MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: ఏపీ, తెలంగాణలో 6 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ వార్నింగ్

Weather Update: ఏపీ, తెలంగాణలో 6 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ వార్నింగ్

Weather Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వచ్చే ఆరు రోజులు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్‌కు రుతుపవనాలు చేరాయ. జూన్ 17 నాటికి రెండు రాష్ట్రాల్లో ఇవి పూర్తిగా విస్తరించనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 14 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్‌కు చేరని నైరుతి రుతుపవనాలు
Image Credit : our own

హైదరాబాద్‌కు చేరని నైరుతి రుతుపవనాలు

ఎండలతో నలిగిపోతున్న జనాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూపర్ న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాలు ఎట్టకేలకు భాగ్యనగరాన్ని తాకాయి. జూన్ 17 నాటికి ఇవి రెండు రాష్ట్రాల్లో 100% విస్తరించనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 95% మేర ఇవి కవర్ అయ్యాయి. మిగిలిపోయిన శ్రీకాకుళం, విజయనగరంలోకి కూడా ఆదివారం వరకు పూర్తిగా ఎంట్రీ ఇవ్వనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల పాటు వానలే వానలు
Image Credit : Perplexity AI

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల పాటు వానలే వానలు

తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో జూన్ 14 నుంచి 19 వరకు.. అంటే 6 రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయి. జూన్ 14 నుంచి 17 వరకు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉంది. గాలి వేగం గంటకు 40 నుంచి 60 కిలోమీటర్లు ఉండొచ్చు. ప్రస్తుతం తెలంగాణపై ఉపరితల తుపాను తరహా ఆవర్తనం ఉంది. దీనివల్ల ఉత్తర, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

35
ఆంధ్రప్రదేశ్ వాతావరణ అప్‌డేట్
Image Credit : X/APSDMA

ఆంధ్రప్రదేశ్ వాతావరణ అప్‌డేట్

ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది. సాయంత్రానికి విశాఖ, రాయలసీమలో జల్లులు పడొచ్చు. ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రత 38 డిగ్రీలు, తెలంగాణలో 39 డిగ్రీలుగా నమోదు కానుంది. రాయలసీమలో చల్లని గాలులు వీస్తున్నాయి.

45
సముద్రంలో గాలుల బీభత్సం
Image Credit : Gemini AI

సముద్రంలో గాలుల బీభత్సం

అరేబియా సముద్రంలో రుతుపవనాలు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వీస్తూ తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి. బంగాళాఖాతంలో కూడా గాలుల వేగం 55 కిలోమీటర్లుగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లడం సేఫ్ కాదని అధికారులు తెలిపారు. జూన్ 20 తర్వాత మాల్దీవుల నుంచి వచ్చే మేఘాల వల్ల ఈ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయని అంచనా.

55
పసిఫిక్, అంటార్కిటికాలలో మార్పులతో వెదర్ పై ప్రభావం
Image Credit : Asianet News

పసిఫిక్, అంటార్కిటికాలలో మార్పులతో వెదర్ పై ప్రభావం

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు బలహీనపడ్డాయి. ఇవి తుపానులుగా మారకపోవడం వల్ల మనకు వేడి గాలుల ముప్పు తప్పింది. మరోవైపు అంటార్కిటికా నుంచి చల్లని మంచు హిందూ మహాసముద్రంలో కలవడం వల్ల రుతుపవనాలు మరింత స్ట్రాంగ్ అవుతున్నాయి. దీనివల్ల జూన్ అంతా, జులై మొదటి 10 రోజులు వర్షాలు బాగుంటాయి. కాబట్టి రైతులు వ్యవసాయ అధికారుల సలహాలతో పంట ప్లాన్ చేసుకోవడం మంచిది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Khairatabad Byelection : రెండేళ్ల కిందే ఖైరతాబాద్ సీటు ఖాళీ..: తెలంగాణ ప్రభుత్వ గెజిట్
Recommended image2
Bathukamma Celebrations : గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు.. ప్లాన్ ఇదే..: కల్వకుంట్ల కవిత
Recommended image3
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల నమోదు ఎలా చేసుకోవాలి? అర్హతలు ఏంటి?
Related Stories
Recommended image1
IND vs AFG : ఆఫ్ఘనిస్తాన్‌పై గిల్ ఊచకోత.. కేఎల్ రాహుల్ మాస్ రాంపేజ్
Recommended image2
Train Lower Berth: ట్రైన్‌లో లోయర్ బెర్త్ పొందేందుకు ఐఆర్‌సీటీసీ సూపర్ అప్‌డేట్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved