MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే

IMD Rain Alert : ఏపీలో 7, తెలంగాణలో 7 జిల్లాలకు హైఅలర్ట్.. భారీ నుండి అతిభారీ వర్షాలతో అల్లకల్లోలమే

Weather Update : తెలంగాణ 7 జిల్లాలు, ఆంధ్ర ప్రదేశ్ లో 7 జిల్లాలు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఇరురాష్ట్రాల వాతావరణ శాఖలు హెచ్చరించాయి. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jun 09 2026, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రుతుపవనాల ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
Image Credit : Gemini

రుతుపవనాల ఎఫెక్ట్... తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు

IMD Rain Alert : ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు తాకాయి... దీంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు (జూన్ 9, మంగళవారం) కూడా ఇరు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశాయి. మరి ఏఏ ప్రాంతాలకు భారీ వర్షసూచనలు ఉన్నాయో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలకు హైఅలర్ట్..
Image Credit : Gemini AI

ఈ ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలకు హైఅలర్ట్..

ఆంధ్ర ప్రదేశ్ లోని రుతుపవనాలు నాలుగైదు రోజుల ముందే ప్రవేశించాయి... దీంతో ప్రస్తుతం వర్షాలు జోరందుకున్నాయి. నేడు ఆంధ్ర ప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

భారీ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడై ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. కాబట్టి వర్షం కురిసే సమయంలో చెట్లకింద, తాత్కాలిక నివాసాల్లో ఉండకూడదని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది. హెచ్చరికలు జారీచేసిన జిల్లాల్లోనే కాదు మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డిఎంఏ తెలిపింది.

Related Articles

Related image1
Rain Alert: వేగంగా విస్త‌రిస్తున్న రుతుప‌వ‌నాలు..ఈ ప్రాంతాల్లో వ‌చ్చే 2 రోజులు వ‌ర్షాలు
Related image2
Now Playing
Heat Waves & Rains Alert: రానున్న 24 గంటల్లో ఈజిల్లాలకు అలెర్ట్ | Asianet News Telugu
34
నేడు తెలంగాణలో భారీ వర్షాలు...
Image Credit : Gemini AI

నేడు తెలంగాణలో భారీ వర్షాలు...

నేడు (మంగళవారం) తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయట. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఈ రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగుతాయట... దీంతో ఎండల తీవ్రత పూర్తిగా తగ్గి 30-35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది.

1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :08-06-2026 pic.twitter.com/I8sYNBxngc

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) June 8, 2026

44
తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే..
Image Credit : Gemini AI

తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివే..

నిన్న (జూన్ 8, సోమవారం) తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయి… అత్యధికంగా సూర్యాపేట జిల్లా మట్టపల్లెలో 88.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరులో 78, కడ్తాల్ లో 45.3, మహేశ్వరంలో 38.8 మిల్లిమీటర్లు... నల్గొండ జిల్లా దామరచర్లలో 67, ఖమ్మం జిల్లా వైరాలో 63.4, రఘునాధపాలెంలో 46.9, మధిరలో 37.5, నిజామాబాద్ జిల్లా సిరికొండలో 41.1, ములుగు జిల్లా మల్లంపల్లిలో 39.3 మి.మీ వర్షపాతం నమోదయినట్లు తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటి (TGDPS) ప్రకటించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
Rain Alert: వేగంగా విస్త‌రిస్తున్న రుతుప‌వ‌నాలు..ఈ ప్రాంతాల్లో వ‌చ్చే 2 రోజులు వ‌ర్షాలు
Recommended image2
Now Playing
Heat Waves & Rains Alert: రానున్న 24 గంటల్లో ఈజిల్లాలకు అలెర్ట్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved