MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Budget Smartphones: ఏ వయసు వారికైనా సరే బెస్ట్ అండ్ బడ్జెట్ లో దొరికే స్మార్ట్ ఫోన్స్..ఓ లుక్కేయండి

Budget Smartphones: ఏ వయసు వారికైనా సరే బెస్ట్ అండ్ బడ్జెట్ లో దొరికే స్మార్ట్ ఫోన్స్..ఓ లుక్కేయండి

Budget Smartphones: టీనేజ్ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఖర్చు లేకుండానే ఫీచర్లు, బ్యాటరీ బ్యాకప్, కెమెరా ఉన్న ఫోన్లు చాలానేఉన్నాయి. శాంసంగ్, మోటో, నథింగ్ సహా ప్రముఖ బ్రాండ్లలో తక్కువ ధరకు లభించే బెస్ట్ 5 ఆండ్రాయిడ్ ఫోన్లు చూసేయండి.

3 Min read
Author : Nandini Arava
Published : Nov 17 2026, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు
Image Credit : chatgpt

టాప్ 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు

మీ టీనేజ్ పిల్లల చేతిలో పెట్టే తొలి స్మార్ట్‌ఫోన్ వారికి ఎప్పటికీ ఓ మధుర జ్ఞాపకమే. బాక్స్ ఓపెన్ చేయడం నుంచి ఫోన్ ఆన్ చేసే వరకు ఆ ఎగ్జైట్‌మెంట్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అనగానే భారీ ధర పెట్టాల్సిన అవసరం లేదు. పేరెంట్స్‌తో టచ్‌లో ఉండటానికి, ఫ్రెండ్స్‌తో మాట్లాడుకోవడానికి, స్టడీ నోట్స్ షేర్ చేసుకోవడానికి, సోషల్ మీడియా వాడుకోవడానికే ఎక్కువగా ఫోన్ కొనిస్తుంటారు.

అందుకే బడ్జెట్ ధరలో మంచి ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవడం స్మార్ట్ ఛాయిస్. మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్స్ ఉండటంతో ఏది బెస్ట్ అని తేల్చుకోవడం కాస్త కష్టమే. ధర తక్కువైనా సరే.. మంచి స్టోరేజ్, బ్రైట్ స్క్రీన్, రోజంతా వచ్చే బ్యాటరీ, డీసెంట్ కెమెరా, గేమింగ్ పెర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అన్నీ ఉండాలని పిల్లలు కోరుకుంటారు.

మీ సెర్చ్‌ను సింపుల్ చేయడానికి, పాపులర్ బ్రాండ్స్ నుంచి లేటెస్ట్‌గా వచ్చిన టాప్ 5 బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
శాంసంగ్ గెలాక్సీ ఏ17 5జీ (Samsung Galaxy A17 5G)
Image Credit : samsung

శాంసంగ్ గెలాక్సీ ఏ17 5జీ (Samsung Galaxy A17 5G)

దీని ధర - రూ.20,600.

స్పెషల్స్ - చాలా ఏళ్ల పాటు మన్నికగా ఉండే ఫోన్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే శాంసంగ్ దీనికి 2031 వరకు (6 ఏళ్లు) ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తోంది. 6.7 ఇంచుల బ్రైట్ అమోలెడ్ (AMOLED) స్క్రీన్, పవర్ బటన్‌లోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

పెర్ఫార్మెన్స్ & సెక్యూరిటీ - 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వస్తుంది. (మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో స్టోరేజ్ పెంచుకోవచ్చు, స్టోరేజ్‌ను ర్యామ్‌గా కూడా వాడుకోవచ్చు). పిల్లలు ఫోన్ ఎంతసేపు వాడుతున్నారో పేరెంట్స్ చెక్ చేయడానికి 'Google Family Link' సపోర్ట్ ఉంది.

కెమెరా & బ్యాటరీ - వెనుకవైపు 50 MP, 5 MP, 2 MP కెమెరాలు ఉన్నాయి. 5,000 mAh బ్యాటరీ రోజంతా పక్కాగా వస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, గెలాక్సీ ఏఐ లేకపోయినా.. గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ ఫీచర్లు ఇచ్చారు.

36
మోటో జి స్టైలస్ 2026 (Moto G Stylus 2026)
Image Credit : X

మోటో జి స్టైలస్ 2026 (Moto G Stylus 2026)

దీని ధర - 8GB/128GB వేరియంట్ రూ.42,000, 256GB వేరియంట్ రూ.50,400.

స్పెషల్స్ - ఇన్‌బిల్ట్ స్టైలస్ పెన్‌తో వస్తున్న బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇది. వీడియో ఎడిటింగ్, డ్రాయింగ్, గేమింగ్ ఇష్టపడే పిల్లలకు బాగా సెట్ అవుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్, 3.5mm ఆడియో జాక్ కూడా ఉన్నాయి.

స్క్రీన్ & ఏఐ ఫీచర్లు - 6.7 ఇంచుల అమోలెడ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో ఎండలోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. జెమినీ, కోపైలట్, పర్‌ప్లెక్సిటీ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. హ్యాండ్‌రైటింగ్ క్యాలిక్యులేటర్, స్కెచ్ టు ఇమేజ్ ఫీచర్లు స్టూడెంట్స్‌కు బాగా యూజ్ అవుతాయి.

బ్యాటరీ - 5,200 mAh బ్యాటరీ నార్మల్ వాడకంతో దాదాపు 2 రోజులు వస్తుంది. 68W వైర్డ్, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ మాత్రమే రావడం కాస్త మైనస్.

46
శాంసంగ్ గెలాక్సీ ఏ36 (Samsung Galaxy A36)
Image Credit : samsung

శాంసంగ్ గెలాక్సీ ఏ36 (Samsung Galaxy A36)

దీని ధర - రూ.28,500.

స్పెషల్స్ - పెట్టిన డబ్బులకు తగ్గ వాల్యూ ఇచ్చే ఫోన్ ఇది. 6 ఏళ్ల ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, 6.7 ఇంచుల బ్రైట్ డిస్‌ప్లేతో దీన్ని తీసుకొచ్చారు.

పెర్ఫార్మెన్స్ & కెమెరా - ప్లే స్టోర్‌లోని చాలా యాప్స్, గేమ్స్ ఇందులో స్మూత్‌గా రన్ అవుతాయి. కాలింగ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరాతో 4K / 30fps క్వాలిటీలో వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు.

బ్యాటరీ & ఏఐ - 5,000 mAh బ్యాటరీతో ఏకధాటిగా 16 గంటల పాటు వీడియోలు చూడొచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. సర్కిల్ టు సెర్చ్, ఫొటోల్లో వద్దనుకున్నవి తీసేసే ఆబ్జెక్ట్ ఎరేజర్, ఏఐ సెలెక్ట్ లాంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.

56
నథింగ్ ఫోన్ (4ఏ) ప్రో (Nothing Phone (4a) Pro)
Image Credit : X

నథింగ్ ఫోన్ (4ఏ) ప్రో (Nothing Phone (4a) Pro)

దీని ధర - 8GB/128GB మోడల్ రూ.41,900, 12GB/256GB మోడల్ రూ.50,300.

స్పెషల్స్ - భిన్నమైన డిజైన్, ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్ కోరుకునే యూత్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో రౌండ్ షేప్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉండటంతో గేమింగ్‌, స్పీడ్‌లో దూసుకుపోతుంది.

స్క్రీన్ & కెమెరా - 6.83 ఇంచుల పెద్ద అమోలెడ్ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. గూగుల్ పేరెంటల్ కంట్రోల్స్‌తో పాటు స్పెషల్ ఏఐ బటన్ ఇచ్చారు. ఈ ధరలో అరుదుగా కనిపించే 50 MP టెలిఫోటో లెన్స్ ఉండటంతో ఫొటోలు అదిరిపోతాయి.

బ్యాటరీ & సెక్యూరిటీ - 5,080 mAh బ్యాటరీకి తోడు 50W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఈ ఫోన్‌కు 3 మేజర్ ఓఎస్ అప్‌డేట్స్ వస్తాయి. స్విచ్ఛాఫ్ చేసే ముందు లాక్ స్క్రీన్ పాస్‌వర్డ్ అడిగే బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్ ఇందులో ఉంది.

66
మోటో జి పవర్ 2025 (Moto G Power 2025)
Image Credit : X

మోటో జి పవర్ 2025 (Moto G Power 2025)

దీని ధర - రూ.16,800.

స్పెషల్స్ - చాలా తక్కువ బడ్జెట్‌లో మోడ్రన్ ఫీచర్లున్న ఫోన్ చూస్తుంటే ఇదే బెస్ట్ ఛాయిస్. ధర తక్కువే అయినా.. వెనుకవైపు వీగన్ లెదర్ ఫినిషింగ్ ప్రీమియం లుక్ ఇస్తుంది. 6.8 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు.

మన్నిక & బ్యాటరీ - యూట్యూబ్, వీడియో కాల్స్ లాంటి రెగ్యులర్ వాడకానికి ఇది పర్ఫెక్ట్. 5,000 mAh బ్యాటరీకి 30W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. IP68/IP69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉండటంతో కాలేజీ స్టూడెంట్స్‌కు బాగా సెట్ అవుతుంది.

కెమెరా & స్టోరేజ్ - వెనుక 50 MP మెయిన్, 8 MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు ముందు 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. పగటి పూట ఫొటోలు బాగా వస్తాయి. ఆండ్రాయిడ్ 15తో వచ్చే ఈ ఫోన్‌లో 128GB స్టోరేజ్ ఇచ్చారు (1TB వరకు పెంచుకోవచ్చు).

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఆటోమొబైల్
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
(37.2 ov)121/3
SLSL
98
Day 1
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
15th T20 • WBBLT20
Result
SS-WSS-W
162/2
ST-WST-W
158
Sydney Sixers Women Won by 9 runs (D/L) method
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Redmi Note: ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీ..బడ్జెట్ ధరలో షియోమీ కొత్త ఫోన్
Recommended image2
Best Smart Watch : 10 రోజుల బ్యాటరీ లైఫ్, 100+ స్పోర్ట్స్ మోడ్స్.. ఈ వాచ్ చాలా స్మార్ట్ గురూ..!
Recommended image3
Robot Trainers: ఇంట్లో గిన్నెలు కడిగితే రూ. 85 వేలా? ఈ కొత్త జాబ్ చూస్తే షాక్ అవుతారు
Related Stories
Recommended image1
Varanasi Railway Station: 160 ఏళ్లకు పైగా చరిత్రను తనలో దాచుకున్న రైల్వేస్టేషన్..లక్షలాది మందికి ఇదే ప్రధాన ద్వారం
Recommended image2
Vizag: తీరానికి దగ్గరే ఉన్న సునామీలు, సైక్లోన్ లు టచ్ చేయని సిటీ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved