IMD Rain Alert : ఎల్ నినో వచ్చేస్తోంది .. తెలుగు ప్రజలారా.. ఇక కాస్కొండి..!
Weather Updates : శీతాకాలం ముగింపుకు చేరుకుంది… ఫిబ్రవరి నుండి ఎండలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ వేసవిలో వాాతావరణ పరిస్థితులు విచిత్రంగా ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెెల్లడించారు.

తెలంగాణపై ఎల్ నినో ఎఫెక్ట్..?
IMD Rain Alert : ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు విచిత్రంగా మారుతున్నాయి... కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కేవలం వర్షాకాలంలోనే కాదు శీతాకాలం, వేసవిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈసారి చలికాలం మొదలయ్యాకే బంగాళాఖాతంలో ఏర్పడిన తుపానుల కారణంగా భారీ వర్షాలు కురిశాయి. సేమ్ ఇదే పరిస్థితి ఈ వేసవిలోనూ ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వేసవిలోనూ వర్షాలే..
సాధారణంగా వచ్చే నెల ఫిబ్రవరిలో చలి తీవ్రత తగ్గిపోతుంది… మెల్లిగా ఎండలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సమయంలో అకాల వర్షాలు కూడా కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో ప్రభావంతో ఈ వేసవిలో ఎండావాన పరిస్థితులు ఉంటాయని తెలిపారు. సమ్మర్ మొదటి అర్థభాగం అంటే ఫిబ్రవరి ఎండిగ్, మార్చ్, ఏప్రిల్ వర్షాలు కురుస్తాయని... ఎండలు సాధారణంగానే ఉంటాయని వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈ సమ్మర్ లో ఎండలు మండిపోతాయా..?
ఇక సమ్మర్ సెకండ్ హాఫ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. మే, జూన్ లో ఎండలు మండిపోతాయి... ఈసారి కూడా 2023 స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఎండలు, వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని... రుతుపవనాలు కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు వెదర్ మ్యాన్ వెల్లడించారు.
SUMMER 2026 PRELIMINARY FORECAST
EL- NINO IS COMING 🔥
The first half of summer which includes Feb 2nd half, March, April will be RAINY and normal summer heat is expected 🌧️
The second half of summer will be DRIER with MASSIVE HEATWAVES expected during May, June 1st half 🔥…— Telangana Weatherman (@balaji25_t) January 16, 2026
ఎల్‌నినో అంటే ఏమిటి ?
మహా సముద్రాల్లో వాతావరణ మార్పులు భూభాగంపై ప్రభావాన్ని చూపుతాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల్లో ఏర్పడే అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు భారతదేశంతో పాటు చుట్టుపక్కల దేశాల్లో భారీ వర్షాలకు కారణం అవుతాయి. ఇలాగే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే మార్పులు యావత్ ప్రపంచంలో వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయి.
పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రత అసాధారణంగా పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు సంభవించడాన్నే 'ఎల్ నినో' అంటారు. వేడెక్కిన నీరు సముద్రం ఉపరితలంపైకి చేరి వాతావరణంలోని తేమ, గాలి ప్రవాహ దిశను మార్చేస్తుంది. భారతదేశంపై కూడా ఎల్ నినో ప్రభావం కనిపిస్తుంది... దీనివల్ల వర్షాలు తగ్గడం, ఎండలు పెరగడం జరుగుతుంది.
లానినో అంటే ఏమిటి?
లానినో అనేది ఎల్ నినో కు వ్యతిరేక వాతావరణ పరిస్థితి. పసిఫిక్ మహాసముద్రంలో నీరు సాధారణం కంటే చల్లగా మారడాన్నే లానినో అంటారు. దీనివల్ల చాలాదేశాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలుంటాయి... దీని ప్రభావం ప్రధానంగా ఆసియా, ఆస్ట్రేలియా దేశాలపై ఉంటుంది. భారతదేశంపై లానినా ఎఫెక్ట్ ఉంటుంది... దీనివల్ల నైరుతి రుతుపవనాలు బలపడి సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు అవుతుంది.

