MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌లో ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు బార్లు ఓపెన్‌.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

హైద‌రాబాద్‌లో ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు బార్లు ఓపెన్‌.. తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Hyderabad: ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ మ్యాచ్‌ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్థరాత్రి తర్వాత జరిగే మ్యాచ్‌లను వీక్షించే వారి కోసం కొన్ని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు స‌మయం పొడ‌గిస్తూ ప్ర‌త్యేక అనుమ‌తి ఇచ్చారు.

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 17 2026, 08:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫిఫా మ్యాచ్‌ల కోసం ప్రత్యేక అనుమతి
Image Credit : Gemini AI

ఫిఫా మ్యాచ్‌ల కోసం ప్రత్యేక అనుమతి

ఫిఫా క్లబ్ వరల్డ్ కప్‌లో కీలక పోటీలు అర్థరాత్రి తర్వాత జరగనున్న నేపథ్యంలో బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరింది. ఆ విజ్ఞప్తిని పరిశీలించిన ఎక్సైజ్ శాఖ, క్రీడాభిమానులకు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆల్కహాల్ విక్రయాల సమయాన్ని తాత్కాలికంగా పొడిగించాలని నిర్ణయించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏ రోజున ఎంత వరకు అనుమతి?
Image Credit : Asianet News

ఏ రోజున ఎంత వరకు అనుమతి?

జూలై 19న జరిగే థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ పొందిన బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలు తెల్లవారుజామున 4:30 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అదే విధంగా జూలై 20న జరిగే ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా ప్రత్యేక మినహాయింపు ఇచ్చి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆల్కహాల్ విక్రయాలకు అనుమతి కల్పించారు.

34
ఫైనల్‌లో అర్జెంటీనా-స్పెయిన్ పోరు
Image Credit : Deadline

ఫైనల్‌లో అర్జెంటీనా-స్పెయిన్ పోరు

జూలై 20న అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న యార్క్ స్టేడియంలో ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ కోసం అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొనడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అభిమానుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

44
ఎక్కడ వర్తిస్తుంది.. ఎలాంటి నిబంధనలు?
Image Credit : Getty

ఎక్కడ వర్తిస్తుంది.. ఎలాంటి నిబంధనలు?

ఈ ప్రత్యేక అనుమతి హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని లైసెన్స్ కలిగిన బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణ సమయాలే అమల్లో ఉంటాయి. అనుమతించిన సమయాన్ని మించి ఆల్కహాల్ విక్రయాలు చేయరాదని, శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
FIFA ప్రపంచ కప్
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
Recommended image3
నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు
Related Stories
Recommended image1
Mini Camera: కంటికి క‌నిపించ‌ని మినీ కెమెరా.. మీ ఇంటికి స్మార్ట్ సెక్యూరిటీ, ధ‌ర కూడా త‌క్కువే
Recommended image2
Motivational story: అన్న‌ద‌మ్ములంటే ఇలా ఉండాలి.. ఈ త‌రం వాళ్లు క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved