MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • తెలుగు రైతులకు బంపరాఫర్.. రూ.10 కోట్ల లోన్ ఆఫర్.. ఎలా అప్లై చేయాలో తెలుసా?

తెలుగు రైతులకు బంపరాఫర్.. రూ.10 కోట్ల లోన్ ఆఫర్.. ఎలా అప్లై చేయాలో తెలుసా?

తెలుగు రైతులకు కేంద్ర ప్రభుత్వం అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.10 కోట్ల వరకు వడ్డీలేకుండా రుణాలు అందించేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసా?  

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 17 2025, 08:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రైతులకు బంపరాఫర్
Image Credit : Asianet News

తెలుగు రైతులకు బంపరాఫర్

వ్యవసాయ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన భారతదేశం ప్రయత్నిస్తోంది… ఇందులో భాగంగానే ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో కూరగాయలు, పండ్లను ఎగుమతి చేస్తోంది. అధిక దిగుబడి సాధించేలా చర్యలు తీసుకోవడమే కాదు పంటలను నిల్వ ఉంచుకునేందుకు సహకరిస్తోంది. 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా రైతులకు రుణ సహాయం అందిస్తున్నాయి. రైతులకు అందించే రుణాలపై వడ్డీ తక్కువగా ఉండటం వల్ల గ్రామీణ చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రైతు సంఘాలకు ఆర్థికసాయం
Image Credit : Asianet News

రైతు సంఘాలకు ఆర్థికసాయం

ఇప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) కూడా దేశ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ముందుకు వచ్చింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (Farmer Producer Organization) అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ బ్యాంక్ కీలక చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల చాలా మంది రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంతో పాటు వాటిని విలువైన ఉత్పత్తులుగా మార్చి అమ్ముకుంటున్నారు.

36
 రూ.10 కోట్ల రుణం ఎందుకు ఇస్తారు?
Image Credit : Asianet News

రూ.10 కోట్ల రుణం ఎందుకు ఇస్తారు?

FPO ఆర్థిక సహాయం పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం కింద అమలు చేయబడుతోంది. ఈ పథకం ప్రకారం రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు (SHG), వ్యవసాయ సంబంధిత సంస్థలు కింది కార్యకలాపాల కోసం రుణ సహాయం పొందవచ్చు.

  • శీతల గిడ్డంగుల ఏర్పాటు
  • ధాన్య శుద్ధి కేంద్రాల ఏర్పాటు
  • ప్యాకింగ్ వ్యవస్థల ఏర్పాటు
  • మార్కెటింగ్ సౌకర్యాలకోసం
  • వ్యవసాయ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలు కొనుగోలు కోసం
46
 ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
Image Credit : Asianet News

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రకటించిన ప్రకారం ఒక FPOకి  రూ.10 కోట్ల వరకు రుణ సహాయం అందించబడుతుంది. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రభుత్వం వడ్డీ నష్టాన్ని సబ్సిడీగా అందిస్తుంది.

వడ్డీ రేటు, కాలపరిమితి

  • వడ్డీ సబ్సిడీ: సంవత్సరానికి 3% వరకు సబ్సిడీ అందించబడుతుంది. రుణ మొత్తం తిరిగి చెల్లించే కాలపరిమితి గరిష్టంగా 7 సంవత్సరాలు.
  • మారటోరియం కాలం: 1 నుండి 2 సంవత్సరాల వరకు

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • నమోదిత రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు)
  • ఎక్కువగా రైతులచే నిర్వహించబడే సహకార సంఘాలు
  • సమూహ సంస్థలు
56
రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
Image Credit : Asianet News

రుణం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  1. FPO నమోదు కాపీ, కార్యాచరణ నివేదికలు, వాటాదారుల వివరాలను సిద్ధం చేయాలి
  2. బ్యాంక్ శాఖను నేరుగా సందర్శించి వ్యవసాయ సంబంధిత ప్రాజెక్ట్ నివేదికను సమర్పించాలి
  3. బ్యాంక్ అధికారులు పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేయబడుతుంది

ఈ పథకం, వ్యవసాయాన్ని వాణిజ్యపరంగా మార్చే ఒక ముఖ్యమైన ప్రయత్నం అని… FPOలకు అందించబడే ఆర్థిక సహాయం ఆధునిక వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులను, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ఆదాయాన్ని పెంచుతుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.

66
ఈ పథకంతో రైతులకు లాభాలు
Image Credit : Asianet News

ఈ పథకంతో రైతులకు లాభాలు

  • వ్యవసాయ ఆదాయం పెరుగుతుంది
  • మధ్యవర్తులను నివారించి ప్రత్యక్ష మార్కెట్లో ఉత్పత్తులను అమ్ముకోవచ్చు
  • గ్రామీణ ఉపాధి అవకాశాలు లభిస్తాయి
  • ఉత్పత్తి వృధా కాకుండా కాపాడుకోవచ్చు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ ఆమోదయోగ్యమైన ఆర్థిక పథకం, భారతదేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం (Vyavasayam)
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
personal loan: గూగుల్ పే బంపర్ ఆఫర్: రూ.12 లక్షల వరకు పర్సనల్ లోన్.. అంతా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్
Recommended image2
Home Loan: హోం లోన్ తొందరగా క్లియర్ చేయాలంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved