MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • YouTube : యూట్యూబర్లకు పండగే.. ఇక ఏఐ రీల్స్ వచ్చేస్తున్నాయి.. ఎలా చేయాలో తెలుసా..?

YouTube : యూట్యూబర్లకు పండగే.. ఇక ఏఐ రీల్స్ వచ్చేస్తున్నాయి.. ఎలా చేయాలో తెలుసా..?

యూట్యూబ్ షార్ట్స్ వీడియోలను ఏఐతో మార్చేసేందుకు 'యాడ్ ఆబ్జెక్ట్', 'రీఇమాజిన్' అనే కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. టెక్స్ట్ ఇస్తే చాలు, వీడియోలో లేని వస్తువులను కూడా ఇది యాడ్ చేస్తుంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 10 2026, 09:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యూట్యూబ్ లో సరికొత్త ఫీచర్లు...
Image Credit : Gemini

యూట్యూబ్ లో సరికొత్త ఫీచర్లు...

యూట్యూబ్ షార్ట్స్ (YouTube Shorts) వీడియోలను ఎడిట్ చేయడం ఇకపై చాలా సులభం కానుంది. 'యాడ్ ఆబ్జెక్ట్' (Add Object) అనే కొత్త టూల్ సహాయంతో వీడియోలో లేని వస్తువును కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో యాడ్ చేయొచ్చు. ఉదాహరణకు ఓ సాధారణ డ్యాన్స్ వీడియోలో గాల్లో ఎగిరే షూలను లేదా ఓ కామెడీ వీడియోలో స్పీచ్ బబుల్‌ను కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్ (Text Prompt) ఇచ్చి చేర్చవచ్చు. సుమారు 8 సెకన్ల నిడివి ఉన్న క్లిప్పుల్లో ఈ మార్పులు చేయొచ్చు. దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ వాడాల్సిన పనిలేదు. యూట్యూబ్ యాప్‌లోనే ఈ పని పూర్తిచేయొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఒకే ఒక్క ఫొటోను వీడియోగా మార్చే 'రీఇమాజిన్'
Image Credit : Getty

ఒకే ఒక్క ఫొటోను వీడియోగా మార్చే 'రీఇమాజిన్'

ఈ అప్‌డేట్‌లో వచ్చిన మరో ముఖ్యమైన ఫీచర్ 'రీఇమాజిన్' (Reimagine). ఇది ఒక వీడియోలోని సింగిల్ ఫ్రేమ్‌ను తీసుకుని, దాన్ని పూర్తిగా కొత్త వీడియోగా మార్చేస్తుంది. ఉదాహరణకు సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తి ఫొటోను తీసుకుని, దాన్ని నియాన్ స్టైల్‌లో లేదా కామిక్ బుక్ స్టైల్‌లో కొత్త వీడియోగా ఏఐ మార్చేస్తుంది. ఇందుకోసం మీరు రెండు రిఫరెన్స్ ఫొటోలను కూడా అప్‌లోడ్ చేసి, వీడియో స్టైల్‌ను మార్చుకోవచ్చు. ఇది క్రియేటర్ల సృజనాత్మకతను మరో స్థాయికి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.

Related Articles

Related image1
Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Related image2
YouTube : యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించవచ్చు ! ఈ 5 టిప్స్ పాటిస్తే సక్సెస్ పక్కా !
34
క్రియేటర్ల హక్కులకు రక్షణ
Image Credit : Getty

క్రియేటర్ల హక్కులకు రక్షణ

ఇతరుల వీడియోలను ఏఐతో మార్చినప్పుడు కాపీరైట్ సమస్యలు వస్తాయా? అనే సందేహం రావచ్చు. దీనికి యూట్యూబ్ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఏఐతో రీమిక్స్ చేసిన ప్రతి వీడియో కింద, దాని ఒరిజినల్ వీడియో లింక్ ఉంటుంది. దీనివల్ల అసలు వీడియో క్రియేటర్‌కు సరైన గుర్తింపు (క్రెడిట్) లభిస్తుంది.

అయితే తమ వీడియోలను ఇతరులు ఏఐతో రీమిక్స్ చేయకూడదు అనుకునే క్రియేటర్లు, యూట్యూబ్ స్టూడియో (YouTube Studio) సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ఆప్షన్‌ను ఆఫ్ (Opt-out) చేసుకునే సౌకర్యాన్ని కూడా యూట్యూబ్ కల్పించింది.

44
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
Image Credit : Pixabay

ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొంతమంది ఇంగ్లీష్ క్రియేటర్లతో మాత్రమే పరీక్షిస్తున్నారు. ఈ టెస్టింగ్ విజయవంతం అయ్యాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లందరికీ, మన ఇండియన్ క్రియేటర్లతో సహా అందుబాటులోకి తీసుకువస్తారని భావిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే యూట్యూబర్లు పండగ చేసుకుంటారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Recommended image2
YouTube : యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించవచ్చు ! ఈ 5 టిప్స్ పాటిస్తే సక్సెస్ పక్కా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved