MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Robot Phone: రోబోట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఇక కెమెరామెన్ అక్కర్లేదు, కెమెరానే తిరుగుతుంది

Robot Phone: రోబోట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఇక కెమెరామెన్ అక్కర్లేదు, కెమెరానే తిరుగుతుంది

Robot Phone: దానంతట అదే తిరిగే కెమెరాతో కొత్త రోబో ఫోన్ రాబోతోంది.  హానర్ సంస్థ ఈ రోబో ఫోన్ ను విడదల చేయబోతోంది. ఇందులో కెమెరా తనంతట తానే తిరుగుతుంది.  ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్ల గురించి పూర్తి వివరాలు ఇవిగో.

2 Min read
Author : Haritha Chappa
Published : May 18 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తొలి రోబో ఫోన్ వచ్చేస్తోంది
Image Credit : x

తొలి రోబో ఫోన్ వచ్చేస్తోంది

ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ హానర్..  నెక్స్ట్ జనరేషన్ కాన్సెప్ట్ తో స్మార్ట్‌ఫోన్ తీసుకురోబోతోంది. దీనికి ‘హానర్ రోబో ఫోన్’ అని పేరు పెట్టేసంది. 2026 మూడో త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే, జులై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ ఫోన్  మార్కెట్లోకి వస్తుందన్న మాట. ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో హానర్ సంస్థ సీఈఓ లీ జైన్ ఈ ఫోన్ గురించి ప్రకటన చేశారు. సినిమాటిక్ మొబైల్ ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ఈయన తెలిపారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దానంతట అదే తిరిగే కెమెరా
Image Credit : Gemini

దానంతట అదే తిరిగే కెమెరా

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరాను మనమే ఎటు కావాలంటే అటూ ఫోన్ తో పాటూ తిప్పుకోవాలి. కానీ ఈ హానర్ రోబో ఫోన్ వస్తే అదే తిరుగుతుంది. ఫోన్ పైభాగంలో అమర్చిన రోబోటిక్ గింబల్ కెమెరా, దానంతట అదే కదులుతూ వీడియోలను షూట్ చేస్తుంది. దీనివల్ల ప్రొఫెషనల్ కెమెరాల మాదిరిగా చాలా స్పష్టమైన, షేక్ లేని వీడియోలు తీయవచ్చు. ఈ మెకానికల్ గింబల్ సిస్టమ్‌లో హానర్ 200 మెగాపిక్సెల్ (200MP) అల్ట్రా-హై-రిజల్యూషన్ సెన్సార్‌ను ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తోంది హానర్ సంస్థ. ఇందులో త్రీ-యాక్సిస్ మెకానికల్ గింబల్ స్టెబిలైజేషన్‌తో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్టెబిలైజేషన్ ఇంజిన్‌ను కూడా ఇచ్చారు. ఈ టెక్నాలజీ, యూజర్ కదలికలను వెంటనే గుర్తించి, దానికి తగ్గట్టు కెమెరాను అడ్జస్ట్ చేసుకుంటుంది. అంతేకాదు, ఇందులోని AI సబ్జెక్ట్ ట్రాకింగ్ ఫీచర్, ఒక వ్యక్తి లేదా వస్తువు కదలికలను ముందుగానే ఊహించి, కెమెరాను ఆటోమేటిక్‌గా అటువైపు తిప్పుతుంది. అందుకే దీన్నిరోబో ఫోన్ అని పిలిచారు.

34
ఆటోమేటిక్ వీడియో కాల్ ట్రాకింగ్
Image Credit : honor.com

ఆటోమేటిక్ వీడియో కాల్ ట్రాకింగ్

మీరు వీడియో కాల్‌ మాట్లాడుతున్నప్పుడుమిమ్మల్ని ఫ్రేమ్ మధ్యలోనే ఉంచడానికి ఈ కెమెరా దానంతట అదే తిరిగి మిమ్మల్ని ఫాలో అవుతుంది. దీనికి ప్రత్యేకంగా స్టాండ్ కూడా అవసరం లేదు. ఇది కాకుండా, ఇందులో 'స్పిన్‌షాట్' (SpinShot) అనే ప్రత్యేక మోడ్ కూడా ఉంది. దీని ద్వారా, కెమెరాను 90 లేదా 180 డిగ్రీలలో తిప్పుతూ, ఒకే చేత్తో అద్భుతమైన క్రియేటివ్ వీడియో షాట్‌లను తీయవచ్చు. 

44
యాపిల్‌కు గట్టి పోటీ
Image Credit : AI

యాపిల్‌కు గట్టి పోటీ

ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకత వల్ల ఫిల్మ్ మేకర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వారిని లక్ష్యంగా చేసుకునే హానర్ సంస్థ దీన్ని విడుదల చేస్తోంది. 2026లో విడుదల కానున్న శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, గెలాక్సీ Z ఫ్లిప్ 8, గూగుల్ పిక్సెల్ 11 సిరీస్, యాపిల్ తీసుకురాబోయే ఫోల్డబుల్ ఐఫోన్‌కు హానర్ కొత్త రోబో ఫోన్ గట్టి పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ సేల్స్.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్ల పై బిగ్ డిస్కౌంట్స్.. టాప్ 5 డీల్స్ ఇవే
Recommended image2
iPhone Price : పాకిస్థాన్‌లో ఐఫోన్ 17 ధర ఎంతో తెలుసా?
Recommended image3
Flipkart Big Billion Days: ధమాకా ఆఫర్.. రూ. 5,799 కే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బంపర్ ఛాన్స్
Related Stories
Recommended image1
Guru Chandra Conjunction: గురు చంద్రుల కలయికతో ఆ 4 రాశుల వారే లక్కీ రాజాలు
Recommended image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved