MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • School Holidays : బుధవారం తెలంగాణలో కూడా స్కూళ్లకు సెలవులిస్తారా?

School Holidays : బుధవారం తెలంగాణలో కూడా స్కూళ్లకు సెలవులిస్తారా?

School Holiday : ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగానే తెలంగాణలో కూడాా మొంథా సైక్లోన్ దెబ్బకు విద్యాసంస్థలకు సెలవులు వస్తాయా? ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం స్కూళ్ళకి సెలవు ఇస్తుందా? 

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 28 2025, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణపైనా మొంథా ఎఫెక్ట్
Image Credit : Asianet News

తెలంగాణపైనా మొంథా ఎఫెక్ట్

School Holidays : మొంథా తుపాను తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిశాయి... నిన్న(సోమవారం) తుపాను ఏర్పడి అదికాస్త ఇవాళ(మంగళవారం) తీవ్ర తుపానుగా మారింది. రాత్రికి (అక్టోబర్ 28) ఈ మొంథా తుపాను కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరందాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.

మొంథా తుపాను ప్రభావం ఏపీలో గట్టిగా ఉంటుందని... తెలంగాణలోని కొన్ని జిల్లాలపై కూడా దీని ఎఫెక్ట్ ఉంటుందని ఐఎండి హెచ్చరిస్తోంది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం నుండి తెలంగాణలో భారీ వర్షాలు మొదలవుతాయని... రేపు (బుధవారం) మొత్తం కొనసాగుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వంటి వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మొంథా తుపాను ప్రభావిత తెలంగాణ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరి సెలవులుంటాయా?
Image Credit : iSTOCK

ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. మరి సెలవులుంటాయా?

అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే ఇవాళ, రేపు మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏకంగా 90 నుండి 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో 40 నుండి 70 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా తెలంగాణపై కూడా మొంథా తుపాను ఎపెక్ట్ ఉంటుందని స్పష్టమవుతోంది.

ఇలా మొంథా తుపాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న జిల్లాలు అంటే భారీ నుండి అతిభారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రమాదం పొంచివున్న జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటికి సెలవులు ప్రకటించింది. తమిళనాడులో కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా తుపాను ప్రభావిత జిల్లాల్లో రేపు (అక్టోబర్ 29న) సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

35
ఆంధ్ర ప్రదేశ్ లో స్కూళ్లకి వరుస సెలవులు
Image Credit : gemini AI

ఆంధ్ర ప్రదేశ్ లో స్కూళ్లకి వరుస సెలవులు

ఆంధ్ర ప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 26న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతోనే భారీ వర్షాలు మొదలయ్యాయి... సోమవారం తుపాను, మంగళవారం తీవ్ర తుపాను ఏర్పడటంతో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుండటంతో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలు మొదలై బుధవారం కూడా కొనసాగుతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్ధ ప్రకటించింది. దీంతో అక్టోబర్ 27,28,29 మూడ్రోజులు తుపాను ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇచ్చింది ప్రభుత్వం.

విశాఖపట్నంతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య, బాపట్ల, కడప, గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ, చిత్తూరు, కోనసీమ, కృష్ణా, ఏలూరు జిల్లాలో విద్యాసంస్థలు గత రెండ్రోజులుగా మూతపడ్డాయి. చాలాజిల్లాల్లో రేపు (బుధవారం) కూడా సెలవు ఇచ్చారు. మొంథా తుపాను తీరందాటే కాకినాడ జిల్లాలో కొన్నిచోట్ల అక్టోబర్ 31 వరకు సెలవులుండే అవకాశాలున్నాయి.

45
ప్రస్తుతం మొంథా తుపాను ఎక్కడుంది?
Image Credit : X/APSDMA

ప్రస్తుతం మొంథా తుపాను ఎక్కడుంది?

ప్రస్తుతం మొంథా తుపాను కాస్త తీవ్రతుపానుగా బలపడిందని... ఇది పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ప్రస్తుతం గంటకు 12 కి.మీ వేగంతో కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరంవైపు దూసుకువస్తోందని హెచ్చరించింది. ఈ తుపాను మచిలీపట్నంకి 160 కిమీ, కాకినాడకి 240 కిమీ, విశాఖపట్నంకి 320 కిమీ దూరంలో ఉందని APSDMA వెల్లడించింది. ఇవాళ రాత్రి తీరందాటే అవకాశాలున్నాయని... ఈ సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలుంటాయట. కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

55
అత్యవసర సహాయంకోసం, తుపాను సమాచారం కోసం ఏపీ ప్రజలు కాల్ చేయాల్సిన నంబర్లివే
Image Credit : Pixabay

అత్యవసర సహాయంకోసం, తుపాను సమాచారం కోసం ఏపీ ప్రజలు కాల్ చేయాల్సిన నంబర్లివే

  • ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కంట్రోల్ రూం నెంబర్లు 112 లేదా 1070 లేదా 18004250101
  • శ్రీకాకుళం - 08942-240557
  • విజయనగరం - 08922-236947
  • విశాఖపట్నం - 0891-2590102 లేదా డయల్ 100
  • అనకాపల్లి - 08924-222888
  • కాకినాడ - 0884-2356801
  • కోనసీమ - 08856-293104
  • పశ్చిమ గోదావరి - 08816299181
  • కృష్ణా జిల్లా -08672252572
  • బాపట్ల : 08643-220226
  • ప్రకాశం - 98497 64896
  • నెల్లూరు - 08612331261 లేదా 7995576699
  • తిరుపతి - 0877-2236007

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
విద్య
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
హైదరాబాద్
విశాఖపట్నం
తిరుపతి
విజయవాడ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
IMD Rain Alert : తెలంగాణపై మొంథా తుపాను ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ముంతపోత వర్షాలు, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Recommended image2
మొంథా తుపానుకు ఆ పేరు ఎందుకు పెట్టారు? దీని అర్థం ఏంటి? అస‌లు తుపాన్ల‌కు పేర్లు ఎలా పెడ‌తారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved