MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Hyderabad : ఏకంగా మాజీ సీఎం ఇంటినే సీజ్ చేసేశారా..! ఎందుకో తెలుసా..?

Hyderabad : ఏకంగా మాజీ సీఎం ఇంటినే సీజ్ చేసేశారా..! ఎందుకో తెలుసా..?

Hyderbad : మాజీ ముఖ్యమంత్రి… ఓ పార్టీ మాజీ అధ్యక్షురాలు… అందులోనూ ఓ మహిళా నాయకురాలు… అలాంటిది హైదరాబాాద్ లోని ఆమె ఇంటినే అధికారులు జప్తు చేశారు. ఆమె ఎవరు... ఎందుకు జప్తు చేశారో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 01 2026, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మాజీ సీఎం ఇళ్లు జప్తు..
Image Credit : Gemini AI

మాజీ సీఎం ఇళ్లు జప్తు..

Hyderabad : తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సామాన్యులకే రూల్స్ అన్ని.. బడాబాబులకు ఎలాంటి చట్టాలు వర్తించవనే భావన ప్రజల్లో ఉంది. దీన్ని తొలగించే ప్రయత్నమో లేక మరేదైనా రీజన్ ఉందో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని సైతం అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరా మాజీ సీఎం..?
Image Credit : Getty

ఎవరా మాజీ సీఎం..?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితకు దేశవ్యాప్తంగా భారీ ఆస్తులున్నాయి. ఇలా తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు హైదరాబాద్ లో కూడా విలాసవంతమైన ఇళ్లు ఉంది. శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర హిల్స్‌లో ఉన్న ఈ ఇల్లు జయలలిత పేరు మీదే రిజిస్టర్ అయివుంది. ఈ ఇంటిపైనే తాజాగా అధికారులు చర్యలు తీసుకున్నారు... ఏకంగా సీజ్ చేశారు.

35
జయలలిత ఇంటిని ఎందుకు సీజ్ చేశారు..?
Image Credit : Getty

జయలలిత ఇంటిని ఎందుకు సీజ్ చేశారు..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 2025–26 సంవత్సరానికి సంబంధించి ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. 'ఒకేసారి పన్ను చెల్లింపు' పథకం కింద ప్రాపర్టీ ట్యాక్స్ పాత బకాయిలపై ఉన్న వడ్డీలో 90% మాఫీ చేస్తోంది. ఈ స్కీమ్ ప్రకారం ఇంటి యజమానులు అసలు మొత్తంతో పాటు 10 శాతం వడ్డీని 2026, మార్చి 31 లోపు కట్టాలి.

అయితే జయలలిత ఇంటికి సంబంధించి ఏకంగా రూ.82 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉంది. 2017 లో ఆమె మరణం తర్వాత ఈ ఇంటిని పట్టించుకున్నవారే లేదు... అందుకే భారీ ట్యాక్స్ పెండింగ్ లో ఉన్నాయి. దీంతో మాజీ సీఎం, ఏఐఏడీఎంకే మాజీ అధినేత్రి జయలలిత ఇంటిని జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు.

45
నోటీసులు పంపినా నో రెస్పాన్స్.. అందుకే జప్తు
Image Credit : Getty

నోటీసులు పంపినా నో రెస్పాన్స్.. అందుకే జప్తు

జయలలిత ఇంటికి సంబంధించిన పన్ను వసూలు చేయడానికి జిహెచ్ఎంసి అధికారులు చాలాసార్లు ప్రయత్నించారు. కానీ సంబంధిత వ్యక్తులు ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నోటీసులు పంపారు. దానికి కూడా స్పందన రాకపోవడంతో చివరికి అధికారులు జయలలిత ఇంటిని సీజ్ చేశారు. బకాయిలు చెల్లించే వరకు ఈ ఆస్తి మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోనే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

55
ఏఐఏడీఎంకే నాయకత్వం ఏం చేస్తోంది..?
Image Credit : Getty

ఏఐఏడీఎంకే నాయకత్వం ఏం చేస్తోంది..?

తమిళనాడుకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత ఇంటిని ఇలా సీజ్ చేయడం తమిళ ప్రజలను షాక్‌కు గురిచేసింది. 'మోదీయా లేడీయా' అంటూ జాతీయ రాజకీయాల్లో చర్చ రేపిన 'తమిళనాడు ఉక్కు మహిళ' ఇంటిని కాపాడేందుకు ఏఐఏడీఎంకే నాయకత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి జయలలిత కుటుంబసభ్యలు గానీ, పార్టీ నాయకత్వం గానీ ఈ ఆస్తిపన్ను చెల్లించి ఇంటిని విడిపించుకుంటారేమో చూడాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
TamilNadu : బీజేపీతో అన్నాడీఎంకేకు ఎలాంటి పొత్తు వుండదు .. తేల్చేసిన పళనిస్వామి, పార్టీ సమావేశంలోనే ప్రకటన
Recommended image2
అసెంబ్లీలో జయలలిత చీరలాగిన ఘటన చూసి శోభన్‌ బాబు ఏం చేశాడో తెలుసా? సోగ్గాడికి దారుణమైన అవమానం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved