MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • Bank Holidays : జూన్ సెకండాఫ్ లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఏ రాష్ట్రంలో, ఏరోజు, ఎందుకు సెలవో తెలుసా?

Bank Holidays : జూన్ సెకండాఫ్ లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఏ రాష్ట్రంలో, ఏరోజు, ఎందుకు సెలవో తెలుసా?

ఈ నెలలో మీరు బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే జూన్ సెకండాఫ్ లో బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో తెలుసుకోండి. ఆర్బీఐ విడుదల చేసిన హాలిడే క్యాలెండర్, డిజిటల్ బ్యాంకింగ్ సేవల పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 15 2026, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జూన్ 2026 బ్యాంక్ హాలిడేస్
Image Credit : Getty

జూన్ 2026 బ్యాంక్ హాలిడేస్

Bank Holidays : ఇప్పటికే జూన్ నెలలో సగం రోజులు ముగిశాయి... మిగతా సగంలో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో సెలవులు ఒక్కోలా ఉంటాయి... స్థానిక పండుగలు, ప్రత్యేక రోజులను బట్టి బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి బ్యాంకులో పనులు ఉన్నవాళ్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే లిస్ట్‌ను ఒకసారి చూసుకోవడం చాలా ముఖ్యం. తెలంగాణ, ఏపీతో పాటు మిగతా రాష్ట్రాల్లో బ్యాంక్ హాలిడేస్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జూన్ 15 నుండి 21 వరకు బ్యాంక్ హాలిడేస్..
Image Credit : Getty

జూన్ 15 నుండి 21 వరకు బ్యాంక్ హాలిడేస్..

ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం... జూన్ 15 నుంచి 21 వరకు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. అయితే జూన్ 15న మిజోరంలో 'యంగ్ మిజో అసోసియేషన్ (YMA)' దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు... రాజధాని ఐజ్వాల్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక ఇదే రోజు ఒడిశాలో 'రాజా సంక్రాంతి' పండుగ నేపథ్యంలో బ్యాంకులకు సెలవు ఉంది. ఈ రెండు రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల బ్యాంకులు తెరిచే ఉంటాయి. ఇక జూన్ 21 ఆదివారం కాబట్టి తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.

Related Articles

Related image1
Bank Rules : చనిపోయిన వారి ఏటీఎం కార్డు వాడొచ్చా? బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Related image2
Bank Rules: ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే అకౌంట్‌లో డ‌బ్బులు ఏమ‌వుతాయి.? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయిa
34
జూన్ 22 నుండి 30 వరకు బ్యాంక్ హాలిడేస్..
Image Credit : ChatGPT

జూన్ 22 నుండి 30 వరకు బ్యాంక్ హాలిడేస్..

జూన్ 25న మొహర్రం పండగ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని బ్యాంకులకు సెలవు ఉంది. మరో తెలగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం జూన్ 26న మొహర్రం సెలవుంది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో జూన్ 26నే మొహర్రం సెలవుంది.

జూన్ 27న నాలుగో శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవుంది. జూన్ 28న ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవుంది. ఈ రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.

జూన్ 29న సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక జూన్ 30న మిజోరాంలో ''రెమన రీ (డే ఆఫ్ ఫీస్) సందర్భంగా సెలవుంది. ఇలా జూన్ సెకండాఫ్ లో బ్యాంకులకు భారీగానే సెలవులు రాబోతున్నాయి.

44
బ్యాంకు పనులుంటే ముందే ప్లాన్ చేసుకొండి..
Image Credit : getty

బ్యాంకు పనులుంటే ముందే ప్లాన్ చేసుకొండి..

చెక్ డిపాజిట్ చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీసుకోవడం వంటి పనుల కోసం తప్పనిసరిగా బ్రాంచ్‌కు వెళ్లాల్సి ఉంటే, సెలవులను దృష్టిలో పెట్టుకుని మీ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆర్బీఐ హాలిడే లిస్ట్‌ను చూసుకోవడానికి కొన్ని నిమిషాలు కేటాయిస్తే, అనవసరమైన ఇబ్బందులు ఉండవు, సమయం వృథా కాకుండా చూసుకోవచ్చు.

బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ యూపీఐ (UPI), ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తాయి. డబ్బు బదిలీ, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, బిల్లుల చెల్లింపు వంటి చాలా పనులను మీరు ఇంటి నుంచే చేసుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాదీల‌కు అల‌ర్ట్‌.. ఆదివారం ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, పూర్తి వివరాలు
Recommended image2
రైల్లో ఎవ‌రైనా నీళ్లు ఇస్తే తాగుతున్నారా.? వెలుగులోకి కొత్త ర‌కం మోసం
Recommended image3
తెలంగాణ విద్యార్థులకు జ‌పాన్ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశం.. ఈ ఛాన్స్ ఎవ‌రికంటే.?
Related Stories
Recommended image1
Bank Rules : చనిపోయిన వారి ఏటీఎం కార్డు వాడొచ్చా? బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Recommended image2
Bank Rules: ఖాతాదారుడు మ‌ర‌ణిస్తే అకౌంట్‌లో డ‌బ్బులు ఏమ‌వుతాయి.? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయిa
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved