MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఎకరం భూమి ధ‌ర రూ. 160 కోట్లు.. ఎక్కడో అమెరికాలో కాదు, మన హైద‌రాబాద్‌లోనే

ఎకరం భూమి ధ‌ర రూ. 160 కోట్లు.. ఎక్కడో అమెరికాలో కాదు, మన హైద‌రాబాద్‌లోనే

Hyderabad: హైదరాబాద్ మ‌హా న‌గ‌రం రోజురోజుకీ విస్త‌రిస్తోంది. అంత‌ర్జాతీయ కంపెనీలు భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొస్తున‌న్నాయి. తాజాగా న‌గ‌రంలో ఎక‌రం కంటే త‌క్కువ భూమి రూ. 160 కోట్ల‌కు అమ్ముడుపోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 12 2025, 11:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రికార్డ్ స్థాయిలో భూమి అమ్మకం
Image Credit : Happening Hyderabad/Facebook

రికార్డ్ స్థాయిలో భూమి అమ్మకం

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాయ్‌దుర్గ్‌ (Raidurg) ప్రాంతంలో ఉన్న 0.97 ఎకరాల భూమిని రూ. 160.42 కోట్లకు విక్రయించింది. ఇది రాష్ట్ర చరిత్రలో భూమికి లభించిన అత్యధిక ధర కావ‌డం విశేషం. ఈ భూమిని వంశిరాం బిల్డర్స్ అనే ప్రముఖ హైదరాబాదీ రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు కలుపుకొని మొత్తం విలువ రూ. 172.45 కోట్లు అయ్యింది.

25
ప్రీమియం ప్రాజెక్ట్ కోసం వంశిరాం బిల్డర్స్ ప్రణాళిక
Image Credit : AI Photo/Google Gemini

ప్రీమియం ప్రాజెక్ట్ కోసం వంశిరాం బిల్డర్స్ ప్రణాళిక

కొనుగోలు చేసిన ఈ భూమిపై ప్రీమియం మిక్స్‌డ్-యూజ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (అంటే కమర్షియల్, రెసిడెన్షియల్, రిటైల్ కలయిక) నిర్మించనున్నారు. ఇది హైదరాబాద్ వెస్ట్రన్ కారిడార్‌లో ఉన్న నాలెడ్జ్ సిటీ లేఅవుట్‌లో భాగం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌కు మంచి మార్కెట్ డిమాండ్ ఉండనుంది. ఈ వేలాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించింది.

Related Articles

Related image1
5 ఏళ్ల‌లో రూ. 14 ల‌క్ష‌ల‌కుపైగా సంపాదించాలా.? నెల‌కు ఎంత పొదుపు చేయాలంటే
Related image2
5 గ్ర‌హాల్లో కీలక మార్పులు... ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే. కొందరికి మాత్రం ఇబ్బందులు
35
భూమి ధరల్లో భారీ పెరుగుదల
Image Credit : Getty

భూమి ధరల్లో భారీ పెరుగుదల

ఈసారి జరిగిన వేలంలో ప్రతి చదరపు గజానికి రూ. 3,40,000 ధర లభించింది. ఇది 2017లో జరిగిన వేలం (రూ. 88,000/చద.గజం) కంటే నాలుగింతలు ఎక్కువ. అంటే ఎనిమిదేళ్లలో హైదరాబాద్‌లో ప్రధాన ప్రాంతాల భూముల ధరలు భారీగా పెరిగాయి. ఒక ఎకరా అంటే 4,840 చదరపు గజాలు, ఆ మేరకు మొత్తం ధర రూ. 160.42 కోట్లకు చేరింది.

45
రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా హైద‌రాబాద్
Image Credit : AI Photo/Google Gemini

రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా హైద‌రాబాద్

ఇటీవల హైద‌రాబాద్‌లో భూములు వేలాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌లో, బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ గ్రూప్ 11 ఎకరాల భూమిని రూ. 1,556.5 కోట్లకు కొనుగోలు చేసింది (ఎకరాకు రూ. 141.5 కోట్లు). MSN Labs సంస్థ కూడా రాయ్‌దుర్గ్‌లో 7.76 ఎకరాలను రూ. 177.7 కోట్లు ఎకరాకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలు హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత బ‌లంగా ఉన్నాయో చచెబుతున్నాయి.

55
భార‌త వ్యాపార్ హ‌బ్‌గా హైద‌రాబాద్
Image Credit : Google Gemini AI

భార‌త వ్యాపార్ హ‌బ్‌గా హైద‌రాబాద్

ఈ విష‌య‌మై TGIIC వైస్ చైర్మన్ కె. శశాంక మాట్లాడుతూ.. “హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థ ఎంత బ‌లంగా ఉందో చెప్పేందుకు ఈ వేలాలు నిదర్శనం. చిన్న స్థలాలపై ప్రీమియం ప్రాజెక్టులకే డిమాండ్ ఎక్కువగా ఉంది,” అన్నారు. ఇక JLL హైదరాబాదు హెడ్ సందీప్ పట్నాయక్ మాట్లాడుతూ.. “ప్రతి చదరపు గజానికి రూ. 3.4 లక్షలు రావడం మార్కెట్‌లో ఉన్న అత్యుత్తమ అవకాశాలను చూపిస్తోంది. ఇది హైదరాబాద్‌ను భారత వ్యాపార హబ్‌గా నిలబెడుతోంది,” అన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
Recommended image2
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
Recommended image3
మార‌నున్న హైద‌రాబాద్ ముఖ‌చిత్రం.. రూ. 4వేల కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు, క‌ళ్లు చెదిరే మార్పులు
Related Stories
Recommended image1
5 ఏళ్ల‌లో రూ. 14 ల‌క్ష‌ల‌కుపైగా సంపాదించాలా.? నెల‌కు ఎంత పొదుపు చేయాలంటే
Recommended image2
5 గ్ర‌హాల్లో కీలక మార్పులు... ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే. కొందరికి మాత్రం ఇబ్బందులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved