వాట్సాప్‌లో కాల్ రికార్డ్ చేయొచ్చని తెలుసా.? చాలా మందికి తెలియని సింపుల్ ట్రిక్స్
WhatsApp: సాధారణంగా ప్రతీ మొబైల్లో ఆడియో కాల్‌ను రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాట్సాప్ కాల్స్‌ను మాత్రం రికార్డ్ చేయలేము. అయితే కొన్ని కొన్ని సులభమైన మార్గాలతో కాల్స్‌ను రికార్డ్ చేయవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎలా రికార్డ్ చేయొచ్చంటే..
చాలా వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటికే స్క్రీన్ రికార్డరర్ అనే ఫీచర్ ఉంటుంది. దీని సహాయంతో వాట్సాప్ కాల్స్‌ను రికార్డ్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా ఫోన్‌లోని స్క్రీన్ రికార్డర్ ఓపెన్ చేయాలి. రికార్డ్ ఆడియో లేదా డివైజ్ ఆడియా ఆప్షన్ ఆన్‌లో ఉందో చూడాలి. తర్వాత వాట్సాప్ కాల్ చేయండి లేదా వచ్చిన కాల్‌ను లిఫ్ట్ చేయండి. కాల్ పూర్తయ్యాక రికార్డింగ్ ఆటోమేటిక్‌గా గ్యాలరీలో సేవ్ అవుతుంది. కొన్ని ఫోన్లలో ఇంటర్నల్ ఆడియో రికార్డ్ కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో స్పీకర్ మోడ్ ఆన్ చేసి రికార్డ్ చేయాల్సి ఉంటుంది.

థర్డ్ పార్టీ యాప్స్ కూడా..
కొన్ని ఫోన్లలో ఇన్‌బిల్ట్ స్క్రీన్ రికార్డర్ సరిగా పని చేయకపోతే ప్లేస్టోర్‌లో లభించే కొన్ని రికార్డింగ్ యాప్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ యాప్స్ ద్వారా స్క్రీన్ వీడియో రికార్డ్ చేయవచ్చు, కాల్ ఆడియో కూడా సేవ్ చేసుకోవచ్చు, కొన్ని యాప్స్ ఆటోమేటిక్ రికార్డింగ్ సదుపాయం కూడా ఇస్తాయి. అయితే ఏ యాప్ డౌన్‌లోడ్ చేసినా ముందు దాని ప్రైవసీ పాలసీ, అనుమతులు తప్పనిసరిగా చెక్ చేయాలి. ఫేక్ యాప్స్ వ్యక్తిగత సమాచారం దొంగిలించే ప్రమాదం ఉంటుంది.
ఐఫోన్ యూజర్లకు కాస్త కష్టమే
యాపిల్ కంపెనీ తయారు చేసే ఐఫోన్‌లలో సెక్యూరిటీ ఎక్కువగా ఉండటంతో వాట్సాప్ కాల్ రికార్డింగ్ సులభంగా చేయడం కష్టం. అయితే కొన్ని మార్గాలు ఉన్నాయి. మ్యాక్‌బుక్ సహాయంతో కాల్ రికార్డ్ చేయడం, మరో ఫోన్ లేదా డివైస్‌తో స్పీకర్ మోడ్‌లో రికార్డ్ చేయడం. కానీ ఇలా రికార్డ్ చేసినప్పుడు ఆడియో క్వాలిటీ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది.
కాల్ రికార్డ్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఎవరైనా వ్యక్తి అనుమతి లేకుండా వారి కాల్ రికార్డ్ చేయడం కొన్ని ప్రాంతాల్లో చట్ట విరుద్ధం కావచ్చు. అందుకే అవసరమైన సందర్భాల్లో మాత్రమే రికార్డ్ చేయాలి. వ్యక్తిగత గోప్యతను గౌరవించాలి, రికార్డ్ చేసిన ఫైల్స్‌ను సురక్షితంగా ఉంచాలి. ఫోన్ ఇతరుల చేతికి వెళ్లినప్పుడు వ్యక్తిగత రికార్డింగ్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. మీరు రికార్డింగ్ చేయడం ఎదుటి వ్యక్తికి కూడా సమ్మత్తం ఉంటేనే రికార్డ్ చేస్తే మంచిది.
వాట్సాప్‌లో నేరుగా రికార్డింగ్ ఫీచర్ వస్తుందా?
ప్రస్తుతం మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్‌లో అధికారిక కాల్ రికార్డింగ్ ఫీచర్ లేదు. భవిష్యత్తులో యూజర్ల అవసరాలను బట్టి ఈ ఫీచర్ తీసుకురావచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పటి వరకు స్క్రీన్ రికార్డర్ లేదా ఇతర సురక్షిత మార్గాలనే ఉపయోగించాల్సి ఉంటుంది.

