ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోటో ఇదే! సోషల్ మీడియాలో చక్కర్లు..
తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నరేంద్ర మోడీ అండ్ భారతదేశపు టీనేజ్ ప్రాడిజీ ప్రజ్ఞానానంద ఒక పెద్ద చెస్ బోర్డుకు ఎదురుగా కూర్చొని ఉంటారు.
Modi
చెస్ ప్రపంచకప్‌లో రజత పతకం సాధించిన తర్వాత ప్రగ్నానందను కలిసిన నరేంద్ర మోదీ ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ప్రజ్ఞానంద తల్లిదండ్రులతో ప్రధాని మాట్లాడుతున్న, పతకాన్ని చూస్తున్న ఫోటోలను కూడా అందులో షేర్ చేసారు.
'ప్రజ్ఞానానంద ఇంకా అతని కుటుంబంతో ఉన్న ఫోటో 'ఇది ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం' అనే క్యాప్షన్‌తో నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫోటో కింద వేలాది మంది ప్రగ్నానందను అభినందిస్తూ, ప్రధానమంత్రిని సపోర్ట్ చేసినందుకు ప్రశంసిస్తూ కామెంట్స్ చేసారు.
43 లక్షల మందికి పైగా ఈ ఫోటోని లైక్ చేయగా ఇటీవల నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అత్యధికంగా లైక్ చేసిన ఫోటో కూడా ఇదే. భారతదేశ చంద్రయాన్-3 విజయం తర్వాత, ప్రగ్నానందతో ఉన్న ఫోటో 'చంద్రునిపై భారతదేశ పాదముద్ర' పేరుతో మోడీ షేర్ చేసిన వైరల్ ఫోటోని అధిగమించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 42 లక్షల మందికి పైగా ఈ ఫోటో లైక్ చేశారు. చంద్రయాన్ సాఫ్ట్ ల్యాండింగ్ గ్రాఫిక్స్‌కి కూడా 40 లక్షల లైక్స్ వచ్చాయి.
18 ఏళ్ల ఆర్ ప్రజ్ఞానానంద చెస్‌లో గొప్ప విజయాలు సాధించి దేశం గర్వించేలా చేశాడు. ప్రగ్నానంద తన మొదటి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆడాడు, ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా అండ్ ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానో వంటి వారిని ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్నాడు.
ఫైనల్లో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సెన్ చేతిలో ఓడిపోయాడు. తొలి రెండు క్లాసిక్ రౌండ్లలో ప్రపంచ నంబర్ 1 కార్ల్ సన్ ను కట్టడి చేసిన ప్రజ్ఞానంద.. టైబ్రేకర్ లో ఓటమిని అంగీకరించాడు. దీని ద్వారా ప్రపంచకప్ చెస్ టోర్నీలో రజత పతకం సాధించిన ప్రజ్ఞానానంద.. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు.
2005లో నాకౌట్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. 2000 అండ్ 2002లో విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ గెలుచుకున్నప్పుడు, టోర్నమెంట్‌లు 24 మంది ఆటగాళ్లతో రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో జరిగాయి.