MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • August Holidays : లాంగ్ వీకెండ్ తో ఆగస్ట్ స్టార్ట్.. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే

August Holidays : లాంగ్ వీకెండ్ తో ఆగస్ట్ స్టార్ట్.. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే

తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు మాత్రమే ఆగస్ట్ లో కొన్ని ప్రత్యేక సెలవులు రాబోతున్నాయి. ఇంతకూ ఈ సెలవులు ఏంటి? ఏ రోజుల్లో వస్తున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 15 2026, 02:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆగస్ట్ లో సెలవులే సెలవులు
Image Credit : Gemini AI

ఆగస్ట్ లో సెలవులే సెలవులు

August Holidays : వేసవి సెలవులు ముగిశాక అత్యధిక సెలవులు వచ్చే నెల ఆగస్ట్. పండగలు, పర్వదినాలు, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగానే కాదు గత కొన్నేళ్లుగా భారీ వర్షాల కారణంగా కూడా ఆగస్ట్ లో సెలవులు వస్తున్నాయి. అయితే ఈసారి ఆగస్ట్ ఆరంభమే సెలవులతో అవుతోంది... ఒకటి రెండు కాదు వరుసగా మూడ్రోజుల సెలవులు వస్తున్నాయి. ఇలా ఆగస్ట్ లో వచ్చే ఫస్ట్ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆగస్ట్ 1,2,3 తేదీల్లో సెలవు... ఎందుకో తెలుసా?
Image Credit : Gemini AI

ఆగస్ట్ 1,2,3 తేదీల్లో సెలవు... ఎందుకో తెలుసా?

జూలైలో సెలవులేమీ లేకున్నా బంద్ ల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు కలిసివచ్చాయి. అయితే ఆగస్ట్ అలాకాదు... అధికారికంగానే అత్యధిక సెలవులుండే నెల. అయితే ఈసారి మరింత ప్రత్యేకంగా సెలవులతో ఆగస్ట్ ప్రారంభం అవుతోంది... 1,2,3 మూడ్రోజులు తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయి. మరీముఖ్యంగా హైదరబాదీలకు ఈ సెలవులు పక్కా... మరి ఏరోజు, ఎందుకు సెలవో తెలుసుకుందాం.

ఆగస్ట్ నెల ఈసారి శనివారంతో ప్రారంభం అవుతోంది... అంటే వీకెండ్ అన్నమాట. హైదరాబాద్ వంటి ఐటీ నగరాల్లో కార్పోరేట్, సాప్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజులు సెలవు ఉంటుంది... కాబట్టి ఆగస్ట్ 1,2 (శని, ఆదివారం) సెలవే అన్నమాట. ఐటీ, కార్పోరేట్ ఉద్యోగుల పిల్లలు ఎక్కువగా చదివే కొన్ని స్కూల్స్ కి కూడా రెండ్రోజులు సెలవులే. కాబట్టి కొందరు విద్యార్థులకు కూడా రెండ్రోజులు సెలవులే. అయితే వీటికి మరో సెలవు ప్రత్యేకంగా కలిసివచ్చి వరుసగా మూడ్రోజులు (ఆగస్ట్ 1,2,3) సెలవులు వస్తున్నాయి.

35
ఆగస్ట్ 3న ఎందుకు సెలవు?
Image Credit : Gemini

ఆగస్ట్ 3న ఎందుకు సెలవు?

తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో ఆషాడమాసం బోనాలు ప్రారంభం అవుతున్నాయి. జూలై 16 నుండి ఆగస్ట్ 13 వరకు అంటే దాదాపు నెలరోజులు ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ బోనాల వేడుకల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు చాలా ప్రత్యేకమైనవి... నగర నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొంటారు. లక్షలాదిమందితో లష్కర్ బోనాల వేడుకలు అట్టహాసంగా జరుతాయి. అందుకే సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలు, ఉద్యోగులకు ఆగస్ట్ 3న (సోమవారం) సెలవు ఉంటుంది. అయితే ఈ సెలవుపై విద్యాసంస్థల యాజమాన్యాల నిర్ణయమే ఫైనల్.

45
ఆగస్ట్ 10న బోనాల సెలవు
Image Credit : Getty

ఆగస్ట్ 10న బోనాల సెలవు

హైదరాబాద్ లో జరిగే ఆషాడమాసం బోనాల్లో పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాసిని ఆలయంలో జరిగే వేడుకలు కూడా ప్రత్యేకమైనవి. ఆగస్ట్ 9న కేవలం పాతబస్తీ ఆలయంలోనే కాదు హైదరాబాద్ నగరవ్యాప్తంగా బోనాల వేడుకలు జరుగుతున్నాయి... నగరంలోని అన్ని అమ్మవార్ల ఆలయాల్లో బోనాలు సమర్పిస్తారు. ప్రజలంతా యాటలు, కోళ్ళు కోసి కుటుంబసభ్యులతో విందు, మందుతో వేడుకలు జరుపుకుంటారు. ఇలా హైదరాబాద్ బోనాల నేపథ్యంలో తర్వాతిరోజు అంటే ఆగస్ట్ 10 (సోమవారం) తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థలు, ఆఫీసులకు అధికారిక సెలవు ఇచ్చింది ప్రభుత్వం.

55
హైదరాబాద్ ఆషాడమాసం బోనాలు... ఏరోజు, ఎక్కడ వేడుకలు
Image Credit : getty

హైదరాబాద్ ఆషాడమాసం బోనాలు... ఏరోజు, ఎక్కడ వేడుకలు

జూలై 16 నుండి ఆగస్ట్ 13 వరకు హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు జరుగుతాయి.

జూలై 16 గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలు

జూలై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు)

జూలై 26న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బోనాలు

ఆగస్ట్ 2 సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

ఆగస్ట్ 3 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం (భవిష్యవాణి)

ఆగస్ట్ 9 పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు

ఆగస్ట్ 10 లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో రంగం, ఘటాల ఉరూగింపు

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బోనాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. మొత్తం 3,427 ఆలయాల కోసం రూ.15.05 కోట్ల నిధులు విడుదల చేసింది. అలాగే ఇతర ఏర్పాట్ల కోసం కూడా నిధులు కేటాయించారు. ఇక ప్రభుత్వం తరపున 30 ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించాలని నిర్ణయించారు. బోనాల సందర్భంగా నగరవ్యాప్తంగా పోలీసులు, జిహెచ్ఎంసి, విద్యుత్, రెవెన్యూ ఇతర సిబ్బంది పనిచేయనున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు కుండపోత వర్షాలు
Recommended image2
జైలు నుంచి బ‌య‌ట‌కొచ్చిన యూట్యూబ‌ర్ వైష్ణ‌వి భ‌ర్త‌.. అంత‌లోనే దారుణ సంఘ‌ట‌న
Recommended image3
Hyderabad Groundwater : హైదరాబాద్‌లో భూగర్భజలాలు అతి తక్కువగా ఉన్న టాప్ 5 ప్రాంతాలివే..
Related Stories
Recommended image1
July Holidays : ఈ వీక్ ఇంకో రెండ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్, నాల్రోజులు సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?
Recommended image2
Bank Holidays : జూలైలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ సెలవులు.. ఏరోజు, ఎందుకో తెలుసా? ఫుల్ లిస్ట్ ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved