MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Bandi Bhageerath: చర్లపల్లి జైలుకు బండి భగీరథ్‌.. పోక్సో కేసులో మరో కీలక పరిణామం

Bandi Bhageerath: చర్లపల్లి జైలుకు బండి భగీరథ్‌.. పోక్సో కేసులో మరో కీలక పరిణామం

Bandi Bhageerath : పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైడ్రామా నడుమ అతడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2026, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బండి సంజయ్ కొడుకుకు జైలు శిక్ష? చర్లపల్లికి భగీరథ్.. అసలేం జరిగింది?
Image Credit : X/jsuryareddy

బండి సంజయ్ కొడుకుకు జైలు శిక్ష? చర్లపల్లికి భగీరథ్.. అసలేం జరిగింది?

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ఒక కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా ఉన్న భగీరథ్‌ను శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా జడ్జి నివాసంలో హాజరపర్చగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ అరెస్ట్ వెనుక శనివారం తెల్లవారుజాము నుంచే హైడ్రామా నడిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆపరేషన్ భగీరథ్.. చాలా ప్రాంతాల్లో పోలీసుల వేట
Image Credit : X/Telangana Police

ఆపరేషన్ భగీరథ్.. చాలా ప్రాంతాల్లో పోలీసుల వేట

పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయాడు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా అక్కడ ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. దీంతో పోలీసులు ఆపరేషన్ భగీరథ్ పేరుతో సీరియస్‌గా రంగంలోకి దిగారు. 

అతడు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి, అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్, పుణే, బెంగళూరు నగరాల్లో ఏకంగా 14 స్పెషల్ టీమ్స్ గాలింపు చేపట్టాయి. బంజారాహిల్స్‌లోని బండి సంజయ్ నివాసంతో పాటు ఆయన బంధువులు, భగీరథ్ ఫ్రెండ్స్ ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడం సంచలనం సృష్టించింది.

34
ట్విస్టుల నడుమ లొంగుబాటా? అరెస్టా?
Image Credit : X/jsuryareddy

ట్విస్టుల నడుమ లొంగుబాటా? అరెస్టా?

శనివారం రాత్రి ఈ కేసంతా ఒక పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించింది. రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, తన కుమారుడిని లాయర్ల ద్వారా పోలీసులకు తానే అప్పగించానని చెప్పారు.

అయితే సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి మాత్రం నార్సింగి పోలీస్ అకాడమీ (టిఎస్ పిఎ) జంక్షన్ దగ్గర భగీరథ్‌ను తామే అరెస్ట్ చేశామని ప్రకటించారు. వైట్ హుడీ, మాస్క్ ధరించిన భగీరథ్.. ఇద్దరు లాయర్లతో కలిసి నాలుగు కార్ల కాన్వాయ్‌లో రాత్రి 9:05 గంటలకు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా స్టేషన్ ముందు పోలీసులు భారీగా బారికేడ్లు వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు.

44
యూట్యూబర్లపై యాక్షన్
Image Credit : Getty

యూట్యూబర్లపై యాక్షన్

ఈ కేసులో మైనర్ బాలిక ఐడెంటిటీని బయటపెడుతూ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 14 మంది యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామర్లపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 27 మందిపై విచారణ జరుగుతోంది. 

భగీరథ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తమ క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదని, పూర్తి విచారణకు సహకరిస్తామని చెప్పారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image2
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved