MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?

Petrol Diesel Price: వాహనదారులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు.. మరింత పెరుగుతాయా?

Petrol Diesel Price: క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు బిగ్ షాకిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 05 2026, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నయారా ఎనర్జీ షాక్: పెట్రోల్, డీజిల్ బాదుడు షురూ
Image Credit : chatgpt

నయారా ఎనర్జీ షాక్: పెట్రోల్, డీజిల్ బాదుడు షురూ

గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సామాన్యుల జేబులపై గట్టి ప్రభావమే చూపుతున్నాయి. ప్రముఖ ప్రైవేట్ రంగ చమురు సంస్థ నయారా ఎనర్జీ వాహనదారులకు గట్టి షాకే ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 7,000 కంటే ఎక్కువ పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలను భారీగా పెంచేసింది.

కంపెనీ నిర్ణయంతో నయారా బంకుల్లో లీటర్ పెట్రోల్‌‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెరిగాయి. దీంతో నయారా అవుట్‌లెట్లలో పెట్రోల్ ధర రూ.119.54కు చేరుకోగా, డీజిల్ రేటు రూ.102.64గా నమోదైంది. ఈ సడన్ హైక్‌తో ఒక్కసారిగా వాహనదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రభుత్వ కంపెనీల నిర్ణయం ఏంటి?
Image Credit : Gemini AI

ప్రభుత్వ కంపెనీల నిర్ణయం ఏంటి?

ప్రైవేట్ కంపెనీ బాదుడు షురూ చేయడంతో అందరి చూపు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL)లపై పడింది. సర్కారీ కంపెనీలు కూడా రేట్లు పెంచేస్తాయేమోనని అందరూ తీవ్ర ఆందోళన చెందారు.

అయితే, సామాన్యులకు పెద్ద ఊరటనిస్తూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఇండియన్ ఆయిల్ బంకుల్లో ప్రస్తుతం పెట్రోల్ లీటరు రూ.114.65, డీజిల్ రూ.99.74 వద్దే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రచ్చ జరుగుతున్నా, ప్రభుత్వ కంపెనీలు మాత్రం ధరలను స్థిరంగా ఉంచడం కాస్త రిలీఫ్ ఇచ్చే విషయమే.

35
అంతర్జాతీయంగా క్రూడ్ మంటలు.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్
Image Credit : Getty

అంతర్జాతీయంగా క్రూడ్ మంటలు.. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్

గ్లోబల్ లెవెల్‌లో ఇరాన్‌తో నడుస్తున్న ఉద్రిక్తతలు, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దీంతో గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బారెల్‌కు దాదాపు 90 డాలర్ల నుంచి ఏకంగా 100 డాలర్ల మార్కును దాటేసింది.

పరిస్థితి చేజారకుండా చూడటానికి సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజాకిస్తాన్, అల్జీరియా, ఒమాన్ వంటి ఏడు ప్రధాన OPEC+ దేశాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. అయినప్పటికీ, నవంబర్ నెలలో చమురు ఉత్పత్తిని పెంపుదల చేయకుండా ప్రస్తుత స్థాయిలోనే ఉంచాలని నిర్ణయించాయి. దీంతో చమురు కొరత భయాలు మరింత పెరిగాయి.

45
రంగంలోకి G7 దేశాలు: అదనపు చమురు విడుదల
Image Credit : chatgpt

రంగంలోకి G7 దేశాలు: అదనపు చమురు విడుదల

గ్లోబల్ మార్కెట్‌లో రేట్లు విపరీతంగా పెరిగిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచంలోని సంపన్న ప్రజాస్వామ్య దేశాల కూటమి G7 కీలక అడుగు వేసింది. రాబోయే కొద్ది వారాల్లో ఏకంగా 10 కోట్ల బారెళ్ల ఆయిల్, ఇంధన ఉత్పత్తులను మార్కెట్‌లోకి వదలనున్నట్లు ప్రకటించింది.

ఇందులో ప్రధానంగా రాబోయే 20 రోజుల్లో భారీగా డీజిల్ నిల్వలను విడుదల చేయనున్నారు. మిగిలిన నిల్వలను రాబోయే నాలుగు నెలల్లో విడతల వారీగా అందించనున్నారు. అమెరికాలోనూ డీజిల్ ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరడంతో అక్కడి రైతులు, ట్రక్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

55
తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే
Image Credit : Chatgpt

తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

దేశీయంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే చమురు కంపెనీలు తాజా ధరలను ప్రకటిస్తాయి. నేటి లెక్కల ప్రకారం ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి.. (నయారాలో పెరిగిన రెట్లు ఇక్కడ కలపలేదు)

• హైదరాబాద్: పెట్రోల్ రూ.115.69 (రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లో రూ.115.73), డీజిల్ రూ.103.82

• విజయవాడ: పెట్రోల్ రూ.117.25, డీజిల్ రూ.104.96

• విశాఖపట్నం: పెట్రోల్ రూ.116.39, డీజిల్ రూ.104.11

• ఢిల్లీ: పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20

• ముంబై: పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.83

• కోల్‌కతా: పెట్రోల్ రూ.113.51, డీజిల్ రూ.99.82

• చెన్నై: పెట్రోల్ రూ.107.76, డీజిల్ రూ.99.55

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Telangana: హైద‌రాబాద్‌కు స‌మీపంలో భారీ డెయిరీ ప్లాంట్‌... రూ. 400 కోట్ల‌తో
Recommended image2
Hyderabad: పంజాగుట్ట నుంచి ఆ మార్గంలో 6 లైన్ల భారీ ఫ్లై ఓవ‌ర్‌.. ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్
Recommended image3
హైద‌రాబాద్‌కు దూరంగా కొత్త రియ‌ల్ హ‌బ్‌.. ఐటీ ఉద్యోగుల చూపంతా అటు వైపే ఎందుకు.?
Related Stories
Recommended image1
Andhra's Goa: గోవా దాకా ఎందుకు? మన దగ్గరే 'ఆంధ్రా గోవా'.. ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved