వాట్సాప్‌లో మరో కొత్త సూపర్ ఫీచర్
WhatsApp New Features: వాట్సాప్ మరో సూపర్ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్ ద్వారా చాట్ ఇన్ఫో స్క్రీన్ నుంచే పెద్ద ఫైల్స్ రివ్యూ, సార్ట్, డిలీట్ చేసే అవకాశం కల్పిస్తోంది. ఐఓస్, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ రోలౌట్ అయింది.

స్టోరేజ్ మేనేజ్‌మెంట్‌ను స్మార్ట్‌గా మార్చిన వాట్సాప్
యూజర్ల కోసం వాట్సాప్ ఒక పెద్ద అప్‌డేట్ విడుదల చేసింది. యాప్‌ను మరింత స్మార్ట్‌గా, సులభంగా వాడేందుకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ అప్‌డేట్‌తో యూజర్లు చాట్ ఇన్ఫో స్క్రీన్ నుంచే ఫోన్ స్టోరేజ్‌ను మేనేజ్ చేయవచ్చు. బిగ్ ఫైల్స్‌ను రివ్యూ చేయడం, సార్ట్ చేయడం, డిలీట్ చేయడం ఒకే క్లిక్‌తో సాధ్యమవుతుంది. సెట్టింగ్స్‌కి వెళ్లకుండా ఈ పనిని ఇక్కడే పూర్తవుతుంది.
వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ (Android) 2.25.31.13 బీటా తర్వాత ఇప్పుడు ఐఓఎస్ (iOS) బీటాలో కూడా టెస్ట్‌ఫ్లైట్ యాప్ ద్వారా కనిపిస్తోంది. వాట్సాప్ బీటా ఐఓఎస్ 25.31.10.70 వెర్షన్‌లో ఈ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
చాట్ ఇన్ఫో నుంచే డేటా, స్టోరేజ్ కంట్రోల్
ఈ అప్‌డేట్‌తో ఏదైనా చాట్ ఇన్ఫో స్క్రీన్‌లోనే స్టోరేజ్‌కు సంబంధించిన వివరాలు చూసే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు:
• చాట్‌లో రిసీవ్ అయిన పెద్ద ఫైల్స్‌ను ఒకే చోట చూడగలరు
• సైజ్ ఆధారంగా ఫైల్స్‌ను సార్ట్ చేయగలరు
• అవసరం లేని ఫైల్స్‌ను వెంటనే డిలీట్ చేయగలరు
ఈ మార్పులు ఫోన్ స్టోరేజ్‌ను సరిగ్గా వినియోగించడానికి సహాయపడతాయి.
త్వరలో స్టేబుల్ అప్‌డేట్
ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. టెస్టింగ్ పూర్తయ్యాక స్టేబుల్ వెర్షన్‌గా అందరు యూజర్లకు రోలౌట్ చేయనుంది.
ఈ సెక్షన్‌లో యూజర్లు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు వంటి మీడియా ఫైల్స్‌ని గ్రిడ్ రూపంలో చూడవచ్చు. ఫైల్స్ సైజ్ ఆధారంగా ఆటోమేటిక్‌గా ఆర్గనైజ్ అవుతాయి. “Newest, Oldest, Largest” వంటి సార్టింగ్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
మొబైల్ నంబర్ అవసరం లేకుండా చాట్
ఇంకో పెద్ద అప్డేట్ ను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. ప్రస్తుతం 2009 నుంచి అకౌంట్ క్రియేట్ చేయడానికి, చాట్ చేయడానికి మొబైల్ నంబర్ తప్పనిసరి. ఇకపై మొబైల్ నంబర్ షేర్ చేయకుండా కూడా చాట్ చేసే అవకాశం రాబోతోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ దశలో ఉంది.
వాట్సాప్ లో యూజర్‌నేమ్ సెక్యూరిటీ మార్పులు
వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక వివరాలు ప్రకారం, వాట్సాప్ మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చింది. వాటిలో..
- యూజర్‌నేమ్‌లో కనీసం ఒక అక్షరం ఉండాలి
- 3 నుంచి 30 అక్షరాల మధ్య ఉండాలి
- a-z, 0-9, డాట్, అండర్ స్కోర్ మాత్రమే ఉపయోగించాలి
- ప్రారంభం, ముగింపు వద్ద డాట్ ఉండకూడదు
- వరుసగా రెండు డాట్ లకు కూడా అనుమతి లేదు
- “www.” ప్రారంభం, “.com” ముగింపు వంటి డొమైన్ రూపాలు నిషేధం
- డుప్లికేట్ యూజర్‌నేమ్‌లు అనుమతి లేదు
వీటిని ఎందుకు తీసుకొచ్చింది?
యూజర్స్‌ను స్కామ్ నుండి, ఫేక్ అకౌంట్ల నుండి రక్షించడం కోసం నేమ్ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొచ్చినట్టు వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటికీ టెస్టింగ్‌లోనే ఉంది. ప్రైవసీ, టెక్నికల్ లోపాలు లేకుండా నిర్ధారించిన తర్వాతే అధికారికంగా లాంచ్ చేస్తారు. విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. బీటా టెస్టింగ్ సక్సెస్ అయితే రాబోయే నెలల్లో అందరు యూజర్లకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.