కావడం... ఇప్పటికే ఫీజులు కడుతున్న పేరెంట్స్ కి మాత్రం చూసిచూసి ఈ ఫీజుల భారం అలవాటయ్యింది.
ఓ ప్రైవేట్ స్కూల్లో ఫీజుల లిస్ట్ వైరల్
ప్రస్తుతం చదువు ఎంత ఖరీదయ్యిందో తెలియజేసే ఓ స్కూల్ ఫీజుల లిస్ట్ బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ ఏ స్థాయిలో ఫీజులను వసూలు చేస్తుందో తెలిపే ఈ ఫీజుల లిస్ట్ చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఫీజు కట్టడం కాదు ఈ ఫీజుల లిస్ట్ చూస్తేనే పేరెంట్స్ భయపడిపోతారు. హైదరాబాద్ లో స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయో దీన్నిబట్టి అర్థమవుతోంది.
కేవలం నర్సరీకే ఇంత ఫీజా..!
అనురాధ చౌదరి అనే మహిళ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ ఫీజుల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో కేవలం నర్సరీకే రూ.2,51,000 ఫీజు వసూలు చేస్తున్నారు.. ఏడాదికి నాలుగు విడతల్లో రూ.47,750 చొప్పున రూ.1,91,000 ట్యూషన్ ఫీజు, ఇన్స్టిట్యూషన్ ఫీజు పేరిట మరో రూ.11,250 చొప్పున నాలుగు విడతల్లో రూ.45,000 వసూలు చేస్తున్నారు. ఇక అడ్మిషన్ సమయంలో రూ.5,000, కాషన్ డిపాజిట్ పేరిట మరో రూ.10,000 పేరెంట్స్ నుండి తీసుకుంటున్నారు. ఇలా మొత్తంగా నర్సరీకి రెండున్నర లక్షలకు పైగానే ఫీజు డిమాండ్ చేస్తోంది సదరు విద్యాసంస్థ.
కేవలం ఆటలు ఆడించి, ఏబిసిడిలు నేర్చించేందుకు ఇంతింత ఫీజులా! అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నర్సరీ చదివించేందుకు నెలకు రూ.21,000 ఖర్చు చేయాల్సి వస్తోంది... ఇది ఓ సాధారణ ఉద్యోగి జీతంతో సమానం. సంపాదించిందంతా పిల్లల ఫీజుకే పోతే సామాన్యుడు బ్రతికేదెలా? కుటుంబాన్ని పోషించేదెలా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Class- Nursery
Fees - Rs 2,51,000/-
Now, learning ABCD will cost you Rs 21,000 per month.
What are these schools even teaching to justify such a ridiculously high fee? pic.twitter.com/DkWOVC28Qs— Anuradha Tiwari (@talk2anuradha) July 30, 2025
ఏ క్లాస్ కు ఎంత ఫీజు
అనిత చౌదరి బైటపెట్టిన స్కూల్ ఫీజుల వివరాలను చూస్తే.... ఎల్కేజి, యూకేజీ పిల్లల యానువల్ ఫీజు రూ.2,72,400. ఇక 1, 2 తరగతుల పిల్లలకు రూ.2,91,460 ఫీజు ఉంది. మూడో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఫీజు రూ.3,22,350 ఉంది. ఇలా కేవలం ప్రైమరీ తరగతులకే ఈ స్థాయిలో ఫీజులున్నాయి... మరి హయ్యర్ క్లాసుల వెళ్లేకొద్ది ఈ ఫీజులు ఎలా పెరుగుతాయో ఊహించుకుంటేనే పేరెంట్స్ కు భయమేస్తుంది.
అయితే ఈ ఫీజులు మధ్యతరగతి వారికే భారం. ఎందుకంటే చాలిచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే మధ్యతరగతి పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని తలకుమించిన భారమైనా కార్పోరేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ఇక డబ్బులున్న బడాబాబులకు ఎంత ఫీజున్నా భారం కాదు… నిరుపేదలు తమ పిల్లలను ఉచితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తారు… కాబట్టి వీరికి ఫీజుల గొడవ ఉండదు. ఎటుతిరిగి మధ్యతరగతి కుటుంబాలకే ఈ అధిక ఫీజుల సమస్యగా మారాయి.