MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • Bank Holidays : అరెరే..! ఈ వారం ఇన్ని రోజులు బ్యాంకులకు సెలవులున్నాయా?

Bank Holidays : అరెరే..! ఈ వారం ఇన్ని రోజులు బ్యాంకులకు సెలవులున్నాయా?

ఈ వారం బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు 3 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 20 2026, 09:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఈ వారం బ్యాంకులకు సెలవులే సెలవులు..
Image Credit : Getty

ఈ వారం బ్యాంకులకు సెలవులే సెలవులు..

ఈ వారం (జూలై 21 నుండి 25 వరకు) బ్యాంకులకు వెళ్లి పనులు పూర్తి చేసుకోవాలనుకునే వారు ఈ విషయం గమనించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక హాలిడే షెడ్యూల్ ప్రకారం… ఈ వీక్ లో కొన్ని ప్రాంతాల్లోని బ్యాంకులకు సెలవులున్నాయి. ముఖ్యంగా డిమాండ్ డ్రాఫ్ట్ (DD) తీసుకోవడం, కేవైసీ అప్‌డేట్, చెక్ క్లియరెన్స్, డబ్బు డిపాజిట్ వంటి పనుల కోసం బ్రాంచ్‌కు వెళ్లాలనుకుంటే, సెలవులను దృష్టిలో పెట్టుకుని మీ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జూలై 22, 25, 26 సెలవే..
Image Credit : ChatGPT

జూలై 22, 25, 26 సెలవే..

ఈ వారంలో మొదటి సెలవు జూలై 22న అంటే వచ్చే బుధవారం వస్తోంది. అయితే ఈ సెలవు కేవలం త్రిపురలో మాత్రమే… ఈ రాష్ట్రంలో ఖార్చీ పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది. మిగతా రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులు యధావిధిగా నడుస్తాయి.

ఖార్చీ పూజ అనేది త్రిపురలోని చాలా పురాతనమైన, ముఖ్యమైన మతపరమైన, సాంస్కృతిక పండుగల్లో ఒకటి. ఈ పండుగ సమయంలో 14 దేవతలకు, భూమాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ స్థానిక పండుగ కారణంగా రిజర్వ్ బ్యాంక్ కేవలం అగర్తలా బ్యాంకింగ్ సర్కిల్‌కు మాత్రమే సెలవు ప్రకటించింది. కాబట్టి ఈ సెలవు దేశవ్యాప్తంగా వర్తించదని కస్టమర్లు గమనించాలి. 

ఇక జూలై 25న మరో సెలవు వస్తోంది. ప్రతి నెలలో రెండు, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది… ఈ జూలైలో నాలుగో శనివారం 25న వస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సెలవు ఉంటుంది. 

జూలై 26న ఆదివారం… కాబట్టి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, ఆఫీసులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా బ్యాంకు ఉద్యోగులకు సెలవే…. దేశంలోని అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి. ఇలా ఈ వారంలో రెండ్రోజులు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులుండగా… ఓ రోజు త్రిపురలో మాత్రమే సెలవు ఉంది. 

 

Related Articles

Related image1
Government Bank Jobs : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.85,920 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్
Related image2
Bank Rules : దశాబ్దాలుగా వాడకున్నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అలాగే ఉంటాయా? వాటిని తిరిగి పొందవచ్చా?
34
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
Image Credit : getty

డిజిటల్ బ్యాంకింగ్ సేవలు

బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదు. యూపీఐ (UPI) లావాదేవీలు, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్ (IMPS), నెఫ్ట్ (NEFT), ఆర్టీజీఎస్ (RTGS) వంటి ఆన్‌లైన్ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. కాబట్టి, కస్టమర్లు డబ్బు బదిలీ లేదా ఆన్‌లైన్ చెల్లింపులు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.

44
ఆర్‌బీఐ సెలవుల జాబితా
Image Credit : FREEPIK

ఆర్‌బీఐ సెలవుల జాబితా

ఇక జూలై 27 నుంచి ఆగస్టు 2 మధ్యకాలంలో అంటే వచ్చేవారం బ్యాాంకులకు అసలు ఒక్కసెలవు కూడా లేదు. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం…  ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేక బ్యాంకు సెలవులు లేవు. ఆగస్టు 2 ఆదివారం కాబట్టి ఆ రోజు మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి. మిగతా రోజుల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి. కాబట్టి కస్టమర్లు తమ బ్యాంకు పనులను దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Recommended image2
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం
Recommended image3
ఇంగ్లిష్‌ను నాన్ నేటివ్ భాషగా ఎలా పరిగణిస్తారు? CBSE భాషా విధానంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు
Related Stories
Recommended image1
Government Bank Jobs : డిగ్రీ చదివితే చాలు.. నెలకు రూ.85,920 జీతంతో ప్రభుత్వ బ్యాంకులో ఆఫీసర్ జాబ్స్
Recommended image2
Bank Rules : దశాబ్దాలుగా వాడకున్నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అలాగే ఉంటాయా? వాటిని తిరిగి పొందవచ్చా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved