MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Free Current : తెలుగోళ్లకు బంపరాఫర్... ప్రభుత్వం నుండి నెలనెలా రూ.1800, ఏటా రూ.21,600

Free Current : తెలుగోళ్లకు బంపరాఫర్... ప్రభుత్వం నుండి నెలనెలా రూ.1800, ఏటా రూ.21,600

Free Current : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. నేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్దమయ్యింది… ఇవాళ్టి (ఏప్రిల్ 1) నుండే ఈ పథకం అమల్లోకి వస్తోంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 01 2026, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరో ఎన్నికల హామీ అమలు..
Image Credit : Gemini AI

మరో ఎన్నికల హామీ అమలు..

Free Current : రెక్కాడితే గానీ డొక్కాడని పేద నేతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు ఉచిత కరెంట్ ఇచ్చేందుకు సిద్దమయ్యింది. ఏప్రిల్ 1న అంటే ఇవాళ్టినుండి ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ ఉచిత విద్యుత్ అమలులోకి రానుంది... దీంతో ప్రతి చేనేత కార్మికుడికి లబ్ఢి చేకూరుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉచిత విద్యుత్ పథకం..
Image Credit : unsplash

ఉచిత విద్యుత్ పథకం..

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని లక్షకు పైగా కుటుంబాలు చేనేత వృత్తిపైనే ఆధారపడి బ్రతుకుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరందరికి ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజాగా దీన్ని అమలు చేస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 93,000 మరమగ్గాలకు, 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అయితే మరమగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న నేతన్నలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించి అండగా నిలిచేందుకు ప్రభుత్వం కూటమి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.

35
ఏడాదికి ఏకంగా 21.600 బెనిఫిట్స్...
Image Credit : Gemini Ai

ఏడాదికి ఏకంగా 21.600 బెనిఫిట్స్...

ఉచిత విద్యుత్ పథకంతో నేత కార్మికులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. ఒక్కో చేనేత కార్మికుని కుటుంబానికి నెలకు రూ.720, అదే ఏడాదికి రూ.8,640 ఆదా అవుతుంది. అదే పవర్ లూమ్ యూనిట్లకు నెలకు రూ.1,800, ఏడాదికి రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. నేత వృత్తిలో విద్యుత్ ఒక అనివార్య ఖర్చు... అదే లేకుండా చేయడంద్వారా ఆ కుటుంబాల్లో ఆనందాలు నింపే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి రూ.150 కోట్ల అదనపు భారం పడనుంది.

45
చేనేత రంగానికి ప్రభుత్వ సాయం...
Image Credit : Gemini

చేనేత రంగానికి ప్రభుత్వ సాయం...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది... వివిధ రకాల సంస్కరణలు చేపట్టింది. మొదట నేత కార్మికులకు అందించే పెన్షన్ ను రూ.4 వేలకు పెంచింది. ఇది కార్మికుల కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించింది.

ఇక నేత కార్మికులు ఆధునిక యంత్రాల కొనుగోలుపై ఏకంగా 90 శాతం రాయితీ అందించింది. అలాగే ముడి సరుకుపై కూడా 15 శాతం రాయితీ చూసింది. నాణ్యమైన నూలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. చేనేత కార్మికులకు మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించింది... అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ప్లాట్ ఫామ్స్ ద్వారా తమ వస్త్రాలు అమ్ముకునేలా ఏర్పాటు చేసింది. ఇలా ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా నిలవడంతో చేనేత కార్మికులు మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు ఉచిత విద్యుత్ ద్వారా వారి ఖర్చులు తగ్గి మరింత ఆదాయం పొందే అవకాశాలుంటాయి.

55
సామాన్య ప్రజలపైనా విద్యుత్ భారం తగ్గింపు..
Image Credit : unsplash

సామాన్య ప్రజలపైనా విద్యుత్ భారం తగ్గింపు..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజలపై కూడా విద్యుత్ భారం పడకుండా చర్యలు తీసుకుంది. విద్యుత్ రంగానికి సంబంధించి రూ. 20,228 కోట్లు భారం పడకుండా ఆ నిధులను ప్రభుత్వమే భరిస్తోంది. విద్యుత్ డిస్కంలు ప్రతిపాదించిన రూ.16 వేల కోట్ల ఆదాయ లోటును భరించడం, యూనిట్ పై 13 పైసలు తగ్గించడం, రైతులకు ఉచిత విద్యుత్ వంటి వాటితో వినియోగదారులకు యూనిట్ రేటు తగ్గి, చార్జీలు తగ్గాయి. నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా జరుగుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వ పథకాలు
నారా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్
నారా లోకేష్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays: దంచికొడుతున్న భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. రెడ్ అలర్ట్ జారీ
Recommended image2
Now Playing
కుప్పం ఋణం తీర్చుకుంటున్న బాబు | Chandrababu Kuppam Tour | Asianet News Telugu
Recommended image3
Now Playing
మా 90's కిడ్స్ కి చంద్రబాబు అంటే ఒక ఎమోషన్ | Chandrababu fan moment | Asianet News Telugu
Related Stories
Recommended image1
Free Current Process: ఫ్రీ కరెంట్‌ స్కీమ్‌ మార్గదర్శకాలు ఇవే !
Recommended image2
FREE current:  ఉచిత విద్యుత్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved