MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో రాగల గంటల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 21 2026, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రుతుపవనాల జోరు.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్
Image Credit : Gemini

రుతుపవనాల జోరు.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. లేటెస్ట్ వెదర్ అప్‌డేట్

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే కొన్ని గంటలు చాలా కీలకమని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ రాగల 24 గంటల నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వానతో పాటు పిడుగులు, ఈదురుగాలులు ఉంటాయనీ, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏపీలోని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Image Credit : Gemini

ఏపీలోని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

నర్సాపూరం, మచిలీపట్నం, ఏలూరు, గుడివాడ, దివిసీమ, భీమడోలు పరిసర ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించగా, ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, నెల్లూరుతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.

35
గంటకు 60 కి.మీ వేగంతో గాలులు.. విపత్తుల సంస్థ కీలక సూచనలు
Image Credit : Gemini

గంటకు 60 కి.మీ వేగంతో గాలులు.. విపత్తుల సంస్థ కీలక సూచనలు

వర్షాల సమయంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని హెచ్చరించారు. కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇళ్లలో ఉండవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

45
హైదరాబాద్‌లో కుండపోత.. స్తంభించిన జనజీవనం
Image Credit : Gemini

హైదరాబాద్‌లో కుండపోత.. స్తంభించిన జనజీవనం

హైదరాబాద్‌లో శనివారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 8 గంటల తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్, నారాయణగూడ, బషీర్ బాగ్, అబిడ్స్, కోఠి, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుత్బుల్లాపూర్, ఐడీపీఎల్, చింతల్, షాపూర్ నగర్, సూరారం, జీడిమెట్ల పరిసరాల్లో భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది.

55
తెలంగాణకు జూన్ 22 నుంచి భారీ వర్ష సూచన
Image Credit : Gemini

తెలంగాణకు జూన్ 22 నుంచి భారీ వర్ష సూచన

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో జూన్ 22 నుంచి వర్షాల తీవ్రత మరింత పెరగనుంది. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. జూన్ 21న ఉత్తర, తూర్పు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఉన్నప్పటికీ, జూన్ 22 నుండి 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా కూల్ కానుంది.

జూన్ 24, 25 తేదీల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్
అమరావతి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Related Stories
Recommended image1
Earth Facts: ఒక్క సెకండ్ లో భూమిపై ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచాన్ని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్
Recommended image2
India Map Sri Lanka : ఇండియా మ్యాప్‌లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved