కవిత, వినోద్‌లకు షాక్: బీజేపీ, కాంగ్రెస్ సీక్రెట్ ఒప్పందం

First Published 22, May 2019, 1:02 PM

త నెల 11వ తేదీన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో  కాంగ్రెస్, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారని టీఆర్ఎస్ ఆరోపించింది. లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ సహకరించిందని టీఆర్ఎస్ నేతలు  విమర్శలు గుప్పించారు.

బీజేపీ అభ్యర్థుల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని టీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ మేరకు తాము కచ్చితమైన సమాచారాన్ని సేకరించినట్టుగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రెండో దఫా పోటీ చేశారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ వెంట మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు తిరిగారని ఆమె గుర్తు చేస్తున్నారు.

కరీంనగర్ స్థానంలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాడర్ ఎక్కువగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు ఓటు వేయాలని కోరినట్టుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలు చోటు చేసుకొన్నా కూడ కరీంనగర్ నుండి తాను మరోసారి విజయం సాధిస్తానని ఆ పార్టీ నేత బి.వినోద్ కుమార్ ధీమాతో ఉన్నారు.

మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ నేతలు కేసీఆర్‌కు ఓ నివేదికను అందించారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకె అరుణ పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి బరిలో ఉన్నారు.

ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అవగాహన ఉందని టీఆర్ఎస్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్ధికి కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతుగా నిలిచారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం టీఆర్ఎస్‌కు చాలా కీలకమైంది. ఈ స్థానంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేతగా ఉన్న ఏపీ జితేందర్ రెడ్డికి టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో  ఎంఐఎం తమకు మిత్రపక్షమని కూడ ఆ పార్టీ తేల్చి చెప్పింది.

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థికి తాము సహకరించినట్టుగా టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ స్థానంలో ని చాలా చోట్ల బీజేపీ అభ్యర్ధికి టీఆర్ఎస్ క్యాడర్ మద్దతుగా ప్రచారం నిర్వహించిందని ఆయన ఆరోపించారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వేములవాడలో చోటు చేసుకొన్న పరిస్థితులను పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చారు 2014 ఎన్నికల్లో వేములవాడ నుండి ఆది శ్రీనివాస్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.

2018 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇదే స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేశారని ఆయన గుర్తు చేశారు. ఆది శ్రీనివాస్ కు చెందిన కొందరు మద్దతుదారులు వ్యక్తిగతంగా ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన విషయాన్ని పొన్నం ప్రభాకర్ ఒప్పుకొన్నారు.

దేశంలో మోడీ ప్రభంజనం ఉందని.. ఈ కారణంగానే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. కానీ, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఈ ఎన్నికల్లో ఎలాంటి అవగాహన లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

loader