ఇండియాలో టాప్ 10 విద్యాసంస్థలివే.. ర్యాంకింగ్ లో ఫస్ట్ 3 మన దక్షిణాదివే
NIRF rankings 2025 : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఇందులో దక్షణాదికి చెందిన కాలేజీలు దుమ్మురేపాయి… ఓవరాల్ గా టాప్ 3 ఇక్కడివే. వివిధ కేటగిరీల్లో టాప్ 10 లో నిలిచిన కాలేజీల గురించి తెలుసుకుందాం.

దేశంలో టాప్ విద్యాసంస్థలివే
Top Educational Institutes in India : ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలకు మంచి పేరున్న విద్యాసంస్థలోనే చదివించాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ఎంతయినా ఖర్చు చేసి మంచి కాలేజీని ఎంపికచేసుకోవాలని అనుకుంటారు... అందుకే చాలామంది తమ పిల్లలను విదేశాల్లో చదివించడానికి కూడా వెనకాడటం లేదు. అయితే మన దేశంలో కూడా వరల్డ్ క్లాస్ విద్యాబోధన, సౌకర్యాలు కలిగిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో అత్యుత్తమ విద్యాసంస్థలను తాజాగా కేంద్రం ప్రకటించింది.
కేంద్ర విద్యాశాఖ ప్రతిఏటా ప్రముఖ విద్యాసంస్థలను వివిధ అంశాల ఆధారంగా పరిశీలించి ర్యాంకింగ్స్ ఇస్తుంది... తాజాగా 2025కు గాను నేషనల్ ఇన్ట్సిట్యూట్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్ (NIRF) కింద ర్యాంకింగ్స్ ప్రకటించారు. దేశ రాజధాని న్యూడిల్లిలో భారత్ మండప్ లో ఈ ర్యాంకుల విడుదల కార్యక్రమం జరిగింది... కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 10వ ఎడిషన్ ర్యాంకింగ్స్ ప్రకటించారు.
వివిధ కేటగిరీల్లో విద్యాసంస్థలకు ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ఓవరాల్ (మొత్తం), యూనివర్సిటీలు, కాలేజీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, డెంటల్, లా, ఆర్టిటెక్చర్ ఆండ్ ప్లానింగ్,అగ్రికల్చర్ ఆండ్ అనుబంధ రంగాలు, ఓపెన్ యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ వారిగా ర్యాంకులు కేటాయించారు. ఇలా దేశవ్యాప్తంగా అత్యుత్తమ యూనివర్సిలు, కాలేజీలు, ప్రత్యేక విద్యాలయాల జాబితా విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్ ఉన్నత విద్యాసంస్థల పనితీరును తెలియజేస్తాయి.
ఇండియాలో టాప్ 10 కాలేజీలు
1. హిందూ కాలేజ్
2. మిరంద హౌస్
3. హన్స్ రాజ్ కాలేజ్
4. కిరోరి మల్ కాలేజ్
5. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్
6. రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటెనరీ కాలేజ్
7. ఆత్మారామ్ సనాతన్ ధర్మ్ కాలేజ్
8. సెయింట్ గ్జావియర్ కాలేజ్
9. పిఎస్జిఆర్ కృష్ణమ్మల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్
10. పిఎస్జి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ఆండ్ సైన్స్
టాప్ 10 మేనేజ్మెంట్ కాలేజీలు
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్
4. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిల్లీ
5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లక్నో
6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై
7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకత్తా
8. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇండోర్
9. మేనేజ్మెంట్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ గురుగ్రామ్
10. గ్జావియెర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెట్ జంషెడ్ పూర్
టాప్ 10 ఇంజనీరింగ్ యూనివర్సిటీలు
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు
2. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూడిల్లీ
3. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
4. జామియా ఇస్లామియా, న్యూడిల్లీ
5. యూనివర్సిటీ ఆఫ్ డిల్లీ, న్యూడిల్లీ
6. బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
7. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ సైన్స్ పిలని
8. అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు
9. జాదవ్ పూర్ యూనివర్సిటీ, కలకత్తా
10. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్
ఓవరాల్ గా అన్ని కేటగిరిల్లో టాప్ కాలేజీలు
1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్
2. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై
4. ఇండియన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, డిల్లీ
5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్
6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్ పూర్
7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ
8. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డిల్లీ
9. జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూడిల్లీ
10. బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి