- Home
- Business
- personal loan: గూగుల్ పే బంపర్ ఆఫర్: రూ.12 లక్షల వరకు పర్సనల్ లోన్.. అంతా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్
personal loan: గూగుల్ పే బంపర్ ఆఫర్: రూ.12 లక్షల వరకు పర్సనల్ లోన్.. అంతా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్
మీకు పర్సనల్ లోన్ కావాలా? ఇకపై బ్యాంకులకు కూడా వెళ్లక్కరలేకుండా మీ ఫోన్ లో ఉన్న గూగుల్ పే ద్వారా పొందొచ్చు. తన వినియోగదారుల కోసం గూగుల్ పే కొత్తగా ఈ లోన్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ వడ్డీరేట్లు, లోన్ లిమిట్ తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం.

వినియోగదారుల కోసం గూగుల్ పే పర్సనల్ లోన్స్
గూగుల్ పే (Google Pay) యాప్ తన వినియోగదారులకు ఇప్పుడు పర్సనల్ లోన్ సదుపాయం అందిస్తోంది. భాగస్వామ్య బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల సహకారంతో జీపే యూజర్లకు తక్షణంగా లోన్ ఆఫర్లు అందిస్తోంది. అయితే ఈ లోన్లపై వడ్డీ రేట్లు, అర్హత ప్రమాణాలు, సీక్రెట్ ఛార్జీలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే పర్సనల్ లోన్లు భారంగా మారే అవకాశం ఉంటుంది. జీపే లోన్లు గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 30,000 నుండి రూ. 12,00,000 వరకు లోన్‌లు
Google Pay యాప్ ద్వారా రూ. 30,000 నుండి రూ. 12,00,000 వరకు లోన్‌లు తీసుకునే అవకాశం ఉంది. వార్షిక వడ్డీ రేట్లు సుమారు 11.25% నుంచి మొదలవుతాయి. మొత్తం ప్రాసెస్ యాప్‌లోనే జరుగుతుంది. Know Your Customer (KYC) వివరాలు అందించి, ఫోటో సబ్మిట్ చేసి, e-Mandate సెటప్ చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే లోన్ డిస్బర్స్ అవుతుంది.
ఈ అర్హతలు ఉండాలి
వయసు 21 నుండి 57 సంవత్సరాల మధ్య ఉండాలి. క్రెడిట్ స్కోర్ కనీసం 600 నుండి 700 మధ్య ఉండాలి. ఆదాయ వనరు స్థిరంగా ఉండాలి. లోన్ కాలవ్యవధి 6 నెలల నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. EMIలు యూజర్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ అవుతాయి.
వడ్డీ రేట్లు లెండర్‌కు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కొన్ని సంస్థలు 11.25% నుండి ఆఫర్ చేస్తే మరికొన్ని 13.99% లేదా అంతకంటే ఎక్కువగా వసూలు చేస్తుంటాయి. ఈ రేట్లు పూర్తిగా యూజర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఉంటాయి.
జీపే లోన్ అప్లికేషన్‌కు 5 సింపుల్ స్టెప్స్
మొదటగా మీ గూగుల్ పే అప్లికేషన్‌ను అప్‌డేట్ చేసి దానికి మీ బ్యాంక్ అకౌంట్ ను లింక్ చేయండి.
“Manage your money” సెక్షన్‌లోని “Loans” ట్యాబ్‌కి వెళ్లండి.
మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా మీకు ప్రత్యేకించి కేటాయించిన ఆఫర్లను పరిశీలించండి.
లోన్ ఫారమ్, KYC, ఫోటో సబ్మిషన్, e-Mandate సెటప్ ఫిల్ చేయండి.
అన్ని అర్హతలు సరిగ్గా ఉంటే మీకు లోన్ అప్రూవల్ అవుతుంది. తర్వాత గంటల వ్యవధిలోనే నిధులు మీ ఖాతాలోకి జమవుతాయి. ప్రతినెలా మాత్రం EMI డెబిట్‌కు బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి.
సీక్రెట్ ఛార్జీలు, అధిక వడ్డీ రేట్లు, రిస్కులు ఉంటాయి
చాలా మంది గూగుల్ పే వాడతారు. ఇక్కడ పర్సనల్ లోన్ లభిస్తోందని అనేక యూజర్లు వారికి లభించిన లోన్ ఆఫర్‌ను పూర్తిగా చదవకుండానే అంగీకరిస్తున్నారు. ఇందులో ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-పేమెంట్ ఛార్జీలు వంటి వాటిని ముందుగా తెలుసుకోకపోతే మీపై ఆర్థిక భారం పడుతుంది. ప్రాసెసింగ్ ఛార్జీలు కొన్ని సంస్థల వద్ద 2% వరకు ఉండొచ్చు.
లోన్ తీసుకొనే వారు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. జీపే లోన్స్ ఇవ్వదు. ఇవి థర్డ్ పార్టీ సంస్థలు ఇచ్చే ఆఫర్లను తన వినియోగదారులకు చేరవేస్తుంది. గూగుల్ పేకు లోన్ షరతులపై నియంత్రణ ఉండదు. అందువల్ల వడ్దీరేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు, ఫెనాల్టీల గురించి పూర్తి వివరాలు తెలుసుకొని లోన్ తీసుకోవడం మంచిది.