- Home
- Telangana
- మందు బాబులకి కిక్కిచ్చే న్యూస్.. తెలంగాణ మార్కెట్లోకి మరో ప్రీమియం విస్కీ, ధర ఎంతో తెలుసా.?
మందు బాబులకి కిక్కిచ్చే న్యూస్.. తెలంగాణ మార్కెట్లోకి మరో ప్రీమియం విస్కీ, ధర ఎంతో తెలుసా.?
Alcohol: ప్రీమియం స్పిరిట్స్ మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ABD మాస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో మూడు కొత్త సూపర్ ప్రీమియం విస్కీ బ్రాండ్‌లను విడుదల చేసింది. రణవీర్ సింగ్ ఈ సంస్థకు సహ-స్థాపకుడిగా వ్యవహరిస్తున్నారు.

మూడు విభిన్న రుచులతో మూడు ప్రీమియం బ్రాండ్‌లు
ABD మాస్ట్రో విడుదల చేసిన ప్రతి విస్కీ ప్రత్యేకతను కలిగి ఉంది. AODH ఐరిష్ విస్కీని మూడు సార్లు స్వేదనం (ట్రిపుల్ డిస్టిల్డ్) చేసి తయారు చేయడంతో ఇది సాఫ్ట్ రుచి, సులభంగా ఆస్వాదించే అనుభూతిని అందిస్తుంది. WOODBURNS కాంటెంపరరీ రేర్ ఇండియన్ విస్కీ భారతీయ విస్కీ విభాగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బ్రాండ్‌గా నిలిచింది. YELLO డిజైనర్ విస్కీ స్కాచ్, భారతీయ మాల్ట్‌ల సమ్మేళనంతో రూపొందిన ప్రత్యేక బ్లెండ్‌గా ఆధునిక వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తయారైంది.
అంతర్జాతీయ అవార్డులతో గుర్తింపు పొందిన WOODBURNS
WOODBURNS విస్కీకి ప్రపంచ స్థాయిలో విశేష గుర్తింపు ఉంది. 2025లో నిర్వహించిన కాంకోర్స్ మాండియల్ డి బ్రస్సెల్స్ – స్పిరిట్స్ సెలెక్షన్ పోటీల్లో ఈ బ్రాండ్ ‘రెవలేషన్ బ్లెండెడ్ విస్కీ’ అవార్డుతో పాటు ‘గ్రాండ్ గోల్డ్’ పురస్కారాన్ని అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ విస్కీ బ్రాండ్‌గా WOODBURNS నిలవడం విశేషం. దీంతో భారతీయ ప్రీమియం విస్కీలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత గుర్తింపు లభించింది.
తెలంగాణ ప్రీమియం మార్కెట్‌పై ABD మాస్ట్రో దృష్టి
హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ABD మాస్ట్రో మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బసు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ప్రీమియం స్పిరిట్స్‌కు కీలకమైన మార్కెట్‌గా ఎదుగుతోందని తెలిపారు. నాణ్యత, ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులను కోరుకునే వినియోగదారులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని చెప్పారు. సాంస్కృతిక వారసత్వంతో పాటు ఆధునిక జీవనశైలిని అలవర్చుకున్న కస్టమర్ల కోసం ఈ మూడు బ్రాండ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. విలాసవంతమైన అనుభూతిని కోరుకునే వారికి ఈ విస్కీలు కొత్త ఎంపికగా నిలుస్తాయని ఆయన వివరించారు.
ధరలు.. ఎక్కడ లభిస్తాయంటే?
AODH, WOODBURNS, YELLO విస్కీలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ ఆల్కహాల్ విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎంపిక చేసిన ప్రీమియం బార్లు, రెస్టారెంట్‌ల్లో కూడా వీటిని అందిస్తున్నారు. 750 మి.లీ. బాటిల్ ధరలు AODH – రూ.3,470, WOODBURNS – రూ.2,630, YELLO – రూ.2,500గా నిర్ణయించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కూడా ప్రీమియం ఆల్కహాల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటంతో, ఈ బ్రాండ్‌లకు మంచి ఆదరణ లభిస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

